TNPL
-
టీఎన్‌పీఎల్ 2023 విజేత లైకా కోవై కింగ్స్.. వరుసగా రెండోసారి
నెలరోజుల పాటు క్రికెట్ ప్రేమికులను అలరించిన తమిళనాడు ప్రీమియర్(TNPL 2023) లీగ్‌లో లైకా కోవై కింగ్స్ విజేతగా నిలిచింది. బుధవారం రాత్రి జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో నెల్లయ్ రాయల్ కింగ్స్‌పై 104 పరుగుల తేడాతో భారీ విజయాన్ని సాధించిన లైకా కింగ్స్ వరుసగా రెండోసారి చాంపియన్‌గా నిలవడం విశేషం. తొలుత బ్యాటింగ్ చేసిన లైకా కోవై కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 205 పరుగుల భారీ స్కోరు చేసింది. సురేశ్ కుమార్(33 బంతుల్లో 57 పరుగులు), ముకిలేష్(40 బంతుల్లో 51 నాటౌట్) నిలకడగా ఆడగా.. చివర్లో అతీక్ ఉర్ రెహమాన్(21 బంతుల్లోనే 50 పరుగులు) మెరుపులు మెరిపించాడు. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన నెల్లయ్ రాయల్ కింగ్స్ 15 ఓవర్లలో 101 పరుగులకే కుప్పకూలింది. అరుణ్ కార్తిక్ 27 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. లక్ష్మేషా సుర్యప్రకాశ్ 22 పరుగులు చేశాడు. లైకా కోవై కింగ్స్ బౌలర్లలో జతదేవ్ సుబ్రమణ్యన్ నాలుగు వికెట్లు తీయగా.. కెప్టెన్ షారుక్ ఖాన్ మూడు, మణిమరన్ సిద్దార్థ్, గౌతమ్ కన్నన్, మహ్మద్‌లు తలా ఒక వికెట్ తీశారు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా జతదేవ్ సుబ్రమణ్యన్ నిలవగా.. ఆరెంజ్ క్యాప్‌ను నెల్లయ్ రాయల్ కింగ్స్ బ్యాటర్ అజితేశ్ గురుస్వామి(10 మ్యాచ్‌ల్లో 385 పరుగులు) గెలుచుకోగా.. పర్పుల్ క్యాప్‌ను లైకా కోవై కింగ్స్ కెప్టెన్ షారుక్ ఖాన్(9 మ్యాచ్‌ల్లో 17 వికెట్లు) అందుకున్నాడు. And the party🪇 mood starts!❤️#TNPL2023🏏#GethuKaatuvoma#sekkalisingamla#TNPLonstarsports#TNPLonfancode#NammaAatamAarambam💥#NammaOoruNammaGethu💪🏼 pic.twitter.com/ygqBBSACxg — TNPL (@TNPremierLeague) July 12, 2023 Lyca Kovai, Kings once again!#TNPLonFanCode pic.twitter.com/ALXkYMzChX — FanCode (@FanCode) July 12, 2023 చదవండి: #CarlosAlcaraz: 'నాన్నను నిందించొద్దు.. ప్రేమతో అలా చేశాడు; నాకు ఒరిగేదేం లేదు!' 'సూపర్‌మ్యాన్' సిరాజ్.. కళ్లు చెదిరే క్యాచ్‌తో మెరిశాడు -
మరో 'రింకూ సింగ్'.. తమిళనాడు ప్రీమియర్ లీగ్‌లో సంచలనం
ఐపీఎల్ 16వ సీజన్లో కోల్‌కతా నైట్‌రైడర్స్ వికెట్ కీపర్ రింకూ సింగ్ విధ్వంసాన్ని అంత త్వరగా ఎవరు మరిచిపోలేరు. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన లీగ్ మ్యాచ