పిఠాపురం విద్యార్థి సాల రవికి రాష్ట్రస్థాయి అథ్లెటిక్ పోటీల్లో బంగారు పతకం లభించింది. ఈనెల 5, 6, 7 తేదీల్లో విశాఖపట్నంలో ఆంధ్రప్రదేశ్ అథ్లెటిక్ అసోసియేష¯ŒS ఆధ్వర్యంలో జరిగిన అండర్–18 అథ్లెటిక్ పోటీల్లో పోల్‌వాల్ట్ విభాగంలో రవి ప్రథమస్థానం పొంది బంగారు పతకం సాధించాడు. పదో తరగతి వరకు బ్లూస్టార్ ఎయిడెడ్ ఉన్నత పాఠశాలలో చదివిన రవి ప్రస్తుతం సెకండ్ ఇంటర్
-
పిఠాపురం విద్యార్థికి రాష్ట్ర స్థాయిలో బంగారు పతకం
పిఠాపురం టౌ¯ŒS :
పిఠాపురం విద్యార్థి సాల రవికి రాష్ట్రస్థాయి అథ్లెటిక్ పోటీల్లో బంగారు పతకం లభించింది. ఈనెల 5, 6, 7 తేదీల్లో విశాఖపట్నంలో ఆంధ్రప్రదేశ్ అథ్లెటిక్ అసోసియేష¯ŒS ఆధ్వర్యంలో జరిగిన అండర్–18 అథ్లెటిక్ పోటీల్లో పోల్‌వాల్ట్ విభాగంలో రవి ప్రథమస్థానం పొంది బంగారు పతకం సాధించాడు. పదో తరగతి వరకు బ్లూస్టార్ ఎయిడెడ్ ఉన్నత పాఠశాలలో చదివిన రవి ప్రస్తుతం సెకండ్ ఇంటర్ చదువుతున్నాడు. బ్లూస్టార్ స్కూల్ పీఈటీ ఎలిపే సునీల్‌దేశాయ్ కోచ్‌గా వ్యవహరిస్తూ రవికి శిక్షణ ఇచ్చారు. గతంలో రెండు కాంస్యపతకాలు సాధించిన రవికి బంగారు పతకం వరించడంతో పలువురి మన్ననలు పొందుతున్నాడు. జిల్లా అథ్లెటిక్ అసోసియేష¯ŒS అధ్యక్షుడు కె.పద్మనాభం, కార్యదర్శి సీహెచ్‌వీ రమణ, కోశాధికారి టీవీఎస్ రంగారావు, జిల్లా సెలక్ష¯ŒS కమిటీ అధ్యక్షుడు వై.తాతబ్బాయి, అథ్లెటిక్ కోచ్ కె.కొండలరావు, స్కూల్ కరస్పాండెంటు వి.పద్మకృష్ణఫణి, మేనేజర్ వీజీకే గోఖలే, వీఎస్‌ఎల్ ఝాన్సీ ప్రత్యేకంగా అభినందించారు.