Sai Kishore
-
IPL 2025: అతడికి రూ. 18 కోట్లు.. గుజరాత్ రిటెన్షన్ లిస్టు ఇదే!
ఐపీఎల్-2025 మెగా వేలానికి సమయం ఆసన్నమవుతోంది. నవంబరు చివరి వారంలో ఆక్షన్ నిర్వహించేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి ప్రణాళికలు సిద్ధం చేసినట్లు సమాచారం. అదే విధంగా.. వేలానికి ముందు పది ఫ్రాంఛైజీలు తాము అట్టిపెట్టుకునే ఆటగాళ్ల జాబితాను అక్టోబరు 31లోపు సమర్పించాలని డెడ్‌లైన్ విధించినట్లు తెలుస్తోంది.ఈ నేపథ్యంలో గుజరాత్ టైటాన్స్‌కు సంబంధించిన ఆసక్తికర వార్తలు తెరమీదకు వచ్చాయి. టీమిండియా సీనియర్ పేసర్ మహ్మద్ షమీని విడిచిపెట్టాలని ఫ్రాంఛైజీ నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఇక కెప్టెన్‌గా శుబ్‌మన్ గిల్‌ను కొనసాగించడంతో పాటు అఫ్గనిస్తాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్‌ను కూడా టైటాన్స్ రిటైన్ చేసుకోనుందట!పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంకాగా 2022లో ఐపీఎల్లో అరంగేట్రం చేసిన గుజరాత్ టైటాన్స్ తొలి సీజన్లోనే చాంపియన్‌గా నిలిచింది. మరుసటి ఏడాది రన్నరప్‌గా నిలిచి సత్తా చాటింది. అయితే, ఆ రెండు దఫాల్లో కెప్టెన్‌గా వ్యవహరించిన టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఈ ఏడాది జట్టును వీడి.. ముంబై ఇండియన్స్‌లో చేరాడు. ఈ క్రమంలో హార్దిక్ స్థానంలో శుబ్‌మన్ గిల్‌కు ఫ్రాంఛైజీ సారథ్య బాధ్యతలు అప్పగించింది.అయితే, ఐపీఎల్-2024లో గిల్ సేన స్థాయికి తగ్గట్లు రాణించలేకపోయింది. గాయం కారణంగా షమీ సీజన్ మొత్తానికి దూరం కావడం.. కొన్ని మ్యాచ్‌లలో ఆఖరి వరకు పోరాడినా ఒత్తిడిలో చిత్తు కావడం ప్రభావం చూపింది. దీంతో పద్నాలుగు మ్యాచ్‌లకు గానూ కేవలం ఐదే గెలిచిన గుజరాత్ పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో నిలిచింది.అతడికి రూ. 18 కోట్లుఅయినప్పటికీ.. టీమిండియా భవిష్య కెప్టెన్‌గా గుర్తింపు పొందిన శుబ్‌మన్ గిల్‌పై నమ్మకం ఉంచిన ఫ్రాంఛైజీ యాజమాన్యం అతడికి రూ. 18 కోట్ల మేర చెల్లించి తమ జట్టు నాయకుడిగా కొనసాగించనున్నట్లు తెలుస్తోంది. ఇక వరల్డ్‌క్లాస్ స్పిన్నర్ అయిన రషీద్ ఖాన్ సైతం ఈ సీజన్లో నిరాశపరిచాడు. 12 మ్యాచ్‌లు ఆడి కేవలం పది వికెట్లే తీశాడు. అయినప్పటికీ రషీద్ నైపుణ్యాలపై నమ్మకంతో అతడిని కూడా రిటైన్ చేసుకోనున్నారట.సాయి కిషోర్‌ను కూడా...అదే విధంగా.. ఐపీఎల్-2024లో శతకం బాది.. ఓవరాల్‌గా 527 పరుగులతో సత్తా చాటిన సాయి కిషోర్‌ను కూడా టైటాన్స్ అట్టిపెట్టుకోనుందట. ఇక అన్క్యాప్డ్ ప్లేయర్లు షారుఖ్ ఖాన్,రాహుల్ తేవటియాలను కూడా కొనసాగించనున్నట్లు సమాచారం. కాగా షమీ వన్డే వరల్డ్‌కప్-2023లో సత్తా చాటిన అనంతరం చీలమండకు సర్జరీ చేయించుకున్నాడు. ఈ క్రమంలో ఆటకు దూరమైన అతడు ఇంతవరకు పునరాగమనం చేయలేదు. అందుకే టైటాన్స్ షమీని వదిలేయనున్నట్లు సమాచారం.చదవండి: Ranji Trophy: 68 బంతుల్లోనే సెంచరీ.. ఆర్సీబీకి స్ట్రాంగ్ మెసేజ్! -
Asia T20 Cup 2024: ఆయుశ్ బదోని ఆడుతూ పాడుతూ.. తిలక్ సేన హ్యాట్రిక్ విజయం
ACC Mens T20 Emerging Teams Asia Cup 2024 India A vs Oman: వర్ధమాన టీ20 జట్ల ఆసియా కప్ టోర్నీలో భారత్-‘ఎ’ జట్టు హ్యాట్రిక్ కొట్టింది. ఒమన్‌తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో ఆరు వికెట్ల తేడాతో గెలుపొందింది. ఆతిథ్య జట్టు విధించిన 141 పరుగుల లక్ష్యాన్ని కేవలం 15.2 ఓవర్లలోనే ఛేదించింది. ఈ మ్యాచ్‌లో ఆయుశ్ బదోని (51)విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. టాపార్డర్‌లో ఓపెనర్ అభిషేక్ శర్మ(15 బంతుల్లో 34), వన్‌డౌన్ బ్యాటర్, కెప్టెన్ తిలక్ వర్మ(30 బంతుల్లో 36 నాటౌట్) రాణించారు. ఇక ఈ ఆసియా టోర్నమెంట్లో అంతకు ముందు గ్రూప్-బిలో భాగంగా పాకిస్తాన్, యూఏఈలపై తిలక్ సేన విజయం సాధించింది.స్కోర్లుటాస్: ఒమన్.. తొలుత బ్యాటింగ్ఒమన్ - 140/5(20)భారత్ - ఏ- 146/4(15.2)ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: ఆయుశ్ బదోనిరాణించిన భారత బౌలర్లు.