compitattions
-
కౌ..కేక
రాజమహేంద్రవరం రూరల్ : మిలమిలలాడుతూ మెరిసిన గేదెలు.. తళతళలాడుతూ కదిలిన గోవులు.. కొమ్ములు తిరిగిన పొట్టేళ్లు.. రేసు గుర్రాలు శుక్రవారం సాయంత్రం నామవరంలో సందడి చేశాయి. శ్రీభారతీయ విద్యాభవ¯ŒSలో సంస్థ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే చెరుకువాడ శ్రీరంగనాథరాజు ఆధ్వర్యంలో అఖిల భారత ఆవులు, గేదెల అందాలు, పాల పోటీలు ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. వీటికి 250కిపైగా ఆవులు, 200 గేదెలు, 20 గుర్రాలు, 30 పొట్టేళ్లు చేరాయి. ఈ సందర్భంగా చెరుకువాడ శ్రీరంగనాథరాజు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో పశువుల ప్రాముఖ్యాన్ని ప్రజలకు వివరించేందుకు ఈ పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు పోటీలను తిలకించారు. ఒంగోలు, గిర్ జాతి, ముర్రా, జపర్బాడీ జాతి గేదెల పాలపోటీలు నిర్వహించారు. పోటీల ప్రదర్శనకు వచ్చిన వివిధ జాతుల ఆవులు, గేదెలు, గుర్రాలు, పొట్టేళ్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. జింగ్ జాతికి చెందిన తెల్ల పొట్టేలు ప్రదర్శనలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. శరీరమంతా తెల్లని జూలు ఉండడంతో దానిని చూసేందుకు జనం ఆసక్తి చూపారు. ఈ పొట్టేలను నేపాల్ నుంచి తీసుకువచ్చినట్టు దాని యజమాని కోనసీమ రాజోలు ప్రాంతానికి అడబాల నాని తెలిపారు. దీని తల్లి వయస్సు రెండున్నర సంవత్సరాలు కాగా... పిల్ల వయస్సు ఏడు నెలలు. తల్లి కొమ్ములు సుమారు మూడడుగులకు పైనే ఉండగా.. పిల్లకు అడుగున్నర మేర కొమ్ములు ఉన్నాయి. -
సౌత్‌జోన్ ఇంటర్ యూనివర్సిటీ పోటీలకు ఎంపిక
రాజరాజనరేంద్రపురం (రాజానగరం) : తమిళనాడులోని అన్నా యూనివర్సిటీలో ఈనెల 24 నుంచి 27 వరకు జరిగే సౌత్ జో¯ŒS ఇంటర్ యూనివర్సిటీ పురుషుల టేబుల్ టెన్నిస్ పోటీలకు ఆదికవి నన్నయ యూనివర్సిటీ పరిధిలోని ఉభయ గోదావరి జిల్లాల నుంచి ఐదుగురు విద్యార్థులు ఎంపికయ్యారు. వీరిలో ఎం.చంటిబాబు (దేవరపల్లి), వై.కుమార్శివదుర్గావెంకటేష్ (రాజమహేంద్రవరం), ఎ¯ŒS.శ్రీరామ్, జి. వీరవెంకటసత్యనారాయణ (గొల్లలమామిడాడ), పి. చంద్రశేఖర్ (అమలాపురం) ఉన్నారని యూనివర్సిటీ పీడీ ఎసత్యనారాయణ తెలిపారు. ఈ క్రీడాకారులకు ఉపకులపతి ఆచార్య ఎం.ముత్యాలునాయుడు, రిజిస్ట్రార్ ఆచార్య ఎ. నరసింహరావు, ఇతర అధ్యాపకులు అభినందనలు తెలిపారు. వాలీబాల్ పోటీలకు విద్యార్థినుల ఎంపిక రాజరాజనరేంద్రనగర్ (రాజానగరం) : కేరళలోని కాలికట్ యూనివర్సిటీలో ఈనెల 24 నుంచి 29 వరకు జరిగే సౌత్ జో¯ŒS ఇంటర్ యూనివర్సిటీ వాలీబాల్ (మహిళలు) పోటీలకు ఉభయ గోదావరి జిల్లాల నుంచి 12 మందిఎంపికయ్యారు. వీరిలో ఈ.