ఏపీ జట్టుకు ఓవరాల్ చాంపియన్ ట్రోఫీ అందిస్తున్న ఏడీజీపీ మహేష్ దీక్షిత్
విశాఖ స్పోర్ట్స్: 14వ ఆల్‌ఇండియా పోలీస్ కమాండో కాంపిటీషన్స్ (ఏఐపీసీసీ)లో ఏపీ జట్టు ఓవరాల్ చాంపియన్‌షిప్ సాధించింది. 300 పాయింట్లకు గాను 267.20 పాయింట్లతో ఏపీ పోలీస్ కమాండో జట్టు విజయకేతనం ఎగురువేసింది. ఈ పోటీల్లో 8 ట్రోఫీలకు గానూ నాలుగింట చాంపియన్‌గా నిలిచింది. విశాఖలోని గ్రేహౌండ్స్ ప్రధాన కార్యాలయ మైదానంలో మంగళవారంతో ముగిసిన ఈ పోటీల్లో విజేతలకు ఇంటెలిజెన్స్ బ్యూరో ఏడీజీపీ మ హేష్ దీక్షిత్ ట్రోఫీలను అందజేశారు. 9 రోజుల పా టు 23 ప్రత్యేక దళ కమాండో (16 స్టేట్, 7 పారా మిలిటరీ ఫోర్స్) జట్లు.. 5 దశల్లో జరిగిన పోటీల్లో సత్తాచాటాయి.
ఆర్పీఎఫ్‌కు చెందిన కమాండో బి జేంద్ర 9.05 (12 నిమిషాలకు) నిమిషాల్లోనే పూర్తి చేసి ఛీతా రన్ ట్రోఫీని కైవసం చేసుకున్నాడు. కమాండో కాంపిటీషన్స్ విజేతగా ఏపీ నిలిచి స్వర్ణాలను అందుకుంది. రన్నరప్‌గా మహారాష్ట్ర నిలిచి రజతాన్ని, సెకండ్ రన్నరప్‌గా రాజస్థాన్ కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. కాన్ఫిడెన్స్ కోర్స్ బెస్ట్ జట్టుగా 10 నిమిషాల 10 సెకన్ల వ్యవధితో ఏపీ జట్టు నిలిచింది. బెస్ట్ స్టేట్ పోలీస్ కమాండో జట్టుగా 300కు గానూ 267.20 మార్కులతో ఏపీ జట్టు కైవసం చేసుకుంది.
స్మాల్ టీమ్ ఆపరేషన్స్‌కు ఇచ్చే రణ్‌నీతి ట్రోఫీని బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కైవసం చేసుకోగా.. చక్రవ్యూహ్ (గ్రామీణ) ట్రోఫీని ఏపీ జట్టు, చక్రవ్యూహ్ (పట్టణ) ట్రోఫీని మహారాష్ట్ర జట్టు కైవసం చేసుకుంది. బ్లాక్ హాక్ ఫైరింగ్ ట్రోఫీని 93 మార్కులతో(110కిగానూ) ఏపీజట్టు అందుకుంది. ఏపీ జట్టులోని 13 మంది (11+2) సభ్యులకు ఒక్కోక్కరికి రూ.5 లక్షల ప్రోత్సాహాంతో పాటు 3 అదనపు ఇంక్రిమెంట్లను సర్వీస్ బోర్డ్ ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment