రాష్ట్ర స్థాయికి ఎంపిక
నంద్యాల, డోన్ డివిజన్ స్థాయి ఉన్నత పాఠశాలల ఇన్‌స్ఫైర్ అవార్డు సైన్స్ ఎగ్జిబిషన్‌లో డోన్ మండలం యూ కొత్తపల్లె ఉన్నత పాఠశాల 10వ తరగతి విద్యార్థిని మానస ప్రదర్శించిన రెయిన్‌వాటర్ హార్వెస్టింగ్ ప్రదర్శన రాష్ట్ర స్థాయికి ఎంపికైంది.
డోన్ టౌన్ : నంద్యాల, డోన్ డివిజన్ స్థాయి ఉన్నత పాఠశాలల ఇన్‌స్ఫైర్ అవార్డు సైన్స్ ఎగ్జిబిషన్‌లో డోన్ మండలం యూ కొత్తపల్లె ఉన్నత పాఠశాల 10వ తరగతి విద్యార్థిని మానస ప్రదర్శించిన రెయిన్‌వాటర్ హార్వెస్టింగ్ ప్రదర్శన రాష్ట్ర స్థాయికి ఎంపికైంది. ఈనెల 16,17వ తేదీల్లో బనగానపల్లె ఎగ్జిబిషన్ జరిగింది. మానసను, గైడ్, ఉపాధ్యాయుడు గంగాధర్‌ను డిప్యూటీ ఈఓ వెంకటరామిరెడ్డి అభినందించారు. మంగళవారం పాఠశాలలో జరిగిన అభినందన సభకు పాఠశాల హెచ్‌ఎం వరలక్ష్మి, ఉపాధ్యాయులు గంగాధర్,రమణ,రవికుమార్,లక్ష్మికాంతరెడ్డి హాజరయ్యారు.