మార్కెట్లోకి రిలయన్స్ లైఫ్ 4జీ ఫోన్లు | Reliance Jio's 4G Lyf smartphones go on sale | Sakshi

మార్కెట్లోకి రిలయన్స్ లైఫ్ 4జీ ఫోన్లు

Jan 29 2016 3:32 PM | Updated on Sep 3 2017 4:29 PM

మార్కెట్లోకి రిలయన్స్ లైఫ్ 4జీ ఫోన్లు

మార్కెట్లోకి రిలయన్స్ లైఫ్ 4జీ ఫోన్లు

లైఫ్ (ఎల్‌వైఎఫ్) బ్రాండ్ పేరిట రిలయన్స్ రిటైల్ 4జీ ఫోన్ల విక్రయాలను ప్రారంభించింది.

3 ఫోన్లు అందుబాటులో
ధర రూ. 15,499 -25,800 దాకా

న్యూఢిల్లీ: లైఫ్ (ఎల్‌వైఎఫ్) బ్రాండ్ పేరిట రిలయన్స్ రిటైల్ 4జీ ఫోన్ల విక్రయాలను ప్రారంభించింది. ఈ ఏడాది మార్చి-ఏప్రిల్‌లో మొదలయ్యే గ్రూప్ కంపెనీ రిలయన్స్ జియో  టెలికం సర్వీసులకు అనువైనవిగా ఈ 3 హ్యాండ్‌సెట్స్‌ను రూపొందించారు. వీటి ధరలు రూ. 15,499 నుంచి రూ. 25,800 దాకా ఉన్నాయి.

  రిలయన్స్ డిజిటల్ వెబ్‌సైట్‌లో పొందుపర్చిన వివరాల ప్రకారం  హై ఎండ్ 4జీ మోడల్ అయిన లైఫ్ ఎర్త్ 1 ధర రూ. 25,800. ఇందులో 13 ఎంపీ, 2 ఎంపీ డ్యుయల్ రియర్ కెమెరాలు, 5 ఎంపీ ఫ్రంట్ కెమెరాతో పాటు 32 జీబీ ఇంటర్నల్ మెమరీ ఉంటుంది. ఇక లైఫ్ వాటర్ 1 ధర రూ. 17,399 కాగా వాటర్ 2 రేటు రూ. 15,499. ఈ రెండు మోడల్స్‌లోనూ 16 జీబీ ఇం టర్నల్ మెమరీ ఉంటుంది.

రిలయన్స్ డిజిటల్ స్టోర్స్‌లో కూడా లభించే ఈ హ్యాండ్‌సెట్స్‌కి.. దేశవ్యాప్తంగా ఉన్న 1,000 పైగా సెంటర్ల ద్వారా సర్వీసులు అందించనున్నట్లు సంస్థ వర్గాలు తెలిపాయి. రిలయన్స్ గ్రూప్ చైర్మన్ ముకేశ్ అంబానీ పేర్కొన్న రూ. 4,000 కన్నా తక్కువ ఉండే ఫోన్లు ఇంకా అందుబాటులోకి రావాల్సి ఉన్నట్లు వివరించాయి. ఫ్లేమ్స్ పేరుతో వచ్చే ఫోన్లు ఈ రేటులో ఉండొచ్చని భావిస్తున్నట్లు శివాలిక్ డిస్ట్రిబ్యూషన్ ఎండీ శోభిత్ గోయల్ పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement