రాష్ట్ర స్థాయికి ఎంపికైన క్రీడాకారులకు అభినందన | appriciation to who selected state level competitions | Sakshi
Sakshi News home page

రాష్ట్ర స్థాయికి ఎంపికైన క్రీడాకారులకు అభినందన

Published Mon, Aug 29 2016 11:48 PM | Last Updated on Mon, Sep 4 2017 11:26 AM

రాష్ట్ర స్థాయికి ఎంపికైన క్రీడాకారులకు అభినందన

రాష్ట్ర స్థాయికి ఎంపికైన క్రీడాకారులకు అభినందన

నడిగూడెం: మండల కేంద్రంలోని సాంఘీక సంక్షేమ శాఖ బాలికల గురుకుల పాఠశాలలో ఇంటర్మీడియెట్‌ చదువుతున్న ఎం.మాధవి, సీహెచ్‌.శిరీష,  సీహెచ్‌.సాద్విక ఈ నెల 28న నల్గొండలో అండర్‌–19 విభాగంలో చదరంగం పోటీల్లో ప్రథమ, ద్వితీయ స్థానాలు పొంది, రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారు. ఈ సందర్భంగా సోమవారం పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో ఆ క్రీడాకారులను అభినందించారు. వచ్చే నెల 10 నుంచి 12వ తేదీ వరకు హైద్రాబాద్‌లో నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొననున్నట్లు ప్రిన్స్‌పాల్‌ ఎస్‌.గులాం ఎస్‌ధాని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్‌ప్రిన్స్‌పాల్‌ డి.వెంకటేశ్వర్లు, ఉపాధ్యాయులు సుజాత, కవిత, పీఈటీలు సునిత, భవిత తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement