Competion
-
పోటీ లేకుండా చేస్తున్న స్విగ్గీ, జొమాటో
ముంబై: ఆన్లైన్ ఫుడ్ డెలివరీ యాప్స్ జొమాటో, స్విగ్గీలు పోటీతత్వ చట్టాలను ఉల్లంఘించినట్లు కాంటిషన్ కమీషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) దర్యాప్తులో తేలింది. కొన్ని రెస్టారెంట్ల భాగస్వాములతో ప్రత్యేక ఒప్పందాలు కుదుర్చుకొని ఇరు సంస్థలు అనైతిక వ్యాపారాలకు పాల్పడినట్లు పేర్కొంది.‘తక్కువ కమీషన్ తీసుకుంటూ జొమాటో ఒప్పందం కుదుర్చుకుంది. తన ఫ్లాట్‌ఫామ్‌పై నమోదైతే, వ్యాపారాభివృద్ధికి తోడ్పాడతామంటూ స్విగ్గీ హామీలిస్తోంది. తద్వారా ఇరు సంస్థలు తమకు పోటీ లేకుండా పొటీతత్వ చట్టాలను అతిక్రమించాయి’ అని సీసీఐ పత్రాలు స్పష్టం చేశాయి. -
OnePlus: ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా మూడు స్క్రీన్లు!!
OnePlus Foldable Phone: స్మార్ట్ ఫోన్ మార్కెట్ పోటీలో వైవిధ్యం ప్రదర్శిస్తూ దూసుకుపోతోంది వన్‌ఫ్లస్ బ్రాండ్. జనాల్లో క్రేజ్ పెంచుకునేందుకు ఇప్పటికే ఆకర్షణీయమైన ప్రొడక్టులను ప్రకటించి.. టైం చూసి మార్కెట్లోకి వదలడానికి ఎదురుచూస్తోంది. తాజాగా మరో ముఖ్యమైన అప్డేట్ను ప్రకటించింది. వన్‌ఫ్లస్ నుంచి త్వరలో ఫోల్డబుల్ ఫోన్ (మడత ఫోన్) మార్కెట్లోకి తీసుకురానుంది. లెట్స్‌గోడిజిటల్ ప్రకారం.. ఫోల్డబుల్ ఫోన్‌ను తీసుకురాబోతోందట. అంతేకాదు అది రెండు మడతలతో కాకుండా మూడు మడతలతో ఉండబోతోదట!. కిందటి ఏడాదిలోనే చైనాలో పేటెంట్ డాక్యుమెంట్లను bbk electronics కంపెనీ సమర్పించిందని, ఈ ఏడాది జులైలో ఆ డాక్యుమెంట్ పబ్లిష్ కూడా అయ్యిందని వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆఫీస్ డేటాబేస్ వివరాల ద్వారా వెల్లడైంది. ప్రతీకాత్మక చిత్రం ఇక వన్‌ఫ్లస్ తేబోతున్న ఫోల్డబుల్ ఫోన్ వేర్వేరు దిశలో(ట్రయాంగిల్.. రోటేటింగ్ టర్నింగ్ ప్లేట్) మడతపెట్టేదిగా ఉంటుందని, యూజర్ అప్లికేషన్లు సైతం ఎక్కువగా అందిస్తుందని ఆ డాక్యుమెంట్లలో ఉంది. స్లైడింగ్ కీ ప్యాడ్‌తో ఇది రానుంది. అంతేకాదు డబుల్ హింగ్డ్ టెక్నాలజీతో సరికొత్త ఒరవడి సృష్టించేందుకు సిద్ధమైంది. నిజానికి వన్‌ఫ్లస్ నుంచి మడత ఫోన్ రానుందనే వార్త చాలాకాలమే వినిపించింది. శాంసంగ్ పోటీని తట్టుకునేందుకు ముఖ్యంగా గెలాక్సీ జీ ఫోల్డ్ సిరీస్‌ను బీట్ చేసేందుకు తీసుకొస్తుందని వార్తలు వినిపించాయి. కానీ, ఆ టైంలో వన్‌ఫ్లస్ ఎలాంటి కన్ఫర్మేషన్ ఇవ్వలేదు. అయితే తాజా నిర్ధారణతో త్రీ ఫోల్డ్స్ ఫోన్ ద్వారా స్మార్ట్ ఫోన్ ప్రపంచంలో గేమ్ ఛేంజర్‌గా నిలవాలని వన్‌ఫ్లస్ ప్రయత్నాలు చేస్తోంది. స్మార్ట్ఫోన్ల కొనుగోళ్లపై బంపరాఫర్! ఏకంగా 40 శాతం తగ్గింపు!.. వివరాలు -