అల్ అమెరత్ వేదికగా ఒమన్ జట్టుతో బుధవారం నాటి మ్యాచ్‌లో తిలక్ సేన.. టాస్ ఓడి తొలుత బౌలింగ్ చేసింది. బౌలర్లు సమిష్టిగా రాణించడంతో ఒమన్‌ను నామమాత్రపు స్కోరుకు పరిమితం చేసింది.ఒమన్ బ్యాటర్లలో ఓపెనర్లు కెప్టెన్ జతిందర్ సింగ్(17), ఆమిర్ ఖలీం(13) విఫలం కాగా.. వన్‌డౌన్ బ్యాటర్ కరణ్ సోనావాలే కేవలం ఒక్క పరుగే చేశాడు. ఈ క్రమంలో ఇన్నింగ్స్ చక్కదిద్దే బాధ్యతను మిడిలార్డర్ బ్యాటర్లు తీసుకున్నారు. వసీం అలీ 24, మహ్మద్ నదీం 41, హమద్ మీర్జా 28(నాటౌట్) పరుగులతో రాణించారు. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో ఒమన్ ఐదు వికెట్ల నష్టానికి 140 పరుగులు చేసింది.కాగా ఒమన్ ఓపెనర్లలో జతిందర్ సింగ్ వికెట్‌ను నిషాంత్ సంధు.. ఆమిర్ ఖలీం వికెట్‌ను ఆకిబ్ ఖాన్ తీయగా.. రమణ్‌దీప్ సింగ్ కరణ్ సోనావాలేను అవుట్ చేశాడు. మిగతా భారత బౌలర్లలో సాయి కిషోర్ వసీం అలీ, రాసిక్ సలాం మహ్మద్ నదీం వికెట్లను దక్కించుకున్నారు.సెమీస్లోఇక ఈ ఆసియా టోర్నీలో గ్రూప్-బిలో ఉన్న భారత-‘ఎ’ జట్టు ఇప్పటికే పాకిస్తాన్-‘ఎ’, యూఏఈలపై గెలుపొంది సెమీస్ చేరింది. ఒమన్‌పై గెలిచి హ్యాట్రిక్ సాధిస్తే గ్రూప్-బి టాపర్‌గా నిలుస్తుంది. ఇదే గ్రూపులో ఉన్న పాకిస్తాన్ సైతం టాప్-4కు అర్హత సాధించింది. మరోవైపు.. గ్రూప్-ఏ నుంచి శ్రీలంక, అఫ్గనిస్తాన్ సెమీస్ బెర్తులు ఖరారు చేసుకున్నాయి. చదవండి: Sikandar Raza: పరుగుల విధ్వంసం.. ఫాస్టెస్ట్ సెంచరీ.. రోహిత్ రికార్డు బ్రేక్ -
ఉత్తమ స్పిన్నర్లలో ఒకడిని.. జట్టులో చోటివ్వండి: భారత బౌలర్
తనకు టెస్టుల్లో ఆడే అవకాశం ఇవ్వాలని టీమిండియా యువ ఆల్‌రౌండర్ ఆర్. సాయి కిశోర్ సెలక్టర్లకు విజ్ఞప్తి చేశాడు. భారత్‌లో ఉన్న ఉత్తమ స్పిన్నర్లలో తానూ ఒకడినని.. ఒక్క అవకాశం ఇస్తే తనను తాను నిరూపించుకుంటానని మేనేజ్మెంట్ను అభ్యర్థించాడు. తమిళనాడుకు చెందిన సాయి కిశోర్ ఆసియా క్రీడలు-2023 సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు.ఈ ప్రతిష్టాత్మక టోర్నీకి భారత క్రికెట్ నియంత్రణ మండలి తొలిసారి పంపిన క్రికెట్ జట్టులో భాగమైన ఈ లెఫ్టార్మ్ స్పిన్ బౌలర్.. మొత్తంగా మూడు టీ20లు ఆడి నాలుగు వికెట్లు పడగొట్టాడు. ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో గుజరాత్ టైటాన్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న సాయి కిశోర్.. ఈ ఏడాది పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్ సందర్భంగా అత్యుత్తమ గణాంకాలు(4/33) నమోదు చేశాడు.మెడకు తీవ్ర గాయంఅయితే, ఆ ఆనందం ఎక్కువకాలం నిలవలేదు. మ్యాచ్‌ల విరామ సమయంలో గోల్ఫ్ ఆడేందుకు వెళ్లిన సాయి కిశోర్.. మెడకు తీవ్రమైన గాయమైంది. ఫలితంగా ఐపీఎల్-2024 మిగిలిన మ్యాచ్‌లన్నింటికీ అతడు దూరం కావాల్సి వచ్చింది. ఈ క్రమంలో జాతీయ క్రికెట్ అకాడమీ(ఎన్సీఏ)లో పునరావాసం పొందిన సాయి.. ఈ ఏడాది జూలైలో తమిళనాడు ప్రీమియర్ లీగ్ సందర్భంగా తిరుప్పూర్ తమిళన్స్ తరఫున పునరాగమనం చేశాడు.తదుపరి దులిప్ ట్రోఫీ-2024లో సాయి భాగం కానున్నాడు. అభిమన్యు ఈశ్వరన్ సారథ్యంలోని టీమ్-బిలో ఆడనున్నాడు. ఈ నేపథ్యంలో ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో మాట్లాడిన సాయి కిశోర్.. తీవ్రమైన గాయం నుంచి కోలుకోవడం వెనుక ఎన్సీఏ ఫిజియోల కృషి ఎంతగానో ఉందని తెలిపాడు. వారితో పాటు తన భార్య కూడా కంటికి రెప్పలా కాచుకుని తనను తిరిగి మామూలు స్థితికి తీసుకువచ్చిందన్నాడు.భయపడ్డాను‘‘మనం నడవాలన్నా.. నిద్రించాలన్నా.. దేనికైనా మెడనే ఉపయోగిస్తాం. మెడకు గాయమైన తర్వాత.. క్రికెట్ మాట పక్కనపెడితే.. నేనసలు తిరిగి సాధారణ జీవితం గడపుతానో లేదోనని భయపడ్డాను. ఆటకు దూరమైనా బాధను దిగమింగుకోవాలని నా మనసును సన్నద్ధం చేసుకున్నాను. అయితే, తులసి అన్న(తులసిరామ్ యువరాజ్, ఎన్సీఏలో ఫిజియో) నేను కోలుకోవడంలో ఎంతో తోడ్పాటునందించారు.