డీఎస్పీల స్థాయిలో మార్పులు చేసిన రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ శాఖలో కీలకమైన ఇన్‌స్పెక్టర్ల బదిలీల ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. కర్నూలు రేంజ్ డీఐజీ మురళీకృష్ణ, ఇన్‌చార్జి ఐజీ గోపాలక్రిష్ణ రెండు రోజులుగా హైదరాబాద్‌లో బదిలీలపై కసరత్తు చేశారు.
కర్నూలు: డీఎస్పీల స్థాయిలో మార్పులు చేసిన రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ శాఖలో కీలకమైన ఇన్‌స్పెక్టర్ల బదిలీల ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. కర్నూలు రేంజ్ డీఐజీ మురళీకృష్ణ, ఇన్‌చార్జి ఐజీ గోపాలక్రిష్ణ రెండు రోజులుగా హైదరాబాద్‌లో బదిలీలపై కసరత్తు చేశారు. గురువారం రాత్రి ఎట్టకేలకు ప్రక్రియను ముగించారు. రేంజ్ పరిధిలోని కర్నూలు, కడప జిల్లాలకు సంబంధించి మొత్తం 44 మందికి స్థాన చలనం కలిగినట్లు సమాచారం.
అయితే అధికారికంగా ఉత్తర్వులు వెలువడక ముందే కొన్ని పేర్లు బయటికి రావడంతో తాము సిఫారసు చేసిన పేర్లకు బదులు వేరొకరిని ఎలా నియమిస్తారంటూ అధికార పార్టీ నేతలు రాష్ట్రస్థాయి పోలీసు అధికారులపై ఒత్తిడి చేయడంతో ఉత్తర్వులు నిలిచిపోయినట్లు సమాచారం. కర్నూలు సీసీఎస్‌లో పని చేస్తున్న మొలకన్న కర్నూలు టూటౌన్‌కు.. వీఆర్‌లోని గంటా సుబ్బారావు పత్తికొండకు.. ఇస్మాయిల్ డోన్‌కు.. కంబగిరి రాముడు కోసిగికి, పి.శ్రీనివాసులు అనంతపురానికి.. శ్రీనివాసులును ఎమ్మిగనూరు టౌన్‌కు బదిలీ చేశారు.
అదేవిధంగా డేగలప్రభాకర్ డోన్ నుంచి కోడుమూరుకు.. శ్రీనివాసరావు(ఎమ్మిగనూరు-ఆదోని వన్‌టౌన్), శ్రీనాథ్‌రెడ్డి(వీఆర్-నందికొట్కూరు), నాగరాజరావు(కర్నూలు టూటౌన్-ఆదోని), రామయ్యనాయుడు(కర్నూలు పీసీఆర్-నంద్యాల టూటౌన్), శ్రీనివాసమూర్తి(తిరుమల-ఎమ్మిగనూరు రూరల్), ప్రభాకర్‌రెడ్డి(కోడుమూరు-శిరివెళ్ల), శ్రీనివాసరెడ్డి (శిరివెళ్ల-నంద్యాల ట్రాఫిక్), గౌతమి(వీఆర్-సీసీఎస్ 4), ఓబులేసు(సీసీఎస్ కర్నూలు-ఆళ్లగడ్డ), సుధాకర్‌రెడ్డి(ఆళ్లగడ్డ- సీసీఎస్ 3), ప్రతాప్‌రెడ్డి(వీఆర్-నంద్యాల వన్‌టౌన్), వేణుగోపాల్‌రెడ్డి(శ్రీశైలం-అనంతపురం రేంజ్), రవిబాబు(ఆత్మకూరు-సీసీఎస్ 7), వి.శ్రీనివాసులు(బనగానపల్లె-ఆత్మకూరు), భాస్కర్(వీఆర్-నంద్యాల పీసీఆర్), నాగేశ్వరరావు(శ్రీశైలం-మంత్రాలయం), శ్రీనివాసులును వీఆర్ నుంచి ఎస్బీ2కు బదిలీ చేశారు.