
ఐపీఎల్ 2022 విజేత గుజరాత్ టైటాన్స్ బౌలర్ ఆర్. సాయి కిషోర్ తమిళనాడు ప్రీమియర్ లీగ్(TNPL)లో సంచలనం సృష్టించాడు. ప్రతీ బౌలర్ కలగనే స్పెల్‌ను సాయి కిషోర్ సాధించాడు. లీగ్‌లో భాగంగా ఐ డ్రీమ్ తిర్నూర్ తమిళన్స్, చేపాక్ సూపర్ గల్లీస్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో సాయి కిషోర్ (4-3-2-4) వరల్డ్ క్లాస్ బౌలింగ్ నమదోఉ చేశాడు. నాలుగో ఓవర్లు వేస్తే అందులో మూడు మెయిడెన్లు అంటేనే సాయి కిషోర్ ఎలా బౌలింగ్ చేశాడనేది తెలుస్తోంది.
మరి ఇలాంటి అద్బుత ప్రదర్శన చేస్తే తన జట్టు గెలవకుండా ఉంటుందా. ఐడ్రీమ్ తిర్పూర్‌పై చేపాక్ సూపర్ గల్లీస్ ఏకంగా 60 పరుగులతో ఘన విజయం సాధించింది. సాయి కిషోర్ ప్రదర్శనను మెచ్చుకుంటూ అభిమానులు కామెంట్స్ చేశారు. వరల్డ్ క్లాస్ బౌలింగ్ నమోదు చేశాడు.. ఇలాంటి క్రికెటర్ జట్టులో కచ్చితంగా ఉండాలి.. వారెవ్వా సాయికిషోర్.. ప్రతీ బౌలర్ కలలు గనే స్పెల్ వేశావు.. నీ బౌలింగ్‌కు ఫిదా అంటూ పేర్కొన్నారు.
ఇక మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన చెపాక్ సూపర్ గిల్లీస్ జట్టు 20 ఓవర్లు ముగిసేసరికి 9 వికెట్ల నష్టానికి 133 పరుగులు చేసింది. ఆ జట్టులో ససిదేవ్ అత్యధికంగా 45 పరుగులు చేశాడు. అనంతరం 133 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన తిర్పూర్ తమిళన్స్ 73 పరుగులకే కుప్పకూలింది. ఆ జట్టులో కెప్టెన్ శ్రీకాంత్ అనిరుధ 25 పరుగులతో టాప్ స్కోరర్ కాగా.. సాయి కిషోర్ 4 వికెట్లు, సందీప్ వారియర్ 3 వికెట్లు, ఆర్ అలెగ్జాండర్ 2 వికెట్లు, సోను యాదవ్ 1 వికెట్ తీశారు.
Sai Kishore on 🔥 #TNPL2022 pic.twitter.com/nDIi05Fmvn
— Santhosh Kumar (@giffy6ty) July 22, 2022
చదవండి: క్రికెట్‌లో అలజడి.. స్కాట్లాండ్ బోర్డు మూకుమ్మడి రాజీనామా