began
-
రైఫిల్ షూటింగ్ పోటీలు ప్రారంభం
గుంటూరు స్పోర్ట్స్: జాతీయ, అంతర్జాతీయ పోటీలలో అత్యధిక పతకాలు సాధించేందుకు అవకాశం వున్న క్రీడ రైఫిల్ షూటింగ్ అని శాప్ ఓఎస్డీ, గుంటూరు జిల్లా ఇన్చార్జ్ డీఎస్డీఓ పి.రామకష్ణ అన్నారు. ఆంద్రప్రదేశ్ రైఫిల్ అసోసియేషన్ అధ్వర్యంలో బుధవారం స్దానిక బ్రాడీపేటలోని రైఫిల్ షూటింగ్ అకాడమిలో 17వ ఏ.పీ స్టేట్ షూటింగ్ ఛాంపియన్ షిప్–2016 పోటీలు ప్రారంభం అయ్యాయి. ముఖ్యఅతిధిగా హజరైన రామకష్ణ టోర్నమెంట్‌ను ప్రారంభించారు. ఈసందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ ఒలంపిక్స్, కామన్వెల్త్ క్రీడల్లో మన క్రీడాకారులు అనే పతకాలు సాధించారని చెప్పారు. వ్యక్తిగత విభాగంలో అనేక పతకాలు సాధించే అవకాశం వున్న క్రీడ రైఫిల్ షూటింగ్ అన్నారు. అంతే కాకుండా తక్కువ సమయంలో జాతీయ, అంతర్జాతీయ స్ధాయికి ఎదిగే అవకాశం వుందన్నారు. టోర్నమెంట్లో పురుషుల, మహిళాల, సబ్ జూనియర్, జూనియర్, వెటరన్ విభాగాలలో పోటీలు జరుగుతాయని టోర్నమెంట్ నిర్వహకులు వెల్లడించారు. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్, ఎయిర్ ఫిస్టల్ క్రీడాంశాలలో పోటీలు జరుగుతాయన్నారు. కార్యక్రమంలో బీ.శ్రీనివాసరావు, క్రీడాకారులు, తదితరులు పాల్గోన్నారు. -
మార్కెట్లోకి రిలయన్స్ లైఫ్ 4జీ ఫోన్లు
♦ 3 ఫోన్లు అందుబాటులో ♦ ధర రూ. 15,499 -25,800 దాకా న్యూఢిల్లీ: లైఫ్ (ఎల్వైఎఫ్) బ్రాండ్ పేరిట రిలయన్స్ రిటైల్ 4జీ ఫోన్ల విక్రయాలను ప్రారంభించింది. ఈ ఏడాది మార్చి-ఏప్రిల్‌లో మొదలయ్యే గ్రూప్ కంపెనీ రిలయన్స్ జియో టెలికం సర్వీసులకు అనువైనవిగా ఈ 3 హ్యాండ్‌సెట్స్‌ను రూపొందించారు. వీటి ధరలు రూ. 15,499 నుంచి రూ. 25,800 దాకా ఉన్నాయి. రిలయన్స్ డిజిటల్ వెబ్సైట్లో పొందుపర్చిన వివరాల ప్రకారం హై ఎండ్ 4జీ మోడల్ అయిన లైఫ్ ఎర్త్ 1 ధర రూ. 25,800. ఇందులో 13 ఎంపీ, 2 ఎంపీ డ్యుయల్ రియర్ కెమెరాలు, 5 ఎంపీ ఫ్రంట్ కెమెరాతో పాటు 32 జీబీ ఇంటర్నల్ మెమరీ ఉంటుంది. ఇక లైఫ్ వాటర్ 1 ధర రూ. 17,399 కాగా వాటర్ 2 రేటు రూ. 15,499. ఈ రెండు మోడల్స్‌లోనూ 16 జీబీ ఇం టర్నల్ మెమరీ ఉంటుంది. రిలయన్స్ డిజిటల్ స్టోర్స్‌లో కూడా లభించే ఈ హ్యాండ్‌సెట్స్‌కి.. దేశవ్యాప్తంగా ఉన్న 1,000 పైగా సెంటర్ల ద్వారా సర్వీసులు అందించనున్నట్లు సంస్థ వర్గాలు తెలిపాయి. రిలయన్స్ గ్రూప్ చైర్మన్ ముకేశ్ అంబానీ పేర్కొన్న రూ. 4,000 కన్నా తక్కువ ఉండే ఫోన్లు ఇంకా అందుబాటులోకి రావాల్సి ఉన్నట్లు వివరించాయి. ఫ్లేమ్స్ పేరుతో వచ్చే ఫోన్లు ఈ రేటులో ఉండొచ్చని భావిస్తున్నట్లు శివాలిక్ డిస్ట్రిబ్యూషన్ ఎండీ శోభిత్ గోయల్ పేర్కొన్నారు. -
ఎంపిక కసరత్తు
శ్రీకాకుళం, న్యూస్‌లైన్: అధికార కాంగ్రెస్‌లో ఎన్నికల సందడి ప్రారంభమైంది. సార్వత్రిక ఎన్నికలకు అభ్యర్థుల ఎంపిక కసరత్తుకు ఆ పార్టీ శ్రీకారం చుట్టింది. ఈ మేరకు ముగ్గురు ఏఐసీసీ పరిశీలకులు ఆదివారం శ్రీకాకుళం వచ్చి అభిప్రాయాలు, దరఖాస్తులు స్వీకరిం చారు. జిల్లా కాంగ్రెస్ కార్యాలయమైన ఇంది రా విజ్ఞాన్ భవన్లో మకాం వేసిన వారు శ్రీకాకుళం పార్లమెంట్, దాని పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలకు అభ్యర్థుల ఎంపికపై అభిప్రాయాల సేకరణ ప్రారంభించారు. అందులో భాగంగా ఆదివారం శ్రీకాకుళం, ఆమదాలవలస, నరసన్నపేట అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన ఆజాద్ హెచ్ పటేల్, ముజబుల్ హెచ్.భగవాన్, రాజేంద్రలు ఆయా నియోజకవర్గాల నాయకులతో వేర్వేరుగా మాట్లాడారు. అలాగే అసెంబ్లీ టికెట్లు ఆశిస్తున్న వారి నుంచి దరఖాస్తులు స్వీకరించారు. శ్రీకాకుళం నియోజకవర్గ టికెట్ తనకు ఇవ్వాలని కోరుతూ శిమ్మ రాజశేఖర్ దరఖాస్తు ఇవ్వగా, తన సతీమణికి ఇవ్వాలని కోరుతూ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు సుంకరి కృష్ణకుమార్ వినతిపత్రం అందజేశారు. ఆమదాలవలస ఎమ్మెల్యే బొడ్డేపల్లి సత్యవతి తనకు గానీ, తన కుమారుడికి గానీ సీటు కేటాయించాలని అభ్యర్థించగా, జెజె మోహనరావు ఇదే స్థానం కోరుతూ దరఖాస్తు అందజేశారు. నరసన్నపేట నుంచి డోల జగన్, రెడ్డి జగన్నాథంలు దరఖాస్తు చేసుకోగా, శిమ్మ రాజశేఖర్ సైతం తనకు శ్రీకాకుళం కేటాయించని పక్షంలో నరసన్నపేట అయినా ఇవ్వాలని కోరారు. పార్లమెంటు నియోజకవర్గానికి మాత్రంఎవరూ దరఖాస్తు చేసుకోలేదు. అందరూ కృపారాణినే బలపరిచినట్లు తెలుస్తోంది.