ఏడునెలల తర్వాత సామ్సంగ్ ఎస్ 5 అద్భుతం!
స్మార్ల్ ఫోన్ల ఆవిష్కరణలో దూసుకుపోతున్న సాంసంగ్ సంతోషంగా ఉప్పొంగిపోయే వార్త. అతి పెద్ద స్మార్ట ఫోన్ల తయారీ మార్కెట్ లో భారత్ , చైనా మార్కెట్లో తన స్థానాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నిస్తున్న సామ్ సంగ్ కు ఇది నిజంగా బూస్ట్ ఇచ్చే వార్త. దాదాపు ఏడు నెలలపాటు వానకు తడిచి, బురదలో కూరుకు పోయిన తమ సామ్ సంగ్ ఎస్ 5 చెక్కు చెదరకుండా పనిచేస్తోందంటూ సంబరాలు చేసుకుంటోంది. ఇది రియల్ స్టోరి అంటూ సోమవారం సోషల్ మీడియాలో షేర్ చేసింది.
కొరియన్ మొబైల్ తయారీ సంస్థ సామ్ సంగ్ అందించిన వివరాల ప్రకారం సియోల్ కు చెందిన గ్యు ర్యాంగ్ (70) తన శామ్సంగ్ గెలాక్సీఎస్ 5 ఫోన్ ఒక తోటలో పారేసుకున్నాడు. గత ఏడాది సెప్టెంబర్ లో ఫాం హౌస్ లో పనిచేస్తున్నపుడు ఇది పోయింది. ఫోన్ సైలెంట్ మోడ్ లో ఉండడం దాన్ని గుర్తించడం సాధ్యం కాలేదు. ఇక దానిపై ఆశలు వదిలేసుకున్నాడు. ఏడు నెలల తరువాత, ఫాం హౌస్ లో మట్టి దున్నతున్నపుడు గెలాక్సీ ఎస్ 5 బయటపడింది. దీంతో అతను దానికి చార్జింగ్ పెట్టి పరీక్షించాడు. ఇంత కాలం వర్షం, మంచులో ఉన్న తన స్మార్ట్ ఫోన్ పూర్తిగా పనిచేయడం పట్ల ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశాడు ర్యాంగ్. అద్భుతమైన జల, బూడిద నిరోధిత లక్షణాలు ఉన్నాయంటూ మురిసిపోతున్నాడు.
కాగా గెలాక్సీ ఎస్ 5 ను డస్ట్, అండ్ వాటర్ రెసిస్టెంట్ అంటూ 2014 లాంచ్ చేసింది. ఈ సిరీస్ లో ఎస్6 లో ఈ టెక్నాలజీ లేదు. అయితే ఈ ఏడాది లాంచ్ ఎస్7 లో సంగతి తెలిసిందే.ఐపి68 టెక్నాలజీ( వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ ) జోడించింది. మరోవైపు ప్రపంచంలో అతిపెద్ద స్మార్ట్ఫోన్లు మార్కెట్లో అర్ధవంతమైన మార్కెట్ వాటా ను కొల్లగొట్టే ప్రయత్నంలో చైనా, భారతదేశం లో దాని బడ్జెట్ గెలాక్సీ సి లాంచ్ చేసేందుకు రడీ అవుతున్నట్టు సమాచారం.