నా వ్యక్తిగత మసాజర్, ట్రైనర్ హర్షా.. ఇలా అందరూ నాకు సహాయం అందించారు. గాయం వల్ల అసలు ఎక్కువ సేపు కూర్చునే వీలు కూడా ఉండేది కాదు. ప్రతి పనికీ ఇతరుల మీద ఆధారపడాల్సి వచ్చేది. నా భార్య సహకారం వల్లే ఇప్పుడిలా కోలుకోగలిగాను’’ అని సాయి కిశోర్ తెలిపాడు.ఒక్క ఛాన్స్ ఇవ్వండిఇక తనకు టెస్టుల్లో ఆడాలని ఉందన్న సాయి కిశోర్.. రవీంద్ర జడేజాతో కలిసి ఒక్క మ్యాచ్‌లో భాగమైనా సంతోషంగా ఉంటుందని పేర్కొన్నాడు. ‘‘దేశంలోని ఉత్తమ స్పిన్నర్లలో నేనూ ఒకడినని భావిస్తా. టెస్టుల్లో నన్ను ఆడించండి. అందుకు నేను సిద్ధంగా ఉన్నాను. జడేజాతో కలిసి ఆడటం నాకు ఇష్టం. అతడిని దగ్గరగా గమనిస్తూ.. తన నుంచి పాఠాలు నేర్చుకునే అవకాశం ఉంటుంది’’ అని సాయి కిశోర్ తన మనసులోని మాటను వ్యక్తపరిచాడు.చదవండి: తారలు దిగివచ్చే వేళ.. అనంతపురంలో దులీప్ ట్రోఫీ -
రికార్డుల్లోకెక్కిన తమిళనాడు కెప్టెన్
తమిళనాడు రంజీ జట్టు కెప్టెన్ సాయికిషోర్ రికార్డు పుటల్లోకెక్కాడు. ముంబైతో జరుగుతున్న రెండో సెమీఫైనల్లో 6 వికెట్లు తీయడం ద్వారా ప్రస్తుత సీజన్లో తన వికెట్ల సంఖ్యను 52 పెంచుకున్నాడు. తద్వారా ఓ రంజీ సీజన్లో 50 అంతకంటే ఎక్కువ వికెట్లు పడగొట్టిన మూడో తమిళ బౌలర్‌గా రికార్డుల్లోకెక్కాడు. అలాగే ప్రస్తుత సీజన్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గానూ నిలిచాడు. ఈ సీజన్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో సాయికిషోర్ తర్వాత అజిత్ రామ్ (41), ధరేంద్ర సిన్హ్ జడేజా (41), హితేశ్ వాలుంజ్ (41), గౌరవ్ యాదవ్ (41) ఉన్నారు. ఇదిలా ఉంటే, ముంబైతో జరుగుతున్న మ్యాచ్‌లో తమిళనాడు తడబాటుకు గురైంది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న తమిళనాడు.. ముంబై బౌలర్లు సంయుక్తంగా రాణించడంతో 146 పరుగులకే కుప్పకూలింది. తుషార్ దేశ్ పాండే 3, ముషీర్ ఖాన్, శార్దూల్ ఠాకూర్, తనుశ్ కోటియన్ తలో 2 వికెట్లు, మోహిత అవస్థి ఓ వికెట్ పడగొట్టారు. తమిళనాడు ఇన్నింగ్స్‌లో విజయ్ శంకర్ (44), వాషింగ్టన్ సుందర్ కాస్త పర్వాలేదనిపించగా.. మిగతా వాళ్లంతా దారుణంగా విఫలమయ్యారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ముంబై... శార్దూల్ ఠాకూర్ (82 నాటౌట్), ముషీర్ ఖాన్ (55) రాణించడంతో రెండో రోజు మూడో సెషన్ సమయానికి 8 వికెట్ల నష్టానికి 254 పరుగులు చేసింది. హార్దిక్ తామోర్ (35) ఓ మోస్తరు స్కోర్ చేయగా.. శార్దూల్‌కు జతగా నుశ్ కోటియన్ (20) క్రీజ్‌లో ఉన్నాడు. సాయికిషోర్ (6/79) ముంబైని ముప్పుతిప్పలు పెట్టాడు. సందీప్ వారియర్, కుల్దీప్ సేన్ తలో వికెట్ దక్కించకున్నారు. ప్రస్తుతం ముంబై 108 పరుగుల లీడ్‌లో ఉంది. -
Ranji Trophy 2024: ఏడేళ్ల తర్వాత..!
తమిళనాడు క్రికెట్ జట్టు ఏడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత రంజీ ట్రోఫీ సెమీఫైనల్స్‌కు క్వాలిఫై అయ్యింది. ఇవాళ (ఫిబ్రవరి 25) ముగిసిన 2024 సీజన్ మూడో క్వార్టర్ ఫైనల్లో సౌరాష్ట్రను ఓడించడం ద్వారా ఈ జట్టు సెమీస్‌కు అర్హత సాధించింది. ఈ మ్యాచ్‌లో తమిళనాడు ఇన్నింగ్స్ 33 పరుగుల తేడాతో విజయం సాధించి, ఈ సీజన్లో సెమీస్‌కు అర్హత సాధించిన తొలి జట్టుగా నిలిచింది. కెప్టెన్ సాయికిషోర్ ఆల్‌రౌండ్ షోతో ఇరగదీసి (9/93, 60 పరుగులు) తమిళనాడును సెమీస్‌కు చేర్చాడు. లుత బ్యాటింగ్ చేసిన సౌరాష్ట్ర.. సాయికిషోర్ ఐదు వికెట్ల ప్రదర్శనతో చెలరేగడంతో 183 పరుగులకే కుప్పకూలింది. సౌరాష్ట్ర ఇన్నింగ్స్‌లో హార్విక్ దేశాయ్ (83) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన తమిళనాడు.. సాయికిషోర్ (60), ఇంద్రజిత్ (80), భూపతి కుమార్ (65) అర్దసెంచరీలతో రాణించడంతో 338 పరుగులు చేసి ఆలౌటైంది. సౌరాష్ట్ర బౌలర్లలో చిరాగ్ జానీ 3, ఉనద్కత్, పార్థ్ భట్, డి జడేజా తలో 2 వికెట్లు పడగొట్టారు. తొలి ఇన్నింగ్స్‌లో స్వల్ప స్కోర్‌కే పరిమితమైన సౌరాష్ట్ర సెకెండ్ ఇన్నింగ్స్‌లో ఇంకా దారుణమైన ప్రదర్శన చేసి 122 పరుగులకే చాపచుట్టేసింది. సాయికిషోర్ (4/27), సందీప్ వారియర్ (3/18), అజిత్ రామ్ (2/35) సౌరాష్ట్ర బ్యాటింగ్ లైనప్‌ను కకావికలం చేశారు. సౌరాష్ట్ర