IPL 2024: ఎవరెవరు ఏ జట్టులో... | IPL 2024 Auction: Who Is In Which Teams, Complete Squads And Other Interesting Details Inside - Sakshi
Sakshi News home page

IPL 2024 All Teams Squads List: ఎవరెవరు ఏ జట్టులో...

Published Wed, Dec 20 2023 4:10 AM | Last Updated on Wed, Dec 20 2023 12:20 PM

Who is in which team in ipl - Sakshi

కోల్‌కతా నైట్‌రైడర్స్‌ (10) 
మిచెల్‌ స్టార్క్‌ (రూ. 24 కోట్ల 50 లక్షలు; ఆ్రస్టేలియా), ముజీబ్‌ రెహ్మాన్‌ (రూ. 2 కోట్లు; అఫ్గానిస్తాన్‌), షెర్ఫాన్‌ రూథర్‌ఫర్డ్‌ (రూ. కోటీ 50 లక్షలు; వెస్టిండీస్‌), అట్కిన్‌సన్‌ (రూ. 1 కోటీ; ఇంగ్లండ్‌), మనీశ్‌ పాండే (రూ. 50 లక్షలు; భారత్‌), కేఎస్‌ భరత్‌ (రూ. 50 లక్షలు; భారత్‌), చేతన్‌ సకారియా (రూ. 50 లక్షలు; భారత్‌), అంగ్‌క్రిష్‌ రఘువంశీ (రూ. 20 లక్షలు; భారత్‌), రమణ్‌దీప్‌ సింగ్‌ (రూ. 20 లక్షలు, భారత్‌), సకీబ్‌ హుస్సేన్‌ (రూ. 20 లక్షలు; భారత్‌). 

ఢిల్లీ క్యాపిటల్స్‌ (9) 
కుమార్‌ కుశాగ్ర (రూ. 7 కోట్ల 20 లక్షలు; భారత్‌), జై రిచర్డ్‌సన్‌ (రూ. 5 కోట్లు; ఆ్రస్టేలియా), హ్యారీ బ్రూక్‌ (రూ. 4 కోట్లు; ఇంగ్లండ్‌), సుమిత్‌ కుమార్‌ (రూ. 1 కోటీ; భారత్‌), షై హోప్‌ (రూ. 75 లక్షలు; వెస్టిండీస్‌), ట్రిస్టన్‌ స్టబ్స్‌ (రూ. 50 లక్షలు; దక్షిణాఫ్రికా), రికీ భుయ్‌ (రూ. 20 లక్షలు; భారత్‌), స్వస్తిక్‌ చికారా (రూ. 20 లక్షలు; భారత్‌), రసిక్‌ ధార్‌ (రూ. 20 లక్షలు; భారత్‌). 

గుజరాత్‌ టైటాన్స్‌ (8) 
స్పెన్సర్‌ జాన్సన్‌ (రూ. 10 కోట్లు; ఆస్ట్రేలియా), షారుఖ్‌ ఖాన్‌ (రూ. 7 కోట్ల 40 లక్షలు; భారత్‌), ఉమేశ్‌ యాదవ్‌ (రూ. 5 కోట్ల 80 లక్షలు; భారత్‌), రాబిన్‌ మింజ్‌ (రూ. 3 కోట్ల 60 లక్షలు; భారత్‌), సుశాంత్‌ మిశ్రా (రూ. 2 కోట్ల 20 లక్షలు; భారత్‌), కార్తీక్‌ త్యాగి (రూ. 60 లక్షలు; భారత్‌), అజ్మతుల్లా ఒమర్‌జాయ్‌ (రూ. 50 లక్షలు; అఫ్గానిస్తాన్‌), మానవ్‌ సుథర్‌ (రూ. 20 లక్షలు; భారత్‌). 

ముంబై ఇండియన్స్‌ (8) 
గెరాల్డ్‌ కొయెట్జీ (రూ. 5 కోట్లు; దక్షిణాఫ్రికా), నువాన్‌ తుషారా (రూ. 4 కోట్ల 80 లక్షలు; శ్రీలంక), దిల్షాన్‌ మదుషంక (రూ. 4 కోట్ల 60 లక్షలు; శ్రీలంక), మొహమ్మద్‌ నబీ (రూ. 1 కోటీ 50 లక్షలు; అఫ్గానిస్తాన్‌), శ్రేయస్‌ గోపాల్‌ (రూ. 20 లక్షలు; భారత్‌), శివాలిక్‌ శర్మ (రూ. 20 లక్షలు; భారత్‌), అన్షుల్‌ కంబోజ్‌ (రూ. 20 లక్షలు; భారత్‌), నమన్‌ ధీర్‌ (రూ. 20 లక్షలు; భారత్‌). 