సంధ్య, ఎం.సుబ్బలక్ష్మి, ఎల్.ఉషారాణి, కె.అరుణ, ఎం.ఈశ్వరి, సీహెచ్.గాయిత్రీ, ఎస్.కుమారి, షేక్, శిరీషా, కె.సంధ్యవెంకటదుర్గ, పి.స్వాతి, ఎం.దుర్గాభవాని, కె.శైలజ ఉన్నారని యూనివర్సిటీ పీడీ ఎసత్యనారాయణ తెలిపారు. విద్యార్థులకు ఉపకులపతి ఆచార్య ఎం.ముత్యాలునాయుడు, రిజిస్ట్రార్ ఆచార్య నరసింహారావు అభినందనలు తెలిపారు. -
రాష్ట్రస్థాయి ఈత పోటీలు ప్రారంభం
భానుగుడి (కాకినాడ) : పెద్దిరెడ్డి గంగాధరం మెమోరియల్ రాష్ట్రస్థాయి స్విమ్మింగ్ పోటీలు జిల్లా స్పోర్ట్స్ అథారిటీ స్విమ్మింగ్ పూల్‌లో శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. జిల్లా ఒలింపిక్ అసోసియేష¯ŒS అధ్యక్షుడు చుండ్రు గోవిందరాజు ఈ పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, సంగీతంలో కాకినాడకు వన్నె తెచ్చిన మహోన్నత వ్యక్తి గంగాధరం మాస్టారని, ఆయన స్మృతిగా కాకినాడలో ఈ ఈత పోటీలు జరుగుతున్నాయని చెప్పారు. శనివారం నిర్వహించిన రాష్ట్రస్థాయి సెకండ్ వింటర్ అక్వాటిక్ ఛాంపియ¯ŒSషిప్ పోటీలకు 13 జిల్లాల నుంచి 340 మందికి పైగా క్రీడాకారులు హాజరయ్యారు. ఫ్రీ స్టయిల్, మెడ్లే, ఇండివిడ్యువల్ మెడ్లే, బ్రెస్ట్ స్ట్రోక్ విభాగాల్లో జరిగిన పోటీల్లో వారు పాల్గొన్నారు. డీఎస్డీఓ పి.మురళీధర్, స్టేట్ స్విమ్మింగ్ అసోషియేష¯ŒS అధ్యక్షుడు శంకరరావు, కార్యదర్శి మోహనరావు తదితరులు పాల్గొన్నారు. తొలి రోజు విజేతలు వీరే.. 1500 మీటర్ల ఫ్రీ స్టయిల్ విభాగంలో రెండు కేటగిరీల్లో పోటీలు నిర్వహించారు. మొదటి కేటగిరీలో బాలుర నుంచి పీవీజీ శ్రీరామ్, బాలికల విభాగంలో మితాక్షి (విశాఖ) బంగారు పతకాలు కైవసం చేసుకున్నారు. అలాగే, 1500 మీటర్ల ఫ్రీ స్టయిల్ రెండో కేటగిరీలో లో పి.సుజ¯ŒS చౌదరి (కృష్ణా), బాలికల విభాగంలో నిఠాష (విశాఖ) బంగారు పతకాలు సాధించారు. 200 మీటర్ల ఇండివిడ్యువల్ మిడ్లేలో బి.వెంకటయ్య (కడప), బాలికల విభాగంలో నవ్యశ్రీ మాధురి (చిత్తూరు); 200 మీటర్ల ఇండివిడ్యువల్ మిడ్లే జీపీ–4 బాలుర విభాగంలో ఎం.శరత్ (కృష్ణా), బాలికల విభాగంలో ఎం.నిహారిక (విశాఖ); 50 మీటర్ల బ్రెస్ట్ స్ట్రోక్‌లో ఎం.లోహిత్ (కృష్ణా), పి.దేవీప్రియ (తూర్పు గోదావరి); 50 మీటర్ల ఫ్రీ స్టయిల్లో సృజ¯ŒS (తూర్పు గోదావరి), పవ¯ŒS సరయు (కృష్ణా) బంగారు పతకాలు సాధించారు. ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన విజేతలకు సహితం పతకాలు అందించారు. ఈ పోటీల ముగింపు ఆదివారం జరగనుంది.