అమెజాన్‌పై సంచలన కథనం
పోటీ ప్రపంచంలో లాభాలే ధ్యేయంగా పని చేసే క్రమంలో ఈ-కామర్స్ కింగ్ ‘అమెజాన్’ దిగజారి ప్రవర్తిస్తోందని తాజాగా రాయిటర్స్ ఓ సంచలన కథనం ప్రచురించింది. స్టింగ్ ఆపరేషన్ ద్వారా India Private Brands Programme పేరుతో సేకరించిన పత్రాల వివరాల్ని తాజాగా వెల్లడించింది. ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ మార్కెటింగ్‌లో దిగజారి ప్రవర్తిస్తుందనే విమర్శ ఎప్పటి నుంచో ఉంది. అయితే ఈ వ్యవహారాన్ని ఇప్పుడు భారత్‌లో పెద్ద ఎత్తున్న నిర్వహిస్తోందన్నది రాయిటర్స్ కథనంలో ఆరోపణ. ఈ మేరకు వివిధ దేశాలకు సంబంధించి అమెజాన్ అనుసరిస్తున్న మార్కెటింగ్ స్ట్రాటజీని వెల్లడిస్తూ.. అందులో భారత్ ప్రస్తావన సైతం తీసుకొచ్చింది. ఇతర బ్రాండ్ ప్రొడక్టులను కాపీ చేసి.. ప్రొడక్టులను తయారు చేయడం, వాటిని ప్రమోట్ చేయడంలోనూ అమెజాన్ టాప్ ప్రయారిటీ ఇస్తోందనేది రాయిటర్స్ ప్రధాన ఆరోపణ. భారత్ అమెజాన్ మార్కెట్లో లోకల్ బ్రాండ్లను సైతం వదలకుండా కాపీ కొడుతోందని, ఇక అంతర్గత సమాచార సేకరణతో ఈ అనైతిక కార్యకలాపాలకు పాల్పడుతోందని సదరు కథనం పేర్కొంది. అంతేకాదు ఈ వ్యవహారం ఇప్పుడు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా దృష్టికి సైతం వెళ్లినట్లు రూటర్స్ కథనం తెలిపింది. కిషోర్ బియానీ ఆధ్వర్యంలోని జాన్ మిల్లర్.. అమెజాన్ ట్రిక్ మార్కెటింగ్‌కు ఎక్కువగా బలైందని వెల్లడించింది. అమెజాన్‌కు సంబంధించిన బ్రాండ్లతో పాటు అమెజాన్ టాప్ ప్రయారిటీ ఉన్న బ్రాండ్లనే(రివ్యూలతో సంబంధం లేకుండా) వినియోగదారులకు టాప్ సెర్చ్‌లో చూపిస్తోందనేది(డిస్ప్లే చేయడం) చేస్తోందట. గతంలో ఇలాంటి వ్యవహారంతో ఇబ్బందులు, నష్టాల్ని చవిచూసిన అమెజాన్.. ఇప్పుడు పెద్ద ఎత్తున్న ఇలాంటి వ్యవహారానికి తెరలేపిందనేది రాయిటర్స్ కథన సారాంశం. మరి అమెజాన్ దీనిపై ఎలా స్పందిస్తుందో చూడాలి. చదవండి: amazon.. ఈ ఆఫర్‌ను అస్సలు మిస్ చేసుకోవద్దు -
కేంద్రం ప్రభుత్వం కొత్త పోటీ.. 15 లక్షలు గెలుచుకునే అవకాశం!
సాక్షి, వెబ్‌డెస్క్ : దేశ ప్రజలకు కేంద్ర ఆర్థిక శాఖ ఆసక్తికరమైన పోటీ పెట్టింది. తాము ప్రవేశపెట్టిన కొత్త పథకానికి అనువైన పేరు, ట్యాగ్‌లైన్, లోగోలను సూచించిన వారికి భారీ బహుమతులు ఇస్తామని ప్రకటించింది. ఈ పోటీకి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి ఆగస్టు 15లోగా కేంద్రం ఇటీవల మౌలిక సదుపాయల కల్పన కోసం డెవలప్మెంట్ ఫైనాన్షియల్ ఇన్సిస్టిట్యూషన్‌కి ఆమోదం తెలిపింది. ఇప్పుడీ డీఎఫ్ఐ... తీరు తెన్నులు, లక్ష్యాలను స్ఫూరించేలా ఈ పథకానికి పేరు, ట్యాగ్‌లైన్, లోగోలను సూచించాలని కేంద్ర ఆర్థిక శాఖ కోరింది. ఆగస్టు 15వ తేది సాయంత్రం 5:30 గంటల్లోగా తమ ఎంట్రీలను పంపించాలని తెలిపింది. బహుమతులు ఈ పోటీలో ఒక్కో విభాగంలో మొదటి స్థానంలో నిలిచిన వారికి రూ. 5 లక్షల వంతున మొత్తం రూ. 15 లక్షలు బహుమతిగా అందిస్తామని పేర్కొంది. రెండో స్థానంలో నిలిచిన వారికి రూ. 3 లక్షలు, మూడో స్థానంలో నిలిచిన ఎంట్రీలకు రూ. 2 లక్షల వంతున బహుమతులు అందివ్వనున్నారు. ఇలా పంపండి దేశ సంస్కృతిని ప్రతిబింబిస్తూ ప్రజలందరికీ తేలికగా అర్థం అయ్యేలా, పలకడానికి సులువుగా ఉండేలా డీఎఫ్ఐకి సంబంధించిన పేరు, ట్యాగ్‌లైన్, లోగోలు ఉండాలని తెలిపింది. పేరు, ట్యాగ్‌లైన్, లోగో డిజైన్లు రూపొందించిన వారు https://www.mygov.in/task/name-tagline-and-logo-contest-development-financial-institution లింక్ ద్వారా కేంద్రానికి ఎంట్రీలను పంపివ్వాల్సి ఉంటుంది. డీఎఫ్ఐ కేంద్ర ప్రభుత్వం ఇటీవల నేషనల్ బ్యాంక్ ఫర్ ఫైనాన్సింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, డెవలప్మెంట్ యాక్ట్ 2021 ద్వారా డెవలప్మెంట్ ఫైనాన్షియల్ ఇన్సిస్టిట్యూషన్ (డీఎఫ్ఐ)కి ఆమోదం తెలిపింది. డీఎప్ఐ ద్వారా దేశంలో మౌలిక సదుపాయాల కల్పన, మెరుగు పరచడం కోసం భారీ ఎత్తున ప్రాజెక్టులు చేపట్టాలని నిర్ణయించింది. సుమారు 1.11 లక్షల కోట్ల వ్యయంతో 7,000 ప్రాజెక్టులు చేపట్టబోతుంది. ఈ పథకం ద్వారా దేశ రూపురేఖలు మారిపోతాయని కేంద్రం చెబుతోంది. .@FinMinIndia in association with @mygovindia is announcing a contest to crowdsource the name, tagline and logo of the new Development Financial Institution. Cash prizes of up to Rs 5 lakh in each category! Last date for entries is 15.08.2021. https://t.co/uK5AojlWlB (1/2) — NSitharamanOffice (@nsitharamanoffc) July 28, 2021 The setting up of a Development Financial Institution was announced by Finance Minister Smt @nsitharaman in Budget 2021-22. Both Houses of Parliament passed the National Bank for Financing Infrastructure and Development (NaBFID) Bill 2021 in March 2021. (2/2) pic.twitter.com/8AFa26Bdxf — NSitharamanOffice (@nsitharamanoffc) July 28, 2021 -
తైక్వాండో పోటీల్లో ప్రతిభ
మారీసుపేట: జిల్లా తైక్వాండో పోటీలలో తెనాలి సీఎంసీ ఫిటెనెస్ జోన్ తైక్వాండో అకాడమీకి చెందిన ఏడుగురు క్రీడాకారులు ఆరుగురు పతకాలు సాధించారని మేనేజింగ్ డైరెక్టర్ కొక్కిలగడ్డ ప్రసాదబాబు మంగళవారం తెలిపారు. జిల్లా తైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం రేపల్లెలో పోటీలు జరిగాయని చెప్పారు. ఎస్.దేవకీనందన్, ఎస్.దేవిక్షకర్ బంగారు పతకాలు, ఎం నూతన్ సాయినాథ్, సిహెచ్ కిరణ్ కుమార్ వెండి పతకాలు, బి.గోపినాథ్, ఎం జోశ్రీత కాంస్య పతకాలు సాధించినట్లు తెలిపారు. వీరిని చంద్స్ జిమ్ మేనేజింగ్ డైరెక్టర్ చందు వెంకటేశ్వరరావు, కొక్కిలగడ్డ ప్రసాదబాబు, తైక్వాండో మాస్టర్ ఎం బాజీ అభినందించారు. -
ముగిసిన స్నూకర్స్ పోటీలు
తెనాలి (మారీసుపేట) : కోగంటి శివప్రసాద్ మెమోరియల్ అమరావతి స్టేట్ స్నూకర్స్ టోర్నమెంట్ శనివారం రాత్రితో ముగిశాయి. కొత్తపేటలోని కనికచర్ల కల్యాణమండపంలో గురువారం నుంచి పోటీలు జరుగుతున్న విషయం తెలిసిందే. పోటీలలో విజయవాడకు చెందిన వలీ, హరి, పరమేశ్‌లు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు సాధించినట్లు నిర్వాహకులు కోగంటి రోహిత్ తెలిపారు. వీరికి శనివారం రాత్రి మిర్చి హోటల్లో బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో ఏపీపీ కె.రాంబాబు, టీడీపీ నాయకులు వి.మురళి, కె.మురళి, కౌన్సిలర్లు తెనాలి సుధాకర్,పసుపులేటి త్రిమూర్తి, మాజీ కౌన్సిలర్ అత్తోట వందనం తదితరులు పాల్గొన్నారు. -
రైఫిల్ షూటింగ్లో విజ్ఞాన్ విద్యార్థిని ప్రతిభ
చేబ్రోలు : రైఫిల్ షూటింగ్లో తమ విద్యార్థిని బోయపాటి తేజస్వి ఉత్తమ ప్రతిభ కనబరిచిందని విజ్ఞాన్ యూనివర్సిటీ బీటెక్ ఫస్టియర్ విభాగాధిపతి ఎన్.శ్రీనివాసు తెలిపారు. చేబ్రోలు మండలం వడ్లమూడిలోని విజ్ఞాన్ యూనివర్సిటీలో సోమవారం విద్యార్థినికి అభినందన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాసు మాట్లాడుతూ ఈ నెల 21 నుంచి 24 వరకు గుంటూరులోని బ్రాడిపేటలో ఉన్న ఇండియన్ అకాడమీ షూటింగ్ స్పోర్ట్‌లో రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో 17వ రాష్ట్రస్థాయి రైఫిల్ షూటింగ్ పోటీలు జరిగాయని తెలిపారు. ఎయిర్ పిస్టల్ జూనియర్, సీనియర్ మహిళల విభాగాల్లో తమ విద్యార్థిని బోయపాటి తేజస్వి అత్యుత్తమ ప్రతిభ కనబరిచి రెండు స్వర్ణపతకాలు సాధించినట్లు తెలిపారు. ప్రతిభ చూపిన విద్యార్థినిని ఛైర్మన్ లావు రత్తయ్య, వైస్ ఛైర్మన్ శ్రీకృష్ణదేవరాయలు, వీసీ డాక్టర్ సి.తంగరాజ్, రెక్టార్ బి.రామ్మూర్తి తదితరులు అభినందించారు. -
హోరాహోరీగా రైఫిల్ షూటింగ్ పోటీలు
గుంటూరు స్పోర్ట్స్: రాష్ట్రస్థాయి రైఫిల్ షూటింగ్ పోటీలు హోరాహోరీగా సాగుతున్నాయి. స్థానిక బ్రాడీపేటలోని రైఫిల్ షూటింగ్ అకాడమీలో శనివారం సబ్ జూనియర్, జూనియర్, పురుషుల, మహిళాల విభాగాల్లో పోటీలు నిర్వహించినట్లు రైఫిల్ షూటింగ్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రాజ్‌కుమార్ తెలిపారు. ఎయిర్ రైఫిల్, ఎయిర్ పిస్టల్ విభాగాల్లో జరిగిన పోటీల్లో 188 మంది క్రీడాకారులు పాల్గొన్నారన్నారు. ఎయిర్ రైఫిల్ పురుషుల విభాగంలో ఎస్ ముత్యాలరావు(ఈస్ట్ గోదావరి), జూనియర్ మెన్స్ విభాగంలో కే వేదకిరణ్ (గుంటూరు), మహిశాల విభాగంలో మనోజ్ఞ (కృష్ణా), సబ్ జూనియర్ మహిళాల విభాగంలో అనూష(వైఎస్సార్ కడప) అధిక్యంలో ఉన్నారని తెలిపారు. ఎయిర్ పిస్టల్ పురుషుల విభాగంలో ఆకాష్ కాజ (కృష్ణా), సబ్ జూనియర్ పురుషుల విభాగంలో చంద్రదీప్ రెడ్డి (వైఎస్సార్ కడప) అధిక్యంలో ఉన్నట్లు చెప్పారు. ఆదివారం జరిగే ముగింపు, బహుమతి ప్రదానోత్సవానికి విజయవాడ పోలీస్ కమిషనర్ ఆఫ్ పోలీస్ గౌతమ్ సవాంగ్, గుంటూరు జిల్లా అర్బన్ ఎస్పీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి హాజరవుతారని తెలిపారు. -
రైఫిల్ షూటింగ్ పోటీలు ప్రారంభం
గుంటూరు స్పోర్ట్స్: జాతీయ, అంతర్జాతీయ పోటీలలో అత్యధిక పతకాలు సాధించేందుకు అవకాశం వున్న క్రీడ రైఫిల్ షూటింగ్ అని శాప్ ఓఎస్డీ, గుంటూరు జిల్లా ఇన్చార్జ్ డీఎస్డీఓ పి.రామకష్ణ అన్నారు. ఆంద్రప్రదేశ్ రైఫిల్ అసోసియేషన్ అధ్వర్యంలో బుధవారం స్దానిక బ్రాడీపేటలోని రైఫిల్ షూటింగ్ అకాడమిలో 17వ ఏ.పీ స్టేట్ షూటింగ్ ఛాంపియన్ షిప్–2016 పోటీలు ప్రారంభం అయ్యాయి. ముఖ్యఅతిధిగా హజరైన రామకష్ణ టోర్నమెంట్‌ను ప్రారంభించారు. ఈసందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ ఒలంపిక్స్, కామన్వెల్త్ క్రీడల్లో మన క్రీడాకారులు అనే పతకాలు సాధించారని చెప్పారు. వ్యక్తిగత విభాగంలో అనేక పతకాలు సాధించే అవకాశం వున్న క్రీడ రైఫిల్ షూటింగ్ అన్నారు. అంతే కాకుండా తక్కువ సమయంలో జాతీయ, అంతర్జాతీయ స్ధాయికి ఎదిగే అవకాశం వుందన్నారు. టోర్నమెంట్లో పురుషుల, మహిళాల, సబ్ జూనియర్, జూనియర్, వెటరన్ విభాగాలలో పోటీలు జరుగుతాయని టోర్నమెంట్ నిర్వహకులు వెల్లడించారు. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్, ఎయిర్ ఫిస్టల్ క్రీడాంశాలలో పోటీలు జరుగుతాయన్నారు. కార్యక్రమంలో బీ.శ్రీనివాసరావు, క్రీడాకారులు, తదితరులు పాల్గోన్నారు.