పంజాబ్‌ కింగ్స్‌ (8) 
హర్షల్‌ పటేల్‌ (రూ. 11 కోట్ల 75 లక్షలు; భారత్‌), రిలీ రోసో (రూ. 8 కోట్లు; దక్షిణాఫ్రికా), క్రిస్‌ వోక్స్‌ (రూ. 4 కోట్ల 20 లక్షలు; ఇంగ్లండ్‌), తనయ్‌ త్యాగరాజన్‌ (రూ. 20 లక్షలు; భారత్‌), విశ్వనాథ్‌ ప్రతాప్‌ సింగ్‌ (రూ. 20 లక్షలు; భారత్‌), అశుతోష్‌ శర్మ (రూ. 20 లక్షలు; భారత్‌), శశాంక్‌ సింగ్‌ (రూ. 20 లక్షలు; భారత్‌), ప్రిన్స్‌ చౌధరీ (రూ. 20 లక్షలు; భారత్‌). 

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (6) 
ప్యాట్‌ కమిన్స్‌ (రూ. 20 కోట్ల 50 లక్షలు; ఆ్రస్టేలియా), ట్రవిస్‌ హెడ్‌ (రూ. 6 కోట్ల 80 లక్షలు; ఆ్రస్టేలియా), జైదేవ్‌ ఉనాద్కట్‌ (రూ. 1 కోటీ 60 లక్షలు; భారత్‌), హసరంగ (రూ. 1 కోటీ 50 లక్షలు; శ్రీలంక), జథవేద్‌ సుబ్రమణ్యన్‌ (రూ. 20 లక్షలు; భారత్‌), ఆకాశ్‌ సింగ్‌ (రూ. 20 లక్షలు; భారత్‌). 

లక్నో సూపర్‌ జెయింట్స్‌ (6) 
శివమ్‌ మావి (రూ. 6 కోట్ల 40 లక్షలు; భారత్‌), సిద్ధార్థ్‌ (రూ. 2 కోట్ల 40 లక్షలు; భారత్‌), డేవిడ్‌ విల్లీ (రూ. 2 కోట్లు; ఇంగ్లండ్‌), ఆష్టన్‌ టర్నర్‌ (రూ. 1 కోటీ; ఆస్ట్రేలియా), అర్షిన్‌ కులకర్ణి (రూ. 20 లక్షలు; భారత్‌), అర్షద్‌ ఖాన్‌ (రూ. 20 లక్షలు; భారత్‌). 

చెన్నై సూపర్‌ కింగ్స్‌ (6) 
డరైల్‌ మిచెల్‌ (రూ. 14 కోట్లు; న్యూజిలాండ్‌), సమీర్‌ రిజ్వీ (రూ. 8 కోట్ల 40 లక్షలు; భారత్‌), శార్దుల్‌ ఠాకూర్‌ (రూ. 4 కోట్లు; భారత్‌), ముస్తఫిజుర్‌ రెహా్మన్‌ (రూ. 2 కోట్లు; బంగ్లాదేశ్‌), రచిన్‌ రవీంద్ర (రూ. 1 కోటీ 80 లక్షలు; న్యూజిలాండ్‌), అవినాశ్‌ రావు (రూ. 20 లక్షలు; భారత్‌). 

రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (6) 
అల్జారీ జోసెఫ్‌ (రూ. 11 కోట్ల 50 లక్షలు; వెస్టిండీస్‌), యశ్‌ దయాల్‌ (రూ. 5 కోట్లు; భారత్‌), ఫెర్గూసన్‌ (రూ. 2 కోట్లు; న్యూజిలాండ్‌), టామ్‌ కరన్‌ (రూ. 1 కోటీ 50 లక్షలు; ఇంగ్లండ్‌), సౌరవ్‌ చౌహాన్‌ (రూ. 20 లక్షలు; భారత్‌), స్వప్నిల్‌ సింగ్‌ (రూ. 20 లక్షలు; భారత్‌). 

రాజస్తాన్‌ రాయల్స్‌ (5) 
రోవ్‌మన్‌ పావెల్‌ (రూ. 7 కోట్ల 40 లక్షలు; వెస్టిండీస్‌), శుభమ్‌ దూబే (రూ. 5 కోట్ల 80 లక్షలు; భారత్‌), నాండ్రె బర్జర్‌ (రూ. 50 లక్షలు; దక్షిణాఫ్రికా), టామ్‌ కోలెర్‌ కాడ్మోర్‌ (రూ. 40 లక్షలు; ఇంగ్లండ్‌), ఆబిద్‌ ముస్తాక్‌ (రూ. 20 లక్షలు; భారత్‌). 


ఉత్తరప్రదేశ్‌కు చెందిన సమీర్‌ రిజ్వీ దూకుడైన బ్యాటింగ్‌తో యూపీ టి20 లీగ్‌లో సత్తా చాటాడు. ఈ టోర్నీలో కాన్పూర్‌ సూపర్‌స్టార్స్‌ తరఫున 9 ఇన్నింగ్స్‌లలోనే 455 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు ఉన్నాయి. దాంతో మూడు ఐపీఎల్‌ టీమ్‌లు ట్రయల్స్‌కు పిలిచాయి. యూపీ టీమ్‌ అండర్‌–23 టైటిల్‌ గెలుచుకోవడంలో అతనిదే కీలక పాత్ర. అండర్‌–16 విజయ్‌ మర్చంట్‌ ట్రోఫీ మ్యాచ్‌లో ఒకే రోజు 280 పరుగులు చేసి రికార్డు రిజ్వీకి ఉంది. 

జార్ఖండ్‌ వికెట్‌ కీపర్‌ అయిన కుమార్‌ కుశాగ్ర కూడా ధాటిగా ఆడగల సమర్థుడు. విజయ్‌ హజారే టోర్నీలో మహారాష్ట్రపై 355 పరుగుల ఛేదనలో 37 బంతుల్లో 67 పరుగులు చేసి జట్టును గెలిపించడం అతడిని హైలైట్‌ చేసింది.  

మనోళ్లు నలుగురు... 
తాజా వేలంలో ఆంధ్ర ఆటగాళ్లు కేఎస్‌ భరత్‌ (రూ. 50 లక్షలు; కోల్‌కతా), రికీ భుయ్‌ (రూ. 20 లక్షలు; ఢిల్లీ), హైదరాబాద్‌ క్రికెటర్లు అరవెల్లి అవినాశ్‌ రావు (రూ. 20 లక్షలు; చెన్నై), తనయ్‌ త్యాగరాజన్‌ (పంజాబ్‌ కింగ్స్‌)లను ఆయా జట్లు ఎంచుకున్నాయి.  

స్మిత్‌కు మళ్లీ నిరాశే... 
టెస్టుల్లో దిగ్గజంగా, వన్డేల్లోనూ మంచి బ్యాటర్‌గా గుర్తింపు ఉన్న ఆ్రస్టేలియా స్టార్‌ స్టీవ్‌ స్మిత్‌ను టి20లకు తగడని ఐపీఎల్‌ ఫ్రాంచైజీలు భావిస్తున్నాయి. అందుకే గత ఏడాదిలాగే ఈసారి కూడా కనీస విలువ రూ.2 కోట్లకు కూడా ఎవరూ తీసుకోలేదు. వరల్డ్‌ కప్‌ విన్నింగ్‌ టీమ్‌లో ఉన్న ఆసీస్‌ బౌలర్‌ హాజల్‌వుడ్‌నూ ఎవరు ఎంచుకోలేదు.

వేలంలో అమ్ముడుపోని ఇతర గుర్తింపు పొందిన ఆటగాళ్లలో జేసన్‌ హోల్డర్‌ (వెస్టిండీస్‌), జిమ్మీ నీషమ్‌ (న్యూజిలాండ్‌), క్రిస్‌ జోర్డాన్‌ (ఇంగ్లండ్‌), టిమ్‌ సౌతీ (న్యూజిలాండ్‌), స్యామ్‌ బిల్లింగ్స్‌ (ఆ్రస్టేలియా), మిల్నే (న్యూజిలాండ్‌), తబ్రీజ్‌ షమ్సీ (దక్షిణాఫ్రికా), హనుమ విహారి, సర్ఫరాజ్‌ ఖాన్‌ (భారత్‌) తదితరులు ఉన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement