న్యూఢిల్లీ: గిగ్ ఎకానమీ వర్కర్లలో మదుపు, ఆర్థికాంశాలపైన అవగాహన పెంచే దిశగా ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫాం జొమాటోతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) వెల్లడించింది. దీని ప్రకారం ప్రత్యేకంగా జొమాటో డెలివరీ పార్ట్‌నర్స్ కోసం రూపొందించిన అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పేర్కొంది.
ఇందులో పర్సనల్ ఫైనాన్స్ మేనేజ్‌మెంట్, ఇన్వెస్టింగ్‌కి సంబంధించి ప్రాథమిక అంశాలు ఉంటాయని ఎన్‌ఎస్‌ఈ తెలిపింది. పలు ప్రాంతీయ భాషల్లో బడ్జెటింగ్, పొదుపు, పెట్టుబడులు, బీమా మొదలైనవాటి గురించి వివరించనున్నట్లు పేర్కొంది. ఇప్పటికే 2,000 మంది డెలివరీ పార్ట్‌నర్స్ ఆర్థిక అక్షరాస్యత కార్యక్రమంలో భాగమైనట్లు వివరించింది. దేశవ్యాప్తంగా 50,000 మంది తాత్కాలిక వర్కర్లకు ఇది ప్రయోజనం చేకూర్చగలదని ఎన్‌ఎస్‌ఈ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment