ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది డిసెంబర్ నుంచి భారత్‌లో ఫుడ్ డెలివరీ బిజినెస్‌ను షట్‌డౌన్ చేస్తున్నట్లు ప్రకటించింది. దేశీయా ఫుడ్ డెలివరీ యాప్స్ స్విగ్గీ, జొమాటో తరహాలో లాభాలు గడించలేక ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
టెక్ క్రంచ్ నివేదిక ప్రకారం.. 2020 కోవిడ్-19 మహమ్మారి విజృంభణ సమయంలో ఇతర నిత్యావసరాల కోసం షాపింగ్ చేయడంతో పాటు అమెజాన్‌లో ఫుడ్ ఆర్డర్ పెట్టాలని కస్టమర్లు భావించారు. దీంతో వినియోగదారుల డిమాండ్ మేరకు అమెజాన్ సంస్థ భారత్‌లో 20 బిలియన్ డాలర‍్లు పెట్టుబడిగా పెట్టి ‘అమెజాన్ ఫుడ్’ సర్వీసుల్ని ప్రారంభించింది. తొలత ఈ అమెజాన్ ఫుడ్ సేవలు బెంగళూరు కేంద్రంగా ప్రారంభయ్యాయి.
అయితే ఇప్పుడు ఆ సేవల్ని అమెజాన్ నిలిపి వేస్తున్నట్లు టెక్ క్రంచ్ తన నివేదికలో పేర్కొంది. డిసెంబర్ 29వరకు అమెజాన్ ఒప్పొందం చేసుకున్న రెస్టారెంట్లతో భాగస్వామ్యం కొనసాగించనుంది. అప్పటి వరకు అమెజాన్ ఫుడ్‌లో బుక్ చేసుకున్న ఆర్డర్‌లను అందిస్తామని ఈకామర్స్ దిగ్గజం తెలిపింది.
అమెజాన్ అకాడమీ షట్‌డౌన్
మరోవైపు భారత్‌లో ఖర్చుల్ని తగ్గించేందుకు ఉద్యోగుల్ని స్వచ్ఛందంగా తొలగించడం, ఏ మాత్రం లాభసాటి లేని లాభాల్ని మూసేయాలని అమెజాన్ భావిస్తున్నట్లు సమాచారం. అందుకే కొద‍్దిరోజుల క్రితం అమెజాన్ అకాడమినీ షట్‌డౌన్ చేస్తున్నట్లు వెల్లడించింది. కోవిడ్ మహమ్మారి సమయంలో ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ ఊపందుకుంది.దీంతో దేశానికి చెందిన పలు స్టార్టప్‌తో పాటు అమెజాన్ సైతం ఆన్‌లైన్ ఎడ్యుటెక్ రంగంలోకి అడుగు పెట్టింది. కానీ ఇప్పుడు యధావిధిగా ఆఫ్‌లైన్ క్లాస్‌లు ప్రారంభం కావడంతో ఎడ్యుటెక్ కంపెనీలు భారీ నష్టపోతున్నాయి. ఈ నష్టాల నుంచి బయటపడేందుకు అమెజాన్ అకాడమినీ మూసివేస్తున్నట్లు అమెజాన్ ప్రతినిధులు ప్రకటించారు.
చదవండి👉 ఉద్యోగులకు ఊహించని షాక్!..ట్విటర్,మెటా బాటలో మరో దిగ్గజ సంస్థ!
Comments
Please login to add a commentAdd a comment