అమెజాన్​పై సంచలన కథనం | Amazon Copy Products And Rigg To Promote Own Brands Says Reuters | Sakshi
Sakshi News home page

Amazon: సొంత బ్రాండ్​లకే సెర్చ్​లో టాప్​ ప్రయారిటీ.. భారత్​లో కాపీ ప్రొడక్ట్స్​!?

Published Thu, Oct 14 2021 11:47 AM | Last Updated on Thu, Oct 14 2021 11:55 AM

Amazon Copy Products And Rigg To Promote Own Brands Says Reuters - Sakshi

పోటీ ప్రపంచంలో లాభాలే ధ్యేయంగా పని చేసే క్రమంలో ఈ‌‌-కామర్స్​ కింగ్​ ‘అమెజాన్’​ దిగజారి ప్రవర్తిస్తోందని తాజాగా రాయిటర్స్​ ఓ​ సంచలన కథనం ప్రచురించింది. స్టింగ్‌ ఆపరేషన్​ ద్వారా India Private Brands Programme పేరుతో సేకరించిన పత్రాల వివరాల్ని తాజాగా వెల్లడించింది.  
 

ఈ‌‌‌‌‌‌-కామర్స్​ దిగ్గజం అమెజాన్ మార్కెటింగ్​లో దిగజారి ప్రవర్తిస్తుందనే విమర్శ ఎప్పటి నుంచో ఉంది. అయితే ఈ వ్యవహారాన్ని ఇప్పుడు భారత్​లో పెద్ద ఎత్తున్న నిర్వహిస్తోందన్నది రాయిటర్స్​ కథనంలో​ ఆరోపణ. ఈ మేరకు వివిధ దేశాలకు సంబంధించి అమెజాన్​ అనుసరిస్తున్న మార్కెటింగ్​ స్ట్రాటజీని వెల్లడిస్తూ.. అందులో భారత్​ ప్రస్తావన సైతం తీసుకొచ్చింది. 

ఇతర బ్రాండ్​ ప్రొడక్టులను కాపీ చేసి.. ప్రొడక్టులను తయారు చేయడం, వాటిని ప్రమోట్​ చేయడంలోనూ అమెజాన్​ టాప్​ ప్రయారిటీ ఇస్తోందనేది రాయిటర్స్​ ప్రధాన ఆరోపణ. భారత్​ అమెజాన్​ మార్కెట్​లో లోకల్​ బ్రాండ్​లను సైతం వదలకుండా కాపీ కొడుతోందని, ఇక అంతర్గత సమాచార సేకరణతో ఈ అనైతిక కార్యకలాపాలకు పాల్పడుతోందని సదరు కథనం పేర్కొంది. అంతేకాదు ఈ వ్యవహారం ఇప్పుడు కాంపిటీషన్​ కమిషన్​ ఆఫ్​ ఇండియా దృష్టికి సైతం వెళ్లినట్లు రూటర్స్​ కథనం తెలిపింది. కిషోర్​ బియానీ ఆధ్వర్యంలోని జాన్​ మిల్లర్​.. అమెజాన్​ ట్రిక్​ మార్కెటింగ్​కు ఎక్కువగా బలైందని వెల్లడించింది. 

అమెజాన్​కు సంబంధించిన బ్రాండ్​లతో పాటు అమెజాన్ టాప్​ ప్రయారిటీ ఉన్న బ్రాండ్​లనే(రివ్యూలతో సంబంధం లేకుండా) వినియోగదారులకు టాప్​ సెర్చ్​లో చూపిస్తోందనేది(డిస్​ప్లే చేయడం) చేస్తోందట. గతంలో ఇలాంటి వ్యవహారంతో ఇబ్బందులు, నష్టాల్ని చవిచూసిన అమెజాన్​.. ఇప్పుడు పెద్ద ఎత్తున్న ఇలాంటి వ్యవహారానికి తెరలేపిందనేది రాయిటర్స్​ కథన సారాంశం. మరి అమెజాన్​ దీనిపై ఎలా స్పందిస్తుందో చూడాలి.

చదవండి: amazon.. ఈ ఆఫర్‌ను అస్సలు మిస్‌ చేసుకోవద్దు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement