కౌ..కేక
రాజమహేంద్రవరం రూరల్ :
మిలమిలలాడుతూ మెరిసిన గేదెలు.. తళతళలాడుతూ కదిలిన గోవులు.. కొమ్ములు తిరిగిన పొట్టేళ్లు.. రేసు గుర్రాలు శుక్రవారం సాయంత్రం నామవరంలో సందడి చేశాయి. శ్రీభారతీయ విద్యాభవ¯ŒSలో సంస్థ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే చెరుకువాడ శ్రీరంగనాథరాజు ఆధ్వర్యంలో అఖిల భారత ఆవులు, గేదెల అందాలు, పాల పోటీలు ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. వీటికి 250కిపైగా ఆవులు, 200 గేదెలు, 20 గుర్రాలు, 30 పొట్టేళ్లు చేరాయి. ఈ సందర్భంగా చెరుకువాడ శ్రీరంగనాథరాజు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో పశువుల ప్రాముఖ్యాన్ని ప్రజలకు వివరించేందుకు ఈ పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు పోటీలను తిలకించారు. ఒంగోలు, గిర్ జాతి, ముర్రా, జపర్‌బాడీ జాతి గేదెల పాలపోటీలు నిర్వహించారు. పోటీల ప్రదర్శనకు వచ్చిన వివిధ జాతుల ఆవులు, గేదెలు, గుర్రాలు, పొట్టేళ్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.