ఆటపాటలతో అలరించిన విద్యార్థులు
నరసరావుపేట ఈస్ట్: సత్తెనపల్లి రోడ్డు స్టేడియంలో జరుగుతున్న రాష్ట్రస్థాయి ఫుట్‌బాల్ పోటీలలో భాగంగా శనివారం రాత్రి క్యాంప్ ఫైర్ నిర్వహించారు. విద్యార్థినీ, విద్యార్థులు, వ్యాయామ ఉపాధ్యాయులు ఆటపాటలతో సందడి చేశారు. ఆర్డీవో జె.రవీందర్ విద్యార్థులతో కలిసి నృత్యం చేసి ఉత్సాహ పరిచారు. స్టేడియం కన్వీనర్ మందాడి రవి, ఆకుల సత్యనారాయణ, డాక్టర్ గజ్జల సుధీర్‌భార్గవ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.