Samsung Galaxy series
-
శాంసంగ్ గెలాక్సీ అన్ప్యాక్డ్ ఈవెంట్: అదిరిపోయే ఫోల్డబుల్ స్మార్ట్‌పోన్స్, వాచ్ 6, ప్యాడ్ 9 సిరీస్ (ఫోటోలు)
-
OnePlus: ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా మూడు స్క్రీన్లు!!
OnePlus Foldable Phone: స్మార్ట్ ఫోన్ మార్కెట్ పోటీలో వైవిధ్యం ప్రదర్శిస్తూ దూసుకుపోతోంది వన్‌ఫ్లస్ బ్రాండ్. జనాల్లో క్రేజ్ పెంచుకునేందుకు ఇప్పటికే ఆకర్షణీయమైన ప్రొడక్టులను ప్రకటించి.. టైం చూసి మార్కెట్లోకి వదలడానికి ఎదురుచూస్తోంది. తాజాగా మరో ముఖ్యమైన అప్డేట్ను ప్రకటించింది. వన్‌ఫ్లస్ నుంచి త్వరలో ఫోల్డబుల్ ఫోన్ (మడత ఫోన్) మార్కెట్లోకి తీసుకురానుంది. లెట్స్‌గోడిజిటల్ ప్రకారం.. ఫోల్డబుల్ ఫోన్‌ను తీసుకురాబోతోందట. అంతేకాదు అది రెండు మడతలతో కాకుండా మూడు మడతలతో ఉండబోతోదట!. కిందటి ఏడాదిలోనే చైనాలో పేటెంట్ డాక్యుమెంట్లను bbk electronics కంపెనీ సమర్పించిందని, ఈ ఏడాది జులైలో ఆ డాక్యుమెంట్ పబ్లిష్ కూడా అయ్యిందని వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆఫీస్ డేటాబేస్ వివరాల ద్వారా వెల్లడైంది. ప్రతీకాత్మక చిత్రం ఇక వన్‌ఫ్లస్ తేబోతున్న ఫోల్డబుల్ ఫోన్ వేర్వేరు దిశలో(ట్రయాంగిల్.. రోటేటింగ్ టర్నింగ్ ప్లేట్) మడతపెట్టేదిగా ఉంటుందని, యూజర్ అప్లికేషన్లు సైతం ఎక్కువగా అందిస్తుందని ఆ డాక్యుమెంట్లలో ఉంది. స్లైడింగ్ కీ ప్యాడ్‌తో ఇది రానుంది. అంతేకాదు డబుల్ హింగ్డ్ టెక్నాలజీతో సరికొత్త ఒరవడి సృష్టించేందుకు సిద్ధమైంది. నిజానికి వన్‌ఫ్లస్ నుంచి మడత ఫోన్ రానుందనే వార్త చాలాకాలమే వినిపించింది. శాంసంగ్ పోటీని తట్టుకునేందుకు ముఖ్యంగా గెలాక్సీ జీ ఫోల్డ్ సిరీస్‌ను బీట్ చేసేందుకు తీసుకొస్తుందని వార్తలు వినిపించాయి. కానీ, ఆ టైంలో వన్‌ఫ్లస్ ఎలాంటి కన్ఫర్మేషన్ ఇవ్వలేదు. అయితే తాజా నిర్ధారణతో త్రీ ఫోల్డ్స్ ఫోన్ ద్వారా స్మార్ట్ ఫోన్ ప్రపంచంలో గేమ్ ఛేంజర్‌గా నిలవాలని వన్‌ఫ్లస్ ప్రయత్నాలు చేస్తోంది. స్మార్ట్ఫోన్ల కొనుగోళ్లపై బంపరాఫర్! ఏకంగా 40 శాతం తగ్గింపు!.. వివరాలు -
వచ్చే నెల్లో శాంసంగ్ ‘గెలాక్సీ ఎం సిరీస్’ విడుదల..!
