రాష్ట్రస్థాయి రైఫిల్‌ షూటింగ్‌కు కొత్తపేట విద్యార్థి | rifle shooting | Sakshi
Sakshi News home page

రాష్ట్రస్థాయి రైఫిల్‌ షూటింగ్‌కు కొత్తపేట విద్యార్థి

Published Thu, Sep 8 2016 10:33 PM | Last Updated on Mon, Sep 4 2017 12:41 PM

రాష్ట్రస్థాయి రైఫిల్‌ షూటింగ్‌కు కొత్తపేట విద్యార్థి

రాష్ట్రస్థాయి రైఫిల్‌ షూటింగ్‌కు కొత్తపేట విద్యార్థి

కొత్తపేట : 
స్థానిక ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థి, ఎన్‌సీసీ ఆర్మీ కేడెట్‌ యెల్లమిల్లి చార్లెస్‌ కుమార్‌ జిల్లా స్థాయి రైఫిల్‌ షూటింగ్‌ పోటీల్లో విజయం సాధించి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. ఈ విషయాన్ని ప్రధానోపాధ్యాయుడు జి.సూర్యప్రకాశరావు గురువారం తెలిపారు. ఈ నెల 6న కాకినాడలో జిల్లా స్పోర్ట్స్‌ అథారిటీ నిర్వహించిన రైఫిల్‌ షూటింగ్‌ పోటీలకు పాఠశాల గణిత ఉపాధ్యాయుడు, ఎన్‌సీసీ చీఫ్‌ ఆఫీసర్‌ ఉప్పలపాటి మాచిరాజు ఆధ్వర్యాన ఆరుగురు విద్యార్థులు హాజరయ్యారు. వారిలో ఎనిమిదో తరగతి విద్యార్థి చార్లెస్‌కుమార్‌ అండర్‌–14 రైఫిల్‌ షూటింగ్‌లో విజయం సాధించాడు. తద్వారా ఈ నెలాఖరున కడపలో జరిగే పోటీలకు ఎంపికయ్యాడు.
తొలి అడుగులోనే విజయబావుటా
స్థానిక బాలుర ఉన్నత పాఠశాలకు సుమారు 30 ఏళ్లకు పూర్వమే ఎన్‌సీసీ యూనిట్‌ ఉండేది. అప్పట్లో ఎందరో ఎన్‌సీసీ విద్యార్థులు వివిధ ఉద్యోగాలు పొందారు. తరువాతి కాలంలో వివిధ కారణాలవల్ల పాఠశాలలో ఎ¯Œæసీసీ యూనిట్‌ను రద్దు చేశారు. కాగా, ఎన్‌íసీసీ ఆర్మీ చీఫ్‌ ఆఫీసర్‌ అయిన గణిత ఉపాధ్యాయుడు ఉప్పలపాటి మాచిరాజు కృషి మేరకు ఈ విద్యా సంవత్సరం ఎన్‌సీసీ యూనిట్‌ మంజూరైంది. 25 మంది విద్యార్థులను యూనిట్‌లో జాయిన్‌ చేసుకుని శిక్షణ ప్రారంభించారు. మొట్టమొదటగా జిల్లా స్థాయి పోటీలకు తీసుకువెళ్లగా చార్లెస్‌కుమార్‌ విజయం సాధించి, తొలి అడుగులోనే విజయ బావుటా ఎగురవేశాడు. ఈ సందర్భంగా కుమార్‌ విలేకర్లతో మాట్లాడుతూ రాష్ట్రస్థాయి పోటీల్లో కూడా విజయం సాధిస్థానని విశ్వాçÜం వ్యక్తం చేశాడు. అతడిని డీవైఈఓ ఆర్‌ఎస్‌ గంగాభవాని, ఎంఈఓ వై.సత్తిరాజు, ఎ¯Œæసీసీ 18వ బెటాలియన్‌ కమాండెంట్‌ కల్నల్‌ మొనీష్‌గౌర్, హెచ్‌ఎం సూర్యప్రకాశరావు, పీడీ బి.అప్పాజీ, పీఈటీ జ్యోతి అభినందించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement