సౌత్‌జోన్ ఇంటర్ యూనివర్సిటీ పోటీలకు ఎంపిక
Published Sat, Dec 24 2016 12:02 AM | Last Updated on Mon, Sep 4 2017 11:26 PM
రాజరాజనరేంద్రపురం (రాజానగరం) :
తమిళనాడులోని అన్నా యూనివర్సిటీలో ఈనెల 24 నుంచి 27 వరకు జరిగే సౌత్ జో¯ŒS ఇంటర్ యూనివర్సిటీ పురుషుల టేబుల్ టెన్నిస్ పోటీలకు ఆదికవి నన్నయ యూనివర్సిటీ పరిధిలోని ఉభయ గోదావరి జిల్లాల నుంచి ఐదుగురు విద్యార్థులు ఎంపికయ్యారు. వీరిలో ఎం.చంటిబాబు (దేవరపల్లి), వై.కుమార్‌శివదుర్గావెంకటేష్ (రాజమహేంద్రవరం), ఎ¯ŒS.శ్రీరామ్, జి. వీరవెంకటసత్యనారాయణ (గొల్లలమామిడాడ), పి. చంద్రశేఖర్ (అమలాపురం) ఉన్నారని యూనివర్సిటీ పీడీ ఎసత్యనారాయణ తెలిపారు. ఈ క్రీడాకారులకు ఉపకులపతి ఆచార్య ఎం.ముత్యాలునాయుడు, రిజిస్ట్రార్ ఆచార్య ఎ. నరసింహరావు, ఇతర అధ్యాపకులు అభినందనలు తెలిపారు.
వాలీబాల్ పోటీలకు విద్యార్థినుల ఎంపిక
రాజరాజనరేంద్రనగర్ (రాజానగరం) : కేరళలోని కాలికట్ యూనివర్సిటీలో ఈనెల 24 నుంచి 29 వరకు జరిగే సౌత్ జో¯ŒS ఇంటర్ యూనివర్సిటీ వాలీబాల్ (మహిళలు) పోటీలకు ఉభయ గోదావరి జిల్లాల నుంచి 12 మందిఎంపికయ్యారు. వీరిలో ఈ.సంధ్య, ఎం.సుబ్బలక్ష్మి, ఎల్.ఉషారాణి, కె.అరుణ, ఎం.ఈశ్వరి, సీహెచ్.గాయిత్రీ, ఎస్.కుమారి, షేక్, శిరీషా, కె.సంధ్యవెంకటదుర్గ, పి.స్వాతి, ఎం.దుర్గాభవాని, కె.శైలజ ఉన్నారని యూనివర్సిటీ పీడీ ఎసత్యనారాయణ తెలిపారు. విద్యార్థులకు ఉపకులపతి ఆచార్య ఎం.ముత్యాలునాయుడు, రిజిస్ట్రార్ ఆచార్య నరసింహారావు అభినందనలు తెలిపారు.
Advertisement
Advertisement