న్యూఢిల్లీ: చైనాకు చెందిన దిగ్గజ మొబైల్ హ్యాండ్సెట్స్ తయారీ కంపెనీ షావోమికి పోటీగా.. కొరియా స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ శాంసంగ్ అతి త్వరలోనే ‘గెలాక్సీ ఎం సిరీస్’ను భారత్‌లో విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. రెండంకల వృద్ధి రేటును సాధించడంలో భాగంగా తొలుత ఈఫోన్ సిరీస్‌ను భారత్‌లోనే విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. ఈ స్మార్ట్‌ఫోన్స్ ధరలు రూ.20,000 వరకు ఉండనున్నట్లు శాంసంగ్ ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అసిమ్ వార్సీ మీడియాతో అన్నారు. ఈ అంశంపై ఆయన మాట్లాడుతూ.. ‘ఈనెల తరువాత స్మార్ట్ఫోన్లను విడుదల చేయాలని భావిస్తున్నాం. శాంసంగ్, అమేజాన్ వెబ్సైట్లలో వీటిని అందించనున్నాం. ఎం సిరీస్ విడుదల ద్వారా 2019లో రెండంకెల వృద్ధి రేటును లక్ష్యంగా నిర్థేశించుకున్నాం. కేవలం డివైజ్‌ల పరంగానే కాకుండగా.. ఫ్యాక్టరీ, ఎక్సిపీరియన్స్ సెంటర్ల విస్తరణపై కూడా దృష్టి సారించాం. భారత మార్కెట్‌కు అవసరాలకు తగిన విధంగా సేవలందించడమే మా సంస్థ ధ్యేయం.’ అని వివరించారు. -
ఏడునెలల తర్వాత సామ్సంగ్ ఎస్ 5 అద్భుతం!
స్మార్ల్ ఫోన్ల ఆవిష్కరణలో దూసుకుపోతున్న సాంసంగ్ సంతోషంగా ఉప్పొంగిపోయే వార్త. అతి పెద్ద స్మార్ట ఫోన్ల తయారీ మార్కెట్ లో భారత్ , చైనా మార్కెట్లో తన స్థానాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నిస్తున్న సామ్ సంగ్ కు ఇది నిజంగా బూస్ట్ ఇచ్చే వార్త. దాదాపు ఏడు నెలలపాటు వానకు తడిచి, బురదలో కూరుకు పోయిన తమ సామ్ సంగ్ ఎస్ 5 చెక్కు చెదరకుండా పనిచేస్తోందంటూ సంబరాలు చేసుకుంటోంది. ఇది రియల్ స్టోరి అంటూ సోమవారం సోషల్ మీడియాలో షేర్ చేసింది. కొరియన్ మొబైల్ తయారీ సంస్థ సామ్ సంగ్ అందించిన వివరాల ప్రకారం సియోల్ కు చెందిన గ్యు ర్యాంగ్ (70) తన శామ్సంగ్ గెలాక్సీఎస్ 5 ఫోన్ ఒక తోటలో పారేసుకున్నాడు. గత ఏడాది సెప్టెంబర్ లో ఫాం హౌస్ లో పనిచేస్తున్నపుడు ఇది పోయింది. ఫోన్ సైలెంట్ మోడ్ లో ఉండడం దాన్ని గుర్తించడం సాధ్యం కాలేదు. ఇక దానిపై ఆశలు వదిలేసుకున్నాడు. ఏడు నెలల తరువాత, ఫాం హౌస్ లో మట్టి దున్నతున్నపుడు గెలాక్సీ ఎస్ 5 బయటపడింది. దీంతో అతను దానికి చార్జింగ్ పెట్టి పరీక్షించాడు. ఇంత కాలం వర్షం, మంచులో ఉన్న తన స్మార్ట్ ఫోన్ పూర్తిగా పనిచేయడం పట్ల ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశాడు ర్యాంగ్. అద్భుతమైన జల, బూడిద నిరోధిత లక్షణాలు ఉన్నాయంటూ మురిసిపోతున్నాడు. కాగా గెలాక్సీ ఎస్ 5 ను డస్ట్, అండ్ వాటర్ రెసిస్టెంట్ అంటూ 2014 లాంచ్ చేసింది. ఈ సిరీస్ లో ఎస్6 లో ఈ టెక్నాలజీ లేదు. అయితే ఈ ఏడాది లాంచ్ ఎస్7 లో సంగతి తెలిసిందే.ఐపి68 టెక్నాలజీ( వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ ) జోడించింది. మరోవైపు ప్రపంచంలో అతిపెద్ద స్మార్ట్ఫోన్లు మార్కెట్లో అర్ధవంతమైన మార్కెట్ వాటా ను కొల్లగొట్టే ప్రయత్నంలో చైనా, భారతదేశం లో దాని బడ్జెట్ గెలాక్సీ సి లాంచ్ చేసేందుకు రడీ అవుతున్నట్టు సమాచారం.