ఇన్నింగ్స్‌లో పుజారా టాప్ స్కోరర్‌గా నిలిచాడు. సమాంతరంగా జరుగుతున్న మిగతా క్వార్టర్ ఫైనల్స్‌లో.. విదర్భ-కర్ణాటక, ముంబై-బరోడా, మధ్యప్రదేశ్-ఆంధ్రప్రదేశ్ జట్లు తలపడుతున్నాయి. వీటిలో మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆంధ్రప్రదేశ్ ఒక్కటే విజయపు అంచుల్లో (గెలుపుకు 75 పరుగుల దూరంలో ఉంది, చేతిలో ఆరు వికెట్లు ఉన్నాయి) నిలిచింది. మిగతా రెండు మ్యాచ్‌లు నిదానంగా సాగుతున్నాయి. సెకెండ్ ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టపోకుండా 50 పరుగులు చేసిన విదర్భ.. కర్ణాటకపై 224 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుండగా.. వికెట్ నష్టానికి 21 పరుగులు చేసిన ముంబై బరోడాపై 57 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. మూడు మ్యాచ్‌ల్లో మరో రెండు రోజుల ఆట మిగిలింది. -
చెలరేగిన భారత బౌలర్లు.. బంగ్లాదేశ్ కేవలం 96 పరుగులకే
ఆసియాక్రీడలు-2023 పురుషల క్రికెట్లో భాగంగా బంగ్లాదేశ్‌తో సెమీఫైనల్లో భారత బౌలర్లు అదరగొట్టారు. పింగ్‌ఫెంగ్ క్యాంపస్ క్రికెట్ ఫీల్డ్ మైదానంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్‌కు భారత బౌలర్లు ముప్పుతిప్పలు పెట్టారు. స్పిన్నర్ల ధాటికి బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో కేవలం 96 పరుగులకే పరిమితమైంది. భారత బౌలర్లలో సాయికిషోర్ మూడు వికెట్లు పడగొట్టగా.. తిలక్ వర్మ, రవిబిష్ణోయ్, అర్ష్‌దీప్, షాబాజ్ అహ్మద్ తలా వికెట్ సాధించారు. బంగ్లా బ్యాటర్లలో జాకీర్ అలీ(24 నాటౌట్) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. చదవండి: World Cup 2023: ఆస్ట్రేలియాతో తొలి మ్యాచ్.. టీమిండియాకు భారీ షాక్! -
అతడిని భారత క్రికెటర్‌గా చూడటం చాలా సంతోషంగా ఉంది: దినేష్ కార్తీక్
తమిళనాడు యువ ఆల్‌రౌండర్ సాయి కిషోర్ నేపాల్‌పై టీమిండియా తరుపున అంతర్జాతీయ అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. ఆసియాక్రీడలు-2023లో భాగంగా నేపాల్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌తో సాయి కిషోర్ అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టాడు. ఈ సందర్భంగా సాయి కిషోర్‌కు తన సహచర ఆటగాడు, వెటరన్ వికెట్ కీపర్ దినేష్ కార్తీక్ అభినందనలు తెలిపాడు. "కష్టపడి పనిచేసే వ్యక్తులకు ఆ దేవుడు ఖచ్చితంగా అన్ని తిరిగి ఇస్తాడు. తెల్ల బంతితో దేశవాళీ క్రికెట్లో అద్బుతాలు చేసిన ఈ ఆటగాడు.. ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. ఉదయం లేచి ప్లేయింగ్ ఎలెవన్‌లో అతడి పేరు చూడగానే భావోద్వేగానికి లోనయ్యాను. మీరు అతడు బాగా రాణించాలని కోరుకుంటున్నారు. కానీ అతడు ఎప్పుడూ నా దృష్టిలో నెంబర్1గానే ఉంటాడు. సాయి కిషోర్‌కు బ్యాటింగ్, బౌలింగ్ చేయగల సత్తా ఉంది. అతడు తన బ్యాటింగ్‌ను కూడా బాగా మెరుగుపరుచుకున్నాడు. అతడు కేవలం టీ20 క్రికెట్‌కు మాత్రమే కాదు అన్ని ఫార్మాట్లకు సరిపోయే ఆటగాడు. అతడిని ఇండియన్ క్రికెటర్‌గా చూడటం చాలా సంతోషంగా ఉంది. నీవు మరిన్ని అద్బుతాలు సృష్టించు సాయి" అంటూ ఎక్స్(ట్విటర్)లో దినేష్ కార్తీక్ రాసుకొచ్చాడు. కాగా ఈ మ్యాచ్ జాతీయ గీతాలాపన సమయంలో సాయి కిషోర్ తీవ్రమైన భావోద్వేగానికి లోనయ్యాడు. తొలి మ్యాచ్‌లో సాయి కిషోర్ పర్వాలేదనపించాడు. 4 ఓవర్లు బౌలింగ్ చేసిన సాయి కిషోర్ 25 పరుగులిచ్చి ఒక్క వికెట్ పడగొట్టాడు. చదవండి: వంట గదిలో నిద్రపోయేవాళ్లం.. మార్కెట్లో స్నాక్స్ అమ్మేవాడిని: పాక్ స్టార్ ఆటగాడు God has his ways of giving back to people who work hard This unbelievable player @saik_99 who has DOMINATED domestic cricket with white ball is an absolute superstar and I couldn't be happier for him. Woke up in the morning and when I saw his name in the 11 , i was… https://t.co/6RijBdRP6R — DK (@DineshKarthik) October 3, 2023 -
టీమిండియా స్టార్ భావోద్వేగం.. జాతీయ గీతం ఆలపిస్తూ కంటతడి!
తమిళనాడు యువ ఆల్‌రౌండర్ సాయి కిషోర్ భారత జట్టు తరపున అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. ఆసియా క్రీడలు-2023లో భాగంగా నేపాల్‌పై సాయి కిషోర్ తన తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. ఈ క్రమంలో సాయి కిషోర్ తన తొలి మ్యాచ్‌లో కన్నీళ్లు పెట్టుకున్నాడు. మ్యాచ్ ప్రారంభానికి ముందు జాతీయ గీతాలాపన సమయంలో తీవ్రమైన భావోద్వేగానికి లోనయ్యాడు. జాతీయ గీతం ప్రారంభం కాగానే సాయి కిషోర్ కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా సాయి తన తొలి మ్యాచ్‌లో మెరుగైన ప్రదర్శన కనబరిచాడు. ఈ మ్యాచ్‌లో 4 ఓవర్లు బౌలింగ్ చేసిన సాయి కిషోర్ 25 పరుగులిచ్చి ఒక్క వికెట్ పడగొట్టాడు. ఇక ఈ మ్యాచ్‌లో నేపాల్‌పై 23 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది. ఈ విజయంతో ఏషియన్ గేమ్స్ సెమీఫైనల్లో టీమిండియా అడుగుపెట్టింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 202 పరుగుల భారీ స్కోర్ సాధించింది. భారత బ్యాటర్లలో ఓపెనర్ యశస్వీ జైశ్వాల్(100) సెంచరీతో చెలరేగగా.. ఆఖరిలో రింకూ సింగ్(37 నాటౌట్ ), శివమ్ దుబే(25 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. అనంతరం 203 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన నేపాల్.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 179 పరుగులు మాత్రమే చేసింది. భారత బౌలర్లలో రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్ తలా మూడు వికెట్లతో చెలరేగగా.. అర్ష్‌దీప్ రెండు, సాయి కిషోర్ ఒక్క వికెట్ సాధించారు. చదవండి: వంట గదిలో నిద్రపోయేవాళ్లం.. మార్కెట్లో స్నాక్స్ అమ్మేవాడిని: పాక్ స్టార్ ఆటగాడు Emotions aplenty as Sai Kishore swelled up during the national anthem of 🇮🇳, making his T20I debut today 🆚🇳🇵 Drop a 💙 if you believe hard work always pays off 🙌💯#Cheer4India #TeamIndia #Cricket #HangzhouAsianGames #AsianGames2023 #SonyLIV pic.twitter.com/x9fdZjIGg2 — Sony LIV (@SonyLIV) October 3, 2023 -
ప్రియాంక్ కెప్టెన్ ఇన్నింగ్స్ వృధా.. దులీప్ ట్రోఫీ విజేతగా సౌత్ జోన్
దులీప్ ట్రోఫీ-2023 విజేతగా సౌత్ జోన్ నిలిచింది. చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన ఫైనల్లో వెస్ట్‌జోన్‌పై 75 పరుగుల తేడాతో సౌత్ జోన్ విజయం సాధించింది. ఇది సౌత్‌జోన్‌కు 14వ దులీప్ ట్రోఫీ విజయం కావడం గమనార్హం. 182/5 ఓవర్‌నైట్ స్కోర్‌తో ఆఖరి రోజు ఆటను ప్రారంభించిన వెస్ట్‌జోన్.. అదనంగా కేవలం 40 పరుగులు మాత్రమే చేసి ఓటమి చవి చూసింది. వెస్ట్ జోన్ కెప్టెన్ ప్రియాంక్ పాంచల్ (95), సర్ఫరాజ్ ఖాన్ (48) పోరాడినా.. ఓటమి తప్పలేదు. సౌత్ జోన్ బౌలర్లు వాసుకి కౌషిక్ (4/36), సాయి కిశోర్ (4/57) చెలరేగడంతో వెస్ట్‌జోన్ కుప్పకూలింది. అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో సౌత్ జోన్ 213 పరుగులకు ఆలౌటైంది. అనంతరం వెస్ట్‌జోన్ తన మొదటి ఇన్నింగ్స్‌లో 146 పరుగులకే చాపచుట్టేసింది. సౌత్ జోన్ బౌలర్ కావేరప్ప ఏకంగా ఏడు వికెట్లు తీసి వెస్ట్ జోన్‌ను దెబ్బకొట్టాడు. దీంతో 67 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన సౌత్ జోన్ 230 పరుగుల వద్ద తమ ఇన్నింగ్స్ ముగించింది. దీంతో వెస్ట్‌జోన్ ఎదుట 298 పరుగులను లక్ష్యంగా నిర్దేశించింది. అనంతరం వెస్ట్‌జోన్ 222 పరుగులకే పరిమితమైంది. ఇక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, సిరీస్ అవార్డులను సౌత్ జోన్ బౌలర్ కావేరప్ప సొంతం చేసుకున్నాడు. చదవండి: Ind Vs Wi: ఇంత తక్కువ ప్రైజ్‌మనీ ఎందుకివ్వడం.. మిక్సీలు, గ్రైండర్లు ఇవ్వడం బెటర్! -
ఆసీస్‌తో తొలి టెస్ట్.. టీమిండియాతో చేరనున్న వాషింగ్టన్ సుందర్
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ-2023లో భాగంగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య ఫిబ్రవరి 9 నుంచి నాగ్‌పూర్ వేదికగా మొదలుకానున్న మొదటి టెస్ట్ కోసం టీమిండియా సెలెక్టర్లు నలుగురు నెట్ బౌలర్లను ఎంపిక చేశారు. ఆశ్చర్యకరంగా ఈ నలుగురు స్పిన్ బౌలర్లే కావడం విశేషం. సెలెక్టర్లు ఎంపిక చేసిన నలుగురిలో టీమిండియా పరిమిత ఓవర్ల ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్, ఉత్తర్‌ప్రదేశ్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ సౌరభ్ కుమార్, రాజస్థాన్ లెగ్ స్పిన్నర్, టీమిండియా బౌలర్ రాహుల్ చాహర్, తమిళనాడు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్, ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్ బౌలర్ సాయి కిషోర్ ఉన్నారు. ఈ నలుగురు స్పిన్నర్లు నాగ్‌పూర్‌లో జరుగుతున్న ప్రాక్టీస్ సెషన్లో టీమిండియాతో రేపటి నుంచి కలుస్తారిన సెలెక్టర్లు శుక్రవారం (ఫిబ్రవరి 3) ప్రకటించారు. ఆసీస్ బౌలర్లను, ముఖ్యంగా స్పిన్నర్లను సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు వైవిధ్యమైన స్పిన్నర్లు అవసరమనే ఉద్దేశంతో వీరిని ఎంపిక చేసినట్లు సెలెక్టర్లు తెలిపారు. ఇప్పటికే తొలి రెండు టెస్ట్‌లకు ఎంపిక జట్టులో నలుగురు స్పిన్నర్లు (కుల్దీప్, అశ్విన్, అక్షర్, జడేజా) ఉన్నప్పటికీ.. సెలెక్టర్లు అదనంగా మరో నలుగురు స్పిన్నర్లను (నెట్ బౌలర్లు) ఎంపిక చేశారు. ఎందుకంటే ఆసీస్ స్పిన్ విభాగంలో (నాథన్ లయోన్ (ఆఫ్ స్పిన్నర్), మిచెల్ స్వెప్సన్ (లెగ్ స్పిన్నర్), టాడ్ మర్ఫీ (ఆఫ్ స్పిన్నర్), ట్రవిస్ హెడ్ (ఆఫ్ స్పిన్నర్), అస్టన్ అగర్ (లెఫ్ ఆర్మ్ ఆర్థోడాక్స్)) ముగ్గురు ఆఫ్ స్పిన్నర్లు, ఓ లెగ్ స్పిన్నర్, ఓ లెఫ్ ఆర్మ్ ఆర్థోడాక్స్ బౌలర్ ఉన్నారు. వీరిని ఎదుర్కోవాలంటే అదే వాటం ఉన్న బౌలర్లయితే ప్రయోజనకరంగా ఉంటుందని సెలెక్టర్లు ఈ ఎత్తుగడ వేశారు. భారత స్పిన్ విభాగంలో ఒక్క అశ్విన్ మినహా మిగతా ముగ్గురు లెఫ్ ఆర్మ్ బౌలర్లే కావడంతో ఆఫ్ స్పిన్నర్, లెగ్ స్పిన్నర్లతో నెట్స్‌లో ప్రాక్టీస్ చేయిస్తే బాగుంటుందని జట్టు కోచ్ సెలక్టర్లను కోరినట్లు తెలుస్తోంది. వాస్తవానికి ఆసీస్ బౌలింగ్ విభాగంలో స్పిన్నర్ల కంటే పేసర్ల (కమిన్స్, స్టార్క్, హేజిల్‌వుడ్, బోలాండ్) డామినేషనే అధికంగా ఉంది. ఈ పరిస్థితుల్లో నెట్స్‌లో స్పిన్నర్లతో సమానంగా పేసర్లతో బౌలింగ్ చేయిస్తే, టీమిండియాకు ప్రయోజనకరంగా ఉంటుంది. -
రెండేళ్లు సినిమాలకు దూరమయ్యాను: చేతన్ మద్దినేని
కరోనా కారణంగా రెండేళ్లు సినిమాలకు దూరమయ్యానని, ఈ గ్యాప్‌లో చాలా కథలు విన్నాను కానీ గోపిమోహన్ చెప్పిన స్టోరీ ఒకటే బాగా కనెక్ట్ అయిందని యంగ్ హీరో చేతన్ మద్దినేని అన్నారు. రోజులుమారాయి సినిమాతో టాలీవుడ్‌కి పరిచమైన చేతన్ మద్దినేని.. గల్ఫ్, ఫస్ట్ ర్యాంక్ రాజు చిత్రాలతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. నేడు(జనవరి 29) ఆయన బర్త్‌డే. ఈ సందర్బంగా తన కొత్త చిత్రం గురించి చెబుతూ.. ‘సాయి కిషోర్ దర్శకత్వంలో ఒక రొమాంటిక్ ఎంటర్టైనర్ చేస్తున్నాను. గోపిమోహన్ చెప్పిన కథ నచ్చి నేనే సొంతంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాను. యాభై శాతం పూర్తి అయిన ఈ సినిమాను పోలెండ్ లో షూట్ చేశాం. రెడీ, డీ, చిరునవ్వుతో సినిమాల తరహాలో ఈ మూవీ ఉండబోతొంది. గోపిసుందర్ ఈ సినిమాకు మంచి మ్యూజిక్ ఇచ్చారు. ఇదివరకే మూడు పాటలను చిత్రీకరించాము. హెబ్బ పటేల్ ఈ సినిమా కోసం మంచి మెకోవర్ అయ్యి బెస్ట్ పెర్ఫామెన్స్ ఇచ్చింది. అలాగే మేజర్ యాక్టర్స్ ఈ మూవీలో నటించారు. త్వరలో ఈ మూవీ టైటిల్ ను అనౌన్స్ చేస్తాం’ అన్నారు. -
రవితేజ మెరుపు శతకం, పదేసిన సాయికిషోర్.. ఫైనల్లో సౌత్ జోన్, వెస్ట్ జోన్
హైదరాబాద్ ఆటగాడు తెలుకపల్లి రవితేజ (120 బంతుల్లో 104 నాటౌట్; 7 ఫోర్లు, 3 సిక్సర్లు), తమిళనాడు యువ కిషోరం రవి శ్రీనివాసన్ సాయికిషోర్ (10/98) రెచ్చిపోవడంతో నార్త్ జోన్‌తో జరిగిన దులీప్ ట్రోఫీ రెండో సెమీ ఫైనల్లో సౌత్ జోన్ 645 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. మరోవైపు షమ్స్ ములానీ (5/72), చింతన్ గజా (3/49) చెలరేగడంతో కొయంబత్తూర్ వేదికగా సెంట్రల్ జోన్‌తో జరిగిన తొలి సెమీ ఫైనల్లో వెస్ట్ జోన్ 279 పరుగుల తేడాతో ఘన విజయం నమోదు చేసింది. ఈ రెండు జట్లు (సౌత్ జోన్, వెస్ట్ జోన్) ఈనెల 21 నుంచి 25 వరకు కొయంబత్తూర్ వేదికగా జరిగే ఫైనల్లో అమీతుమీ తేల్చుకోనున్నాయి. సౌత్ జోన్-నార్త్ జోన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ విషయానికొస్తే.. వికెట్ నష్టానికి 157 పరుగుల వద్ద నాలుగో రోజు ఆటను ప్రారంభించిన సౌత్ జోన్.. మరో 159 పరుగులు జోడించి 316/4 స్కోర్ వద్ద రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. మయాంక్ అగర్వాల్ ఓవర్‌నైట్ స్కోర్‌కు మరో 11 పరుగులు జోడించి 64 పరుగుల వద్ద ఔటవగా.. రవితేజ సూపర్ ఫాస్ట్‌గా సెంచరీ సాధించి ప్రత్యర్ధికి 740 పరుగుల భారీ టార్గెట్‌ను నిర్ధేశించారు. కష్టసాధ్యమైన లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన నార్త్ జోన్ కృష్ణప్ప గౌతమ్ (3/50), సాయికిషోర్ (3/28), తనయ్ త్యాగరాజన్ (3/12) దెబ్బకు కేవలం 94 పరుగులు మాత్రమే చేసి ఆలౌటై ఓటమిపాలైంది. నార్త్ జోన్ ఇన్నింగ్స్‌లో ఓపెనర్లు యష్ దుల్ (59), మనన్ వోహ్రా (11) మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. సౌత్ జోన్ తొలి ఇన్నింగ్స్: 630/8 డిక్లేర్ (కున్నుమ్మల్ 143, హనుమ విహారి 134, రికీ భుయ్ 103) నార్త్ జోన్ తొలి ఇన్నింగ్స్: 207 ఆలౌట్ (నిషాంత్ సింధు 40, సాయికిషోర్ 7/70) సౌత్ జోన్ సెకెండ్ ఇన్నింగ్స్: 316/4 డిక్లేర్ (రవితేజ 104, కున్నుమ్మల్ 77) నార్త్ జోన్ సెకెండ్ ఇన్నింగ్స్: 94 ఆలౌట్ (యశ్ ధుల్ 59, సాయికిషోర్ 3/28) ఇక వెస్ట్ జోన్-సెంట్రల్ జోన్ల మధ్య జరిగిన తొలి సెమీఫైనల్ విషయానికొస్తే.. వెస్ట్ జోన్ నిర్ధేశించిన 500 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 2 వికెట్ల నష్టానికి 22 పరుగుల స్కోర్ వద్ద నాలుగో రోజు ఆటను ప్రారంభించిన సెంట్రల్ జోన్ మరో 199 పరుగులు జోడించి మిగిలిన 8 వికెట్లు కోల్పోయి ఓటమిపాలైంది. రింకూ సింగ్ (65) ఒక్కడే హాఫ్ సెంచరీతో ప్రతిఘటించే ప్రయత్నం చేశాడు. వెస్ట్ జోన్ బౌలర్లలో షమ్స్ ములానీ (5/72), చింతన్ గజా (3/49), ఉనద్కత్ (1/44), అతిత్ సేథ్ (1/20) వికెట్లు పడగొట్టారు. వెస్ట్ జోన్ తొలి ఇన్నింగ్స్: 257 ఆలౌట్ (పృథ్వీ షా 60, రాహుల్ త్రిపాఠి 67, కుమార్ కార్తీకేయ 5/66) సెంట్రల్ జోన్ తొలి ఇన్నింగ్స్: 128 ఆలౌట్ (కరణ్ శర్మ 34 , ఉనద్కత్ 3/24, తరుష్ కోటియన్ 3/17) వెస్ట్ జోన్ సెకెండ్ ఇన్నింగ్స్: 371 ఆలౌట్ (పృథ్వీ షా 142, హెథ్ పటేల్ 67, కుమార్ కార్తీకేయ 3/105) సెంట్రల్ జోన్ సెకెండ్ ఇన్నింగ్స్: 221 ఆలౌట్ (రింకూ సింగ్ 65, షమ్ ములానీ 5/72) -
సంచలన బౌలింగ్‌తో మెరిసిన గుజరాత్ టైటాన్స్ బౌలర్
ఐపీఎల్ 2022 విజేత గుజరాత్ టైటాన్స్ బౌలర్ ఆర్. సాయి కిషోర్ తమిళనాడు ప్రీమియర్ లీగ్(TNPL)లో సంచలనం సృష్టించాడు. ప్రతీ బౌలర్ కలగనే స్పెల్‌ను సాయి కిషోర్ సాధించాడు. లీగ్‌లో భాగంగా ఐ డ్రీమ్ తిర్నూర్ తమిళన్స్, చేపాక్ సూపర్ గల్లీస్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో సాయి కిషోర్ (4-3-2-4) వరల్డ్ క్లాస్ బౌలింగ్ నమదోఉ చేశాడు. నాలుగో ఓవర్లు వేస్తే అందులో మూడు మెయిడెన్లు అంటేనే సాయి కిషోర్ ఎలా బౌలింగ్ చేశాడనేది తెలుస్తోంది. మరి ఇలాంటి అద్బుత ప్రదర్శన చేస్తే తన జట్టు గెలవకుండా ఉంటుందా. ఐడ్రీమ్ తిర్పూర్పై చేపాక్ సూపర్ గల్లీస్ ఏకంగా 60 పరుగులతో ఘన విజయం సాధించింది. సాయి కిషోర్ ప్రదర్శనను మెచ్చుకుంటూ అభిమానులు కామెంట్స్ చేశారు. వరల్డ్ క్లాస్ బౌలింగ్ నమోదు చేశాడు.. ఇలాంటి క్రికెటర్ జట్టులో కచ్చితంగా ఉండాలి.. వారెవ్వా సాయికిషోర్.. ప్రతీ బౌలర్ కలలు గనే స్పెల్ వేశావు.. నీ బౌలింగ్‌కు ఫిదా అంటూ పేర్కొన్నారు. ఇక మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన చెపాక్ సూపర్ గిల్లీస్ జట్టు 20 ఓవర్లు ముగిసేసరికి 9 వికెట్ల నష్టానికి 133 పరుగులు చేసింది. ఆ జట్టులో ససిదేవ్ అత్యధికంగా 45 పరుగులు చేశాడు. అనంతరం 133 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన తిర్పూర్ తమిళన్స్ 73 పరుగులకే కుప్పకూలింది. ఆ జట్టులో కెప్టెన్ శ్రీకాంత్ అనిరుధ 25 పరుగులతో టాప్ స్కోరర్ కాగా.. సాయి కిషోర్ 4 వికెట్లు, సందీప్ వారియర్ 3 వికెట్లు, ఆర్ అలెగ్జాండర్ 2 వికెట్లు, సోను యాదవ్ 1 వికెట్ తీశారు. Sai Kishore on 🔥 #TNPL2022 pic.twitter.com/nDIi05Fmvn — Santhosh Kumar (@giffy6ty) July 22, 2022 చదవండి: క్రికెట్లో అలజడి.. స్కాట్లాండ్ బోర్డు మూకుమ్మడి రాజీనామా -
షారుక్ ఖాన్, సాయి కిషోర్‌లకి బంపర్ ఆఫర్.. ఏకంగా టీమిండియాకు!
స్వదేశలో టీమిండియా వెస్టిండీస్‌తో మూడు వన్డేలు, మూడు టీ20ల్లో తలపడనుంది. ఆహ్మదాబాద్ వేదికగా ఫిబ్రవరి 6న తొలి వన్డే జరగనుంది. ఇప్పటికే వన్డే ,టీ20 సిరీస్‌లకు భారత జట్టును బీసీసీఐ ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. అయితే వెస్టిండీస్‌తో జరగనున్న వైట్-బాల్ సిరీస్ కోసం తమిళనాడు స్టార్ ఆటగాళ్లు షారుక్ ఖాన్ , సాయి కిషోర్‌లను టీమిండియా బ్యాకప్‌గా బీసీసీఐ ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. కాగా గత ఏడాది జరిగిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ, విజయ్ హాజారే టర్నమెంట్లో వీరిద్దరూ అద్భుతంగా రాణించారు. భారత్- విండీస్ సిరీస్ సమయంలో ఏ ఆటగాడైనా కరోనా బారినా పడితే వీరిద్దరూ జట్టులోకి రానున్నారు. కాగా రెండేళ్లలో అనేక సిరీస్‌ల మధ్యలో చాలా మంది ఆటగాళ్లు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే వీరిద్దరినీ రిజర్వ్ ప్లేయర్లుగా బీసీసీఐ ఎంపిక చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వన్డే జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), రుతురాజ్, శిఖర్ ధావన్, కోహ్లి, సూర్యకుమార్, శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్, దీపక్ చహర్, శార్దుల్ ఠాకూర్, యుజువేంద్ర చహల్, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, సిరాజ్, ప్రసిధ్ కృష్ణ, రవి బిష్ణోయ్, అవేశ్ ఖాన్, దీపక్ హుడా చదవండి: బంతిని చూడకుండానే భారీ సిక్సర్... అంత కాన్ఫిడెన్స్ ఏంటి రషీద్ భయ్యా! -
ఫీజుల పథకంతో ఎంబీఏ చదివా..
పేదరికం కారణంగా పెద్ద చదువులకు దూరం కావొద్దన్న ఆశయంతోనే వైఎస్ తెచ్చిన ఫీజుల పథకం ఎందరికో ఉన్నత విద్యను అందించింది.ఎందరో మంచి ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. వారిలో జగిత్యాలకు చెందిన సాయికిశోర్ ఒకరు. ‘‘మాది జగిత్యాల జిల్లా విద్యానగర్. జగిత్యాలలో ఇంటర్ వరకు చదివా. తర్వాత ఎంబీఏలో సీటు వచ్చినా ఆర్థిక ఇబ్బందులు ఉండేవి. అప్పుడే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్మెంట్ పథకం ఎంతగానో ఉపయోగపడింది. ఆ పథకం సాయంతో కరీంనగర్‌లోని వివేకానంద పీజీ కాలేజీలో ఎంబీఏ పూర్తిచేశాను. ప్రస్తుతం హైదరాబాద్‌లోని ప్రముఖ ఐటీ కంపెనీలో హెచ్ఆర్గా చేస్తున్నాను’’ అని ఆయన చెప్పారు. -
అక్రమాస్తుల అన్వేషణలో ఏసీబీ
నల్లగొండ క్రైం : పట్టణంలో గురువారం తెల్లవారుజామున ఏసీబీ అధికారులు హల్చల్ సృష్టించారు. లెక్కలేనన్ని అక్రమాస్తులు కూడబెట్టాడనే ఫిర్యాదుపై నల్లగొండ-మహబూబ్‌నగర్ డివిజన్ వాణిజ్య పన్నుల శాఖ డిప్యూటి కమిషనర్ నల్ల సాయికిషోర్‌ను గురువారం తెల్లవారుజామున పట్టణంలోని మీర్బాగ్ కాలనీలోని అద్దె ఇంట్లో అరెస్టు చేసి హైదరాబాద్‌కు తీసుకెళ్లారు. సాయికుమార్ అక్రమాస్తుల కేసుపై అన్వేషణలో ఉన్న అధికారులు తెల్లవారుజామున ఒక్కసారిగా సాయికిషోర్ ఉంటున్న ఇంటిపై సోదాలను నిర్వహించారు. పలుడాక్యుమెంట్లను, విలువైన ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు. ముందు కార్యాలయంలో సోదాలు నిర్వహించిన అధికారులు రూ.60వేల నగదుతో పాటు ఇతర విలువైన పత్రాలను చేజిక్కించుకున్నారు. అక్రమాస్తులను లోతుగా తొవ్వి నిగ్గుతేల్చేందుకు ఏసీబీ బృందాలు రంగంలోకి దిగాయి. సాయికిషోర్ సొంత జిల్లా అయిన కృష్ణాజిల్లాలోని తిరుపురంలో కూడా సోదాలు జరిగాయి. హైదరాబాదులోని గచ్చిబౌలి, లోయర్‌ట్యాంక్ బండ్ ప్రాంతాల్లో రెండు ఇళ్లు, సొంత జిల్లాలో చాపల చెరువులు, బినామీ ఆస్తులు కూడా ఉన్నట్టు గుర్తించారు. గతంలో పనిచేసిన గుంతకల్లు, గుంటూరు, మలక్‌పేటలోని ఆస్తుల వివరాలను తెలుసుకునేందుకు కూపీ లాగుతున్నారు. బ్యాంకు ఖాతాలు, వాటిలోని బ్యాలెన్స్‌లు తెలుసుకునేందుకు బ్యాంక్ అధికారులను సంప్రదించే పనిలో పడ్డారు. బంధువుల పేరున బ్యాంక్ బినామీ ఆస్తులున్నాయన్న కోణంలో దర్యాప్తు నిర్వహిస్తున్నారు. ప్రాంతాల వారీగా విడిపోయిన ఏసీబీ అధికారులు ఏకకాలంలో అన్ని ప్రాంతాల్లో దాడులు నిర్వహించారు. రాత్రి వరకు రూ. 3కోట్ల ఆస్తులున్నట్లు తెలుసుకుని దొరికిన ఆధారాల ప్రకారం అరెస్ట్ చేశారు. ప్రస్తుతం హైదరాబాదులోని సాయికిషోర్ నివాసంలో విచారణ కొనసాగుతుందని ఏసీబీ సీఐ శ్రీనివాస్ తెలిపారు. విస్సన్నపేటలో.. విస్సన్నపేట: నల్లగొండ వాణిజ్యపన్నుల శాఖ డిప్యూటీ కమిషనర్ నాళ్ల సాయికిషోర్‌కు సంబంధించి కృష్ణా జిల్లా విస్సన్నపేటలోని అతని బంధువు అయిన జి.సత్యహనుమంతరావు ఇంట్లో సీబీఐ అధికారులు గురువారం సోదాలు నిర్వహించారు. వ్యాపారి ఇంట సోదాలు తిరువూరు : కృష్ణా జిల్లా తిరువూరులో విత్తనాల వ్యాపారం చేసే నాళ్ల సాయిప్రసాద్ నివాసంలో గురువారం అవినీతి నిరోధక శాఖాధికారులు సోదాలు చేశారు. ఆయన సోదరుడు నాళ్ల కిషోర్ నల్లగొండలో వాణిజ్య పన్నుల అధికారిగా పనిచేస్తూ ఏసీబీ వలలో చిక్కగా, ఆయన స్వగ్రామమైన తిరువూరులో కూడా విసృ్తత తనిఖీలు నిర్వహించారు. కిషోర్ సోదరుడు సాయిప్రసాద్, తండ్రి రంగారావులతో పాటు పలువురు బంధువుల ఇళ్లల్లోనూ తనిఖీలు కొనసాగుతున్నాయి. ఆ కుటుంబానికి చెందిన బ్యాంకు ఖాతాలు, వ్యాపార సంస్థల రికార్డులు, భూముల అమ్మకం, కొనుగోళ్ల లావాదేవీలను ఏసీబీ నల్లగొండ, ఖమ్మం, కృష్ణాజిల్లాల సీఐలు లింగయ్య, వెంకటేశ్వరరావు, రామరాజు పరిశీలిస్తున్నారు. ఉన్నతాధికారులకు తనిఖీ వివరాలు వెల్లడిస్తామని అధికారులు తెలిపారు.