తైక్వాండో పోటీల్లో ప్రతిభ
మారీసుపేట: జిల్లా తైక్వాండో పోటీలలో తెనాలి సీఎంసీ ఫిటెనెస్ జోన్ తైక్వాండో అకాడమీకి చెందిన ఏడుగురు క్రీడాకారులు ఆరుగురు పతకాలు సాధించారని మేనేజింగ్ డైరెక్టర్ కొక్కిలగడ్డ ప్రసాదబాబు మంగళవారం తెలిపారు. జిల్లా తైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం రేపల్లెలో పోటీలు జరిగాయని చెప్పారు. ఎస్.దేవకీనందన్, ఎస్.దేవిక్షకర్ బంగారు పతకాలు, ఎం నూతన్ సాయినాథ్, సిహెచ్ కిరణ్ కుమార్ వెండి పతకాలు, బి.గోపినాథ్, ఎం జోశ్రీత కాంస్య పతకాలు సాధించినట్లు తెలిపారు. వీరిని చంద్స్ జిమ్ మేనేజింగ్ డైరెక్టర్ చందు వెంకటేశ్వరరావు, కొక్కిలగడ్డ ప్రసాదబాబు, తైక్వాండో మాస్టర్ ఎం బాజీ అభినందించారు.