హోరాహోరీగా రైఫిల్ షూటింగ్ పోటీలు
Published Sun, Jul 24 2016 7:29 PM | Last Updated on Mon, Sep 4 2017 6:04 AM
గుంటూరు స్పోర్ట్స్: రాష్ట్రస్థాయి రైఫిల్ షూటింగ్ పోటీలు హోరాహోరీగా సాగుతున్నాయి. స్థానిక బ్రాడీపేటలోని రైఫిల్ షూటింగ్ అకాడమీలో శనివారం సబ్ జూనియర్, జూనియర్, పురుషుల, మహిళాల విభాగాల్లో పోటీలు నిర్వహించినట్లు రైఫిల్ షూటింగ్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రాజ్‌కుమార్ తెలిపారు. ఎయిర్ రైఫిల్, ఎయిర్ పిస్టల్ విభాగాల్లో జరిగిన పోటీల్లో 188 మంది క్రీడాకారులు పాల్గొన్నారన్నారు. ఎయిర్ రైఫిల్ పురుషుల విభాగంలో ఎస్ ముత్యాలరావు(ఈస్ట్ గోదావరి), జూనియర్ మెన్స్ విభాగంలో కే వేదకిరణ్ (గుంటూరు), మహిశాల విభాగంలో మనోజ్ఞ (కృష్ణా), సబ్ జూనియర్ మహిళాల విభాగంలో అనూష(వైఎస్సార్ కడప) అధిక్యంలో ఉన్నారని తెలిపారు. ఎయిర్ పిస్టల్ పురుషుల విభాగంలో ఆకాష్ కాజ (కృష్ణా), సబ్ జూనియర్ పురుషుల విభాగంలో చంద్రదీప్ రెడ్డి (వైఎస్సార్ కడప) అధిక్యంలో ఉన్నట్లు చెప్పారు. ఆదివారం జరిగే ముగింపు, బహుమతి ప్రదానోత్సవానికి విజయవాడ పోలీస్ కమిషనర్ ఆఫ్ పోలీస్ గౌతమ్ సవాంగ్, గుంటూరు జిల్లా అర్బన్ ఎస్పీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి హాజరవుతారని తెలిపారు.
Advertisement
Advertisement