‘తైక్వాండో’ ధీరులకు బహుమతులు
‘తైక్వాండో’ ధీరులకు బహుమతులు
Published Thu, Aug 18 2016 7:11 PM | Last Updated on Mon, Sep 4 2017 9:50 AM
రేపల్లె: పట్టణంలోని ఏబీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల క్రీడాప్రాంగణంలో ఈ నెల 15వ తేదీన అండర్–14, అండర్–17 విభాగాలలో నిర్వహించిన రాష్ట్ర తైక్వాండో ట్రైల్స్, జిల్లా తైక్వాండో ఛాంపియన్‌షిప్ పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బుధవారం క్రీడాప్రాంగణంలో మున్సిపల్ చైర్మన్ తాడివాక శ్రీనివాసరావు బహుమతులు ప్రదానం చేశారు. గెలుపొందిన క్రీడాకారులు ఈ నెల 27 నుంచి విజయనగరంలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొంటారని చెప్పారు. కార్యక్రమంలో తైక్వాండో అసోసియేషన్ జిల్లా సెక్రటరీ కే.జగన్మోహనరావు, పీఈటీ బుజ్జి తదితరులు పాల్గొన్నారు.
విజేతలు వీరే..
అండర్–17 జూనియర్ బాలుర విభాగంలో నరసరావుపేటకు చెందిన ఎం.వి.ఎన్.మణికంఠ, పి.చైతన్యకుమార్, గుంటూరుకు చెందిన వి.వి.సాయిరామ్‌కుమార్, డి.పార్థుశివసాయికుమార్, కొల్లూరుకు చెందిన ఎన్.పవన్‌కుమార్, రేపల్లెకు చెందిన కె.క్రాంతివర్మ, పి.రాజదేవ్‌కుమార్, జి.హరి, కె.నాగవంశీ, బాలికల విభాగంలో రేపల్లెకు చెందిన చైతన్య, సాయిశర్వాణీ, గుంటూరుకు చెందిన జె.ఉమామహేశ్వరి, అండర్–14 విభాగంలో గుంటూరుకు చెందిన వి.హర్షవర్థనరెడ్డి, జె.దేశ్‌ముఖ్, మహేష్, తెనాలికి చెందిన దేవకీనందన్, కొల్లూరుకు చెందిన ధీరజ్ నాగసాయికుమార్, నరసరావుపేటకు చెందిన మోహన్‌గోపాల్, బాలికల విభాగంలో గుంటూరుకు చెందిన వై.జ్ఞానశివాని, కె.యశశ్విని, టి.లక్ష్మీలావణ్య, తెనాలికి చెందిన టి.లావణ్య, కొల్లూరుకు చెందిన ఆర్‌పీ మమత, నరసరావుపేటకు చెందిన డి.భానుసాయిలక్ష్మి, రేపల్లెకు చెందిన వి.లిఖితా మనోజ్ఞ విజయం సాధించి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారని చెప్పారు. వీరిని పలువురు అభినందించారు.
Advertisement
Advertisement