ముంబై: ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ యాప్స్ జొమాటో, స్విగ్గీలు పోటీతత్వ చట్టాలను ఉల్లంఘించినట్లు కాంటిషన్ కమీషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) దర్యాప్తులో తేలింది. కొన్ని రెస్టారెంట్ల భాగస్వాములతో ప్రత్యేక ఒప్పందాలు కుదుర్చుకొని ఇరు సంస్థలు అనైతిక వ్యాపారాలకు పాల్పడినట్లు పేర్కొంది.
‘తక్కువ కమీషన్ తీసుకుంటూ జొమాటో ఒప్పందం కుదుర్చుకుంది. తన ఫ్లాట్‌ఫామ్‌పై నమోదైతే, వ్యాపారాభివృద్ధికి తోడ్పాడతామంటూ స్విగ్గీ హామీలిస్తోంది. తద్వారా ఇరు సంస్థలు తమకు పోటీ లేకుండా పొటీతత్వ చట్టాలను అతిక్రమించాయి’ అని సీసీఐ పత్రాలు స్పష్టం చేశాయి.
Comments
Please login to add a commentAdd a comment