రైఫిల్ షూటింగ్ పోటీలు ప్రారంభం
రైఫిల్ షూటింగ్ పోటీలు ప్రారంభం
Published Wed, Jul 20 2016 9:11 PM | Last Updated on Mon, Sep 4 2017 5:29 AM
గుంటూరు స్పోర్ట్స్: జాతీయ, అంతర్జాతీయ పోటీలలో అత్యధిక పతకాలు సాధించేందుకు అవకాశం వున్న క్రీడ రైఫిల్ షూటింగ్ అని శాప్ ఓఎస్‌డీ, గుంటూరు జిల్లా ఇన్‌చార్జ్ డీఎస్‌డీఓ పి.రామకష్ణ అన్నారు. ఆంద్రప్రదేశ్ రైఫిల్ అసోసియేషన్ అధ్వర్యంలో బుధవారం స్దానిక బ్రాడీపేటలోని రైఫిల్ షూటింగ్ అకాడమిలో 17వ ఏ.పీ స్టేట్ షూటింగ్ ఛాంపియన్ షిప్–2016 పోటీలు ప్రారంభం అయ్యాయి. ముఖ్యఅతిధిగా హజరైన రామకష్ణ టోర్నమెంట్‌ను ప్రారంభించారు. ఈసందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ ఒలంపిక్స్, కామన్‌వెల్త్ క్రీడల్లో మన క్రీడాకారులు అనే పతకాలు సాధించారని చెప్పారు. వ్యక్తిగత విభాగంలో అనేక పతకాలు సాధించే అవకాశం వున్న క్రీడ రైఫిల్ షూటింగ్ అన్నారు. అంతే కాకుండా తక్కువ సమయంలో జాతీయ, అంతర్జాతీయ స్ధాయికి ఎదిగే అవకాశం వుందన్నారు. టోర్నమెంట్‌లో పురుషుల, మహిళాల, సబ్ జూనియర్, జూనియర్, వెటరన్ విభాగాలలో పోటీలు జరుగుతాయని టోర్నమెంట్ నిర్వహకులు వెల్లడించారు. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్, ఎయిర్ ఫిస్టల్ క్రీడాంశాలలో పోటీలు జరుగుతాయన్నారు. కార్యక్రమంలో బీ.శ్రీనివాసరావు, క్రీడాకారులు, తదితరులు పాల్గోన్నారు.
Advertisement
Advertisement