దులీప్ ట్రోఫీ-2023 విజేతగా సౌత్ జోన్ నిలిచింది. చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన ఫైనల్లో వెస్ట్‌జోన్‌పై 75 పరుగుల తేడాతో సౌత్ జోన్ విజయం సాధించింది. ఇది సౌత్‌జోన్‌కు 14వ దులీప్ ట్రోఫీ విజయం కావడం గమనార్హం. 182/5 ఓవర్‌నైట్ స్కోర్‌తో ఆఖరి రోజు ఆటను ప్రారంభించిన వెస్ట్‌జోన్.. అదనంగా కేవలం 40 పరుగులు మాత్రమే చేసి ఓటమి చవి చూసింది.
వెస్ట్ జోన్ కెప్టెన్ ప్రియాంక్ పాంచల్ (95), సర్ఫరాజ్ ఖాన్ (48) పోరాడినా.. ఓటమి తప్పలేదు. సౌత్ జోన్ బౌలర్లు వాసుకి కౌషిక్ (4/36), సాయి కిశోర్ (4/57) చెలరేగడంతో వెస్ట్‌జోన్ కుప్పకూలింది. అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో సౌత్ జోన్ 213 పరుగులకు ఆలౌటైంది. అనంతరం వెస్ట్‌జోన్ తన మొదటి ఇన్నింగ్స్‌లో 146 పరుగులకే చాపచుట్టేసింది.
సౌత్ జోన్ బౌలర్ కావేరప్ప ఏకంగా ఏడు వికెట్లు తీసి వెస్ట్ జోన్‌ను దెబ్బకొట్టాడు. దీంతో 67 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన సౌత్ జోన్ 230 పరుగుల వద్ద తమ ఇన్నింగ్స్ ముగించింది. దీంతో వెస్ట్‌జోన్ ఎదుట 298 పరుగులను లక్ష్యంగా నిర్దేశించింది. అనంతరం వెస్ట్‌జోన్ 222 పరుగులకే పరిమితమైంది. ఇక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, సిరీస్ అవార్డులను సౌత్ జోన్ బౌలర్ కావేరప్ప సొంతం చేసుకున్నాడు.
చదవండి: Ind Vs Wi: ఇంత తక్కువ ప్రైజ్‌మనీ ఎందుకివ్వడం.. మిక్సీలు, గ్రైండర్లు ఇవ్వడం బెటర్!
Comments
Please login to add a commentAdd a comment