రాష్ట్రస్థాయి ఈత పోటీలు ప్రారంభం | state level swimming compitattions | Sakshi
Sakshi News home page

రాష్ట్రస్థాయి ఈత పోటీలు ప్రారంభం

Published Sat, Dec 17 2016 9:00 PM | Last Updated on Mon, Sep 4 2017 10:58 PM

state level swimming compitattions

భానుగుడి (కాకినాడ) : 
పెద్దిరెడ్డి గంగాధరం మెమోరియల్‌ రాష్ట్రస్థాయి స్విమ్మింగ్‌ పోటీలు జిల్లా స్పోర్ట్స్‌ అథారిటీ స్విమ్మింగ్‌ పూల్‌లో శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. జిల్లా ఒలింపిక్‌ అసోసియేష¯ŒS అధ్యక్షుడు చుండ్రు గోవిందరాజు ఈ పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, సంగీతంలో కాకినాడకు వన్నె తెచ్చిన మహోన్నత వ్యక్తి గంగాధరం మాస్టారని, ఆయన స్మృతిగా కాకినాడలో ఈ ఈత పోటీలు జరుగుతున్నాయని చెప్పారు. శనివారం నిర్వహించిన రాష్ట్రస్థాయి సెకండ్‌ వింటర్‌ అక్వాటిక్‌ ఛాంపియ¯ŒSషిప్‌ పోటీలకు 13 జిల్లాల నుంచి 340 మందికి పైగా క్రీడాకారులు హాజరయ్యారు. ఫ్రీ స్టయిల్, మెడ్‌లే, ఇండివిడ్యువల్‌ మెడ్‌లే, బ్రెస్ట్‌ స్ట్రోక్‌ విభాగాల్లో జరిగిన పోటీల్లో వారు పాల్గొన్నారు. డీఎస్‌డీఓ పి.మురళీధర్, స్టేట్‌ స్విమ్మింగ్‌ అసోషియేష¯ŒS అధ్యక్షుడు శంకరరావు, కార్యదర్శి మోహనరావు తదితరులు పాల్గొన్నారు.
తొలి రోజు విజేతలు వీరే..
1500 మీటర్ల ఫ్రీ స్టయిల్‌ విభాగంలో రెండు కేటగిరీల్లో పోటీలు నిర్వహించారు. మొదటి కేటగిరీలో బాలుర నుంచి పీవీజీ శ్రీరామ్, బాలికల విభాగంలో మితాక్షి (విశాఖ) బంగారు పతకాలు కైవసం చేసుకున్నారు. అలాగే, 1500 మీటర్ల ఫ్రీ స్టయిల్‌ రెండో కేటగిరీలో లో పి.సుజ¯ŒS చౌదరి (కృష్ణా), బాలికల విభాగంలో నిఠాష (విశాఖ) బంగారు పతకాలు సాధించారు. 200 మీటర్ల ఇండివిడ్యువల్‌ మిడ్‌లేలో బి.వెంకటయ్య (కడప), బాలికల విభాగంలో నవ్యశ్రీ మాధురి (చిత్తూరు); 200 మీటర్ల ఇండివిడ్యువల్‌ మిడ్‌లే జీపీ–4 బాలుర విభాగంలో ఎం.శరత్‌ (కృష్ణా), బాలికల విభాగంలో ఎం.నిహారిక (విశాఖ); 50 మీటర్ల బ్రెస్ట్‌ స్ట్రోక్‌లో ఎం.లోహిత్‌ (కృష్ణా), పి.దేవీప్రియ (తూర్పు గోదావరి); 50 మీటర్ల ఫ్రీ స్టయిల్‌లో సృజ¯ŒS (తూర్పు గోదావరి), పవ¯ŒS సరయు (కృష్ణా) బంగారు పతకాలు సాధించారు. ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన విజేతలకు సహితం పతకాలు అందించారు. ఈ పోటీల ముగింపు ఆదివారం జరగనుంది.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement