OnePlus Foldable Phone: స్మార్ట్ ఫోన్ మార్కెట్ పోటీలో వైవిధ్యం ప్రదర్శిస్తూ దూసుకుపోతోంది వన్‌ఫ్లస్ బ్రాండ్. జనాల్లో క్రేజ్ పెంచుకునేందుకు ఇప్పటికే ఆకర్షణీయమైన ప్రొడక్టులను ప్రకటించి.. టైం చూసి మార్కెట్‌లోకి వదలడానికి ఎదురుచూస్తోంది. తాజాగా మరో ముఖ్యమైన అప్‌డేట్‌ను ప్రకటించింది.
వన్‌ఫ్లస్ నుంచి త్వరలో ఫోల్డబుల్ ఫోన్ (మడత ఫోన్) మార్కెట్‌లోకి తీసుకురానుంది. లెట్స్‌గోడిజిటల్ ప్రకారం.. ఫోల్డబుల్ ఫోన్‌ను తీసుకురాబోతోందట. అంతేకాదు అది రెండు మడతలతో కాకుండా మూడు మడతలతో ఉండబోతోదట!. కిందటి ఏడాదిలోనే చైనాలో పేటెంట్ డాక్యుమెంట్‌లను bbk electronics కంపెనీ సమర్పించిందని, ఈ ఏడాది జులైలో ఆ డాక్యుమెంట్ పబ్లిష్ కూడా అయ్యిందని వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆఫీస్ డేటాబేస్ వివరాల ద్వారా వెల్లడైంది.
ప్రతీకాత్మక చిత్రం
ఇక వన్‌ఫ్లస్ తేబోతున్న ఫోల్డబుల్ ఫోన్ వేర్వేరు దిశలో(ట్రయాంగిల్.. రోటేటింగ్ టర్నింగ్ ప్లేట్) మడతపెట్టేదిగా ఉంటుందని, యూజర్ అప్లికేషన్‌లు సైతం ఎక్కువగా అందిస్తుందని ఆ డాక్యుమెంట్‌లలో ఉంది. స్లైడింగ్ కీ ప్యాడ్‌తో ఇది రానుంది. అంతేకాదు డబుల్ హింగ్‌డ్ టెక్నాలజీతో సరికొత్త ఒరవడి సృష్టించేందుకు సిద్ధమైంది.
నిజానికి వన్‌ఫ్లస్ నుంచి మడత ఫోన్ రానుందనే వార్త చాలాకాలమే వినిపించింది. శాంసంగ్ పోటీని తట్టుకునేందుకు ముఖ్యంగా గెలాక్సీ జీ ఫోల్డ్ సిరీస్‌ను బీట్ చేసేందుకు తీసుకొస్తుందని వార్తలు వినిపించాయి. కానీ, ఆ టైంలో వన్‌ఫ్లస్ ఎలాంటి కన్ఫర్మేషన్ ఇవ్వలేదు. అయితే తాజా నిర్ధారణతో త్రీ ఫోల్డ్స్ ఫోన్ ద్వారా స్మార్ట్ ఫోన్ ప్రపంచంలో గేమ్ ఛేంజర్‌గా నిలవాలని వన్‌ఫ్లస్ ప్రయత్నాలు చేస్తోంది.
స్మార్ట్‌ఫోన్ల కొనుగోళ్లపై బంపరాఫర్! ఏకంగా 40 శాతం తగ్గింపు!.. వివరాలు
Comments
Please login to add a commentAdd a comment