ముగిసిన స్నూకర్స్ పోటీలు
Published Sun, Aug 7 2016 9:35 PM | Last Updated on Mon, Oct 22 2018 5:42 PM
తెనాలి (మారీసుపేట) : కోగంటి శివప్రసాద్ మెమోరియల్ అమరావతి స్టేట్ స్నూకర్స్ టోర్నమెంట్ శనివారం రాత్రితో ముగిశాయి. కొత్తపేటలోని కనికచర్ల కల్యాణమండపంలో గురువారం నుంచి పోటీలు జరుగుతున్న విషయం తెలిసిందే. పోటీలలో విజయవాడకు చెందిన వలీ, హరి, పరమేశ్‌లు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు సాధించినట్లు నిర్వాహకులు కోగంటి రోహిత్ తెలిపారు. వీరికి శనివారం రాత్రి మిర్చి హోటల్‌లో బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో ఏపీపీ కె.రాంబాబు, టీడీపీ నాయకులు వి.మురళి, కె.మురళి, కౌన్సిలర్‌లు తెనాలి సుధాకర్,పసుపులేటి త్రిమూర్తి, మాజీ కౌన్సిలర్ అత్తోట వందనం తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement