Model Police stations
-
ఠాణా.. త‘లుక్’
సంగారెడ్డి క్రైం : నిత్యం సమాజంలో శాంతిభద్రతలను పరిరక్షించడంలో నిమగ్నమయ్యే పోలీస్ సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వం మొదటగా అత్యాధునిక వాహనాలను ఏర్పాటు చేయగా నిత్యం పనిచేసే కార్యాలయాలు శిథిలావస్థకు చేరుకోవడంతో వాటిని ఆధునీకరించడంతో పాటు నూతన సాంకేతిక ఒరవడితో అన్ని హంగులతో కూడిన భవనాల నిర్మాణానికి హోంశాఖ శ్రీకారం చుట్టింది. అందులో భాగంగానే కేవలం పోలీస్ స్టేషన్లే కాకుండా పోలీసు సిబ్బంది నివాసం ఉండే క్వార్టర్లు, కొత్త జిల్లాలు ఏర్పడటంతో నూతన కార్యాలయ భవనాలు, పోలీస్స్టేషన్ల నిర్మాణాలను పెద్దఎత్తున చేపడుతుంది. ఈ విషయంపై పూర్తి కథనం. భవన నిర్మాణాలతో కొత్త కళ... నూతనంగా నిర్మించే పోలీస్ స్టేషన్లు, కమిషనరేట్ కార్యాలయాల్లో అత్యాధునికమైన అన్ని హంగులతో భవనాలను ఏర్పాటు చేస్తున్నారు. కార్యాలయాలకు వచ్చే ప్రజల సౌకర్యం కోసం రిసెప్షన్ సెంటర్, సీసీ టీవీ ఫుటేజీలను చూడటానికి ఎల్ఈడీల ఏర్పాటుతో పాటు అధికారుల సమావేశాల సముదాయాలను సమకూర్చుతున్నారు. నూతన పోలీస్ భవనాన్ని చూడగానే ప్రజలను ఆకర్షించేలా నిర్మిస్తున్నారు. భవనం చుట్టు పక్కల పచ్చని మొక్కల పెంపకం, ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేలా చూస్తున్నారు. సిద్దిపేటలో మోడల్ పోలీస్ స్టేషన్ రాష్ట్రంలోని సిద్దిపేట వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌ను మోడల్ పోలీస్‌స్టేషన్‌గా ఏర్పాటు చేశారు. ని రంతరం విధులు నిర్వహించే పోలీసు సిబ్బంది ఆరోగ్యాల విషయంలో ప్రభుత్వం ప్రత్యేక చొర వ చూపుతోంది. రాష్ట్రంలోనే ఆదర్శంగా ఉండే విధంగా అన్ని హంగులతో నిర్మాణం చేపడుతున్నారు. సిబ్బందికి రెస్ట్ రూమ్‌తో పాటు యోగా చేయడానికి ప్రత్యేకంగా గదులను ఏర్పాటు చేస్తున్నారు. జిమ్, హెల్ప్ డెస్క్, అత్యాధునికంగా రిసెప్షనిస్ట్æతో పాటు ఫర్నీచర్‌ను ఏర్పాటు చేస్తున్నారు. అదే విధంగా పొన్నాల గ్రామశివారులో నూతనంగా నిర్మించిన ఆధునాతన కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ఈ మధ్యనే మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. రిసెప్షన్ సెంటర్ ఏర్పాటు.. తమ సమస్యలపై పోలీస్‌స్టేషన్ వచ్చే ప్రజలు ఏ అధికారిని కలవాలో కూడా తెలియదు. అలాం టి వారికి సహాయంగా రిసెప్షనిస్ట్లను ఏర్పాటు చేసింది తెలంగాణ ప్రభుత్వం. సమస్యపై వచ్చి న బాధితులను మర్యాద పుర్వకంగా స్వాగతిం చి వారికి ఉన్న సమస్యను తెలుసుకొని సంబం«ధిత అధికారి వద్దకు తీసుకెళ్తారు. ఈ మధ్యకాలంలో ఈ వ్యవస్థ ఏర్పాటు చేయడంతో సామాన్య ప్రజలకు ఎంతగానో ఉపయోగ పడుతుంది. నూతనంగా నిర్మించిన భవనాలు సంగారెడ్డి జిల్లాలో జోగిపేట పోలీస్‌స్టేషన్‌కు రూ.50 లక్షలు, జహీరాబాద్ పోలీస్‌స్టేషన్ రూ. 50 లక్షలు, సంగారెడ్డి ట్రాఫిక్‌పోలీస్ స్టేషన్ (ని ర్మాణ దశలో ఉంది) రూ.కోటి, నారాయణఖేడ్ పోలీస్‌స్టేషన్ (నిర్మాణదశలో ఉంది) రూ.కోటి సిద్దిపేట జిల్లాలో .. æ దుద్దెడ గ్రామ శివారులో నూతనంగా నిర్మించిన కమిషనర్ కార్యాలయం రూ.15 కోట్లు æ కోహెడ నూతన పోలీస్‌స్టేషన్‌కు రూ.98 లక్షలు æ దుబ్బాక సర్కిల్ పోలీస్‌స్టేషన్ రూ.30లక్షలు æ గజ్వేల్ రూరల్ పోలీస్‌స్టేషన్ రూ.30 లక్షలు æ సిద్దిపేట వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ రూ.50 లక్షలు æ అలాగే కొమురవెల్లి, మర్కూక్, అక్కన్నపేట, రాయపోల్ మండలాలలో త్వరలో నిర్మాణ పనులు ప్రారంభం కానున్నవి. ఘటన స్థలానికి త్వరగా చేరుకుంటున్నాం.. రాష్ట్ర ప్రభుత్వం అత్యాధునికమైన వాహనాలను ఇవ్వడంతో అనుకున్న సమయంలోనే ఘటనా స్థలానికి చేరుకుంటున్నాం. అదేవిధంగా నూతనంగా నిర్మించిన భవనాల్లో అత్యధునికంగా ఉండటంతో సిబ్బంది సంతోషం వ్యక్తంచేస్తున్నారు. ప్రజలకు మరిన్ని సేవలు అందించడానికి మౌలిక సదుపాయాలు అవసరం. రాష్ట్ర ప్రభుత్వం బెటర్ పోలీస్ విధానాన్ని అమలు చేయడానికి ప్రత్యేక చొరవ చూపుతుంది. - జోయల్ డేవిస్, సీపీ, సిద్దిపేట -
మా మంచి పోలీస్ స్టేషన్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్లను మోడల్ పోలీస్ స్టేషన్లుగా తీర్చిదిద్దేందుకు పోలీస్‌శాఖ సిద్ధమవుతోంది. దేశంలోనే రెండో ఉత్తమ మోడల్ పోలీస్ స్టేషన్‌గా కేంద్ర హోంశాఖ నుంచి అవార్డు పొందిన పంజగుట్ట స్టేషన్ తరహాలో అన్ని స్టేషన్లను మార్చాలని భావిస్తోంది. నేరాల నియంత్రణ, విజిబుల్ పోలీసింగ్‌తోపాటు ప్రతి కార్యక్రమంలో ప్రజలను భాగస్వాములను చేసేందుకు కృషి చేయాలని డీజీపీ మహేందర్‌రెడ్డి కమిషనర్లు, ఎస్పీలను ఆదేశించినట్లు తెలిసింది. రాష్ట్రంలోని 640 శాంతిభద్రతల పోలీస్ స్టేషన్లు, అందులోని స్టేషన్ హౌస్ అధికారులకు గుర్తింపు ఉండేలా ఠాణాలకు గ్రేడింగ్ ఇచ్చేందు కు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. స్టేషన్లు, వాటిలోని సిబ్బంది పనితీరును ఏ నెలకు ఆ నెల పర్యవేక్షించాలని ఎస్పీలు, కమిషనర్లకు డీజీపీ సూచించారు. ప్రమాణాల ప్రకారం... స్టేషన్ ఎలా ఉంది.. కేసు నమోదు దగ్గరి నుంచి చార్జిషీట్ వరకు అధికారులు వ్యవహరిస్తున్న తీరు ఎలా ఉంది.. బాధితులు, ఫిర్యాదుదారులతో సిబ్బంది ఎలా వ్యవహరిస్తున్నారు.. పెండింగ్ కేసుల క్లియరెన్స్‌కు తీసుకుంటున్న చర్యలేంటి.. ఇలా 40 రకాల ప్రమాణాలను స్టేషన్ల గ్రేడింగ్ కోసం అమలు చేయనున్నారు. అలాగే రూరల్ పోలీస్ స్టేషన్ల సిబ్బందిపై ప్రజాభిప్రాయం తెలుసుకునేలా ఫీడ్ బ్యాక్ విధానాన్ని అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్నారు. ఈ పద్ధతిని ఇప్పటికే హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో అమలు చేస్తున్నారు. ప్రమాణాలు పాటించి సక్సెస్ అయిన స్టేషన్లు, అధికారులకు ప్రతి నెలా గ్రేడింగ్ ఇచ్చి ప్రోత్సాహకాలు అందించనున్నారు. ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలు... మండలాలు, రూరల్ పోలీస్స్టేషన్ల పరిధిలోని ప్రతి గ్రామంలో ప్రధాన కూడళ్ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునేలా కార్యాచరణ రూపొందించాల ని ఉన్నతాధికారులు ఎస్పీలు, కమిషనర్లను ఆదేశించారు. ఇందుకోసం ప్రజాభాగస్వామ్యం కావాలని, దీనిపై సర్పంచులు, ప్రజాప్రతినిధులును కలసి సీసీ కెమెరాల ఏర్పాటు ఆవశ్యకతను వివరించాలన్నారు. ఇందుకు అవసరమయ్యే నిధులను ఎంపీలు, ఎమ్మెల్యేల నుంచి కూడా సేకరించినా లేదా వారి ద్వారా ఏర్పాటు చేయించినా ప్రజలకు బాగుంటుందని సలహా ఇచ్చినట్లు తెలిసింది. ప్రతి గ్రామంలోని సీసీ కెమెరాలను పోలీస్ స్టేషన్‌కు, అక్కడి నుంచి జిల్లా పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో ఉన్న కమాండ్ సెంటర్‌కు అనుసంధానించేలా చర్యలు చేపట్టాలని ఉన్నతాధికారులు ఆదేశించినట్లు తెలిసింది. పునరుద్ధరణ దిశగా విలేజ్ పోలీస్ ఆఫీసర్... గ్రామాల్లో ఓ 15 ఏళ్ల క్రితం వరకు విలేజ్ పోలీస్ ఆఫీసర్ వ్యవస్థ అందుబాటులో ఉండేది. గ్రామంలో ఏ గొడవ జరిగినా, సమస్య వచ్చినా ముందుగా విలేజ్ పోలీస్ ఆఫీసర్‌గా ఉన్న కానిస్టేబుల్ వద్దకు వచ్చేది. ఇప్పుడు మళ్లీ అదే వ్యవస్థను అందుబాటులోకి తెచ్చి విస్తృతపరచాలని పోలీస్ శాఖ నిర్ణయించింది. అలాగే గ్రామాల్లో ఉత్సాహవంతులైన యువకులతో వాట్సాప్ గ్రూప్‌లు ఏర్పాటు చేయించి గ్రామ సమస్యలు, పరిష్కారాల విషయంలో వారిని భాగస్వాములను చేసేందుకు చర్యలు చేపట్టాలని ఉన్నతాధికారులు సూచించినట్లు తెలుస్తోంది. -
పోలీస్ స్టేషన్లు ఆధునిక దేవాలయాలు
సైదాబాద్: నగరంలో పోలీస్స్టేషన్లను దేవాలయాలుగా తీర్చిదిద్దుతున్నామని రాష్ట హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. మోడల్ పోలీస్స్టేషన్ల ఏర్పాటులో భాగంగా గురువారం ఆయన సైదాబాద్ పోలీస్‌స్టేన్ నూతన భవనానికి నగర పోలీస్‌కమిషనర్ మహేందర్‌రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలో 23 పోలీస్స్టేషన్లను రూ.75 కోట్లతో మోడల్ పీఎస్లుగా తీర్చిదిద్దుతున్నామన్నారు. ఇందులో 16 శాంతిభద్రతలు, 6 ట్రాఫిక్, 1 మహిళా పోలీస్స్టేషన్లు ఉన్నట్లు తెలిపారు. నేరాలపై కానిస్టేబుల్ నుంచి డీజీపీ వరకు సమాచారం అందుతుందన్నారు. పోలీసులు ప్రజలకు చేరువైనప్పుడే నేరాల నియంత్రణ సాధ్యమన్నారు. ప్రజల పోలీస్స్టేషన్లు: కమిషనర్ మహేందర్‌రెడ్డి ఇది మా పోలీస్స్టేషన్లు అని ప్రజలు చెప్పుకునేలా ప్రతి పోలీస్‌స్టేషన్‌ను తీర్చిదిద్దనున్నట్లు నగర పోలీస్‌కమిషనర్ మహేందర్‌రెడ్డి అన్నారు. పోలీస్‌స్టేషన్‌ను సర్వీస్ సెంటర్‌గా మార్చేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణకు హైదరాబాద్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుతామని, నగరంలో చీటింగ్, డ్రగ్స్, కల్తీని రూపుమాపేందుకు కృషి చేస్తున్నామన్నారు. కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా సీసీ కెమెరాల సహాయంతో నగరంలో ఎక్కడ ఎం జరుగుతుందో తెలుసుకుంటున్నామన్నారు నేరం చేస్తే పోలీసులకు దొరికిపోతామని భయం కల్గించేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే ముంతాజ్‌ఖాన్, ఐజీలు మల్లారెడ్డి, శ్రీనివాస్, అధికారులు మురళీకృష్ణ, ప్రేమ్‌కుమార్, ఈస్ట్‌జోన్ డీసీపీ రవీందర్, ఏసీపీ సుధాకర్, కాట్న సత్తయ్య, డీఐ కోరుట్ల నాగేశ్వర్రావు, సిబ్బంది, కార్పొరేటర్లు సింగిరెడ్డి స్వర్ణలతరెడ్డి, సామ స్వప్నరెడ్డి, కాలనీ సంక్షేమ సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. స్టేషన్ కు రూ.75 వేలు కాచిగూడ: రాష్ట్రంలో పోలీస్ స్టేషన్లను కార్పొరేట్ తరహాలో తీర్చిదిద్దుతున్నామని హోంమంత్రి నాయిని నరసింహా రెడ్డి అన్నారు. గురువారం ఆయన కాచిగూడ పోలీస్ స్టేషన్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి నెలా పోలీస్ స్టేషన్లకు రూ.75వేలు కేటాయిస్తున్నట్లు తెలిపారు. సీసీ కెమెరాల ఏర్పాటుతో నగరంలో దొంగతనాలు, క్రైమ్‌రేటు తగ్గిందన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే కిషన్ రెడ్డి, ఎమ్మెల్సీ ఎం.ఎస్. ప్రభాకర్, కార్పొరేటర్లు ఎక్కాల చైతన్య కన్నా, కాలేరు పద్మవెంకటేష్, గరిగంటి శ్రీదేవి రమేష్, పోలీస్ అధికారులు మల్లారెడ్డి, రవీందర్, లక్ష్మినారాయణ, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
మోడల్ పోలీస్స్టేషన్లు నిర్మిస్తాం
డీజీపీ నండూరి సాంబశివరావు గుంటూరు ఈస్ట్: రాష్ట్ర వ్యాప్తంగా 800 పోలీస్ స్టేషన్లను మోడల్ పోలీస్ స్టేషన్లుగా తీర్చిదిద్దనున్నట్టు డీజీపీ నండూరి సాంబశివరావు చెప్పారు. నగరంపాలెం, పాతగుంటూరు పోలీస్ స్టేషన్లకు భూమిపూజ చేసిన అనంతరం డీజీపీ ఆ ప్రాంతాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పోలీస్ స్టేషన్లను ఆధునిక హంగులతో రెండు నెలల్లో పూర్తి చేస్తామన్నారు. వీటిలో ప్రాథమిక సౌకర్యాలన్నీ ఏర్పాటు చేస్తున్నట్టు వివరించారు. సిబ్బంది సాంకేతిక నైపుణ్యం పొంది మెరుగైన సేవలు అందించే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. తొలుత పాతగుంటూరు పోలీస్ స్టేషన్ నిర్మాణ పూజకు హెడ్ కానిస్టేబుల్ కె.పుత్తంరాజు, నగరంపాలెం పోలీస్ స్టేషన్‌ను హడ్ కానిస్టేబుల్ ఎ.శ్రీనివాసరావులతో భూమి పూజచేయించారు. -
'రాష్ట్రవ్యాప్తంగా 800 మోడల్ పీఎస్‌లు'
గుంటూరు : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా 800 మోడల్ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేస్తామని డీజీపీ ఎన్ సాంబశివరావు వెల్లడించారు. అలాగే మోడల్ స్టేషన్లను కమాండ్ కంట్రోల్ రూమ్‌కు అనుసంధానం చేస్తామని తెలిపారు. బుధవారం గుంటూరు నగరంలోని నగరంపాలెం, పాత గుంటూరు మోడల్ పోలీస్ స్టేషన్ల నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా పోలీసు ఉన్నతాధికారులు హాజరయ్యారు. -
సీఆర్డీఏ పరిధిలో మోడల్ పోలీస్స్టేషన్లు
- పెరుగుతున్న రహదారి ప్రమాదాలు - సైబర్ నేరాల పరిశోధనకు ప్రత్యేక టీం - క్రైం ప్రాపర్టీని లీగల్‌గా వారంలో డిస్పోజ్ చేసేలా చర్యలు నగరంపాలెం (గుంటూరు జిల్లా) : నూతన రాజధాని ప్రాంతం విజయవాడ-గుంటూరులోని ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర డీజీపీ నండూరి సాంబశివరావు చెప్పారు. మంగళవారం గుంటూరులో మోడల్ స్టేషన్ల ఏర్పాటుకు వసతుల పరిశీలనకు వచ్చిన డీజీపీ విలేకరులతో మాట్లాడారు. సిబ్బంది పనిచేయటానికి వీలుగా అనుకూలమైన వసతులతో మోడల్ పీఎస్‌లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రెండువేల పోలీస్స్టేషన్లను దశలవారీగా 100 చొప్పున మోడల్ స్టేషన్లుగా మార్పుచేసే ఆలోచనలో ఉన్నామన్నారు. 2014లో మొత్తం లక్షా 14 వేల కేసులు నమోదు కాగా రహదారి ప్రమాదాలు, సైబర్ నేరాలు గతం కంటే పెరిగాయన్నారు. సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన, పరిశోధన అధికారులు, సిబ్బందికి శిక్షణ వంటి కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. వీటి కోసం ప్రతి జిల్లాలో సాంకేతిక అంశాలపై పూర్తి అవగాహన ఉన్న సిబ్బందితో ప్రత్యేక టీంలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. వివిధ కారణాలతో సీజ్ చేసిన క్రైం ప్రాపర్టీ వాహనాలను లీగల్‌గా వారం రోజుల్లో డిస్పోజల్ చేసే విధంగా చర్యలు తీసుకుంటామని వివరించారు. ఎస్‌హెచ్‌వోల పనితీరు మెరుగుపర్చుకోవాలి పోలీస్‌స్టేషన్ హౌస్ ఆఫీసర్ల పని తీరు మెరుగుపర్చుకోవాలని గుంటూరులోని నగరంపాలెం, పాతగుంటూరు పోలీస్స్టేషన్లను ఆకస్మికంగా తనిఖీ చేసిన డీజీపీ నండూరి సాంబశివరావు ఆదేశించారు. రికార్డుల నిర్వహణ, ఫిర్యాదుల అధికారులు, సిబ్బంది స్పందనపై అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రవాప్తంగా జిల్లా ఎస్పీలు, ఉన్నతాధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించనున్నట్లు చెప్పారు. డీజీపీతో పాటు గుంటూరు రేంజి డీఐజీ సునీల్‌కుమార్, అర్బన్, రూరల్ ఎస్పీలు సర్వశ్రేష్ఠ త్రిపాఠి. నారాయణ్ నాయక్, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.