భూమి పూజలో పాల్గొన్న డీజీపీ
మోడల్ పోలీస్‌స్టేషన్లు నిర్మిస్తాం
Published Thu, Oct 6 2016 6:56 PM | Last Updated on Mon, Sep 4 2017 4:25 PM
డీజీపీ నండూరి సాంబశివరావు
గుంటూరు ఈస్ట్: రాష్ట్ర వ్యాప్తంగా 800 పోలీస్ స్టేషన్‌లను మోడల్ పోలీస్ స్టేషన్‌లుగా తీర్చిదిద్దనున్నట్టు డీజీపీ నండూరి సాంబశివరావు చెప్పారు. నగరంపాలెం, పాతగుంటూరు పోలీస్ స్టేషన్లకు భూమిపూజ చేసిన అనంతరం డీజీపీ ఆ ప్రాంతాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పోలీస్ స్టేషన్‌లను ఆధునిక హంగులతో రెండు నెలల్లో పూర్తి చేస్తామన్నారు. వీటిలో ప్రాథమిక సౌకర్యాలన్నీ ఏర్పాటు చేస్తున్నట్టు వివరించారు. సిబ్బంది సాంకేతిక నైపుణ్యం పొంది మెరుగైన సేవలు అందించే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. తొలుత పాతగుంటూరు పోలీస్ స్టేషన్ నిర్మాణ పూజకు హెడ్ కానిస్టేబుల్ కె.పుత్తంరాజు, నగరంపాలెం పోలీస్ స్టేషన్‌ను హడ్ కానిస్టేబుల్ ఎ.శ్రీనివాసరావులతో భూమి పూజచేయించారు.
Advertisement
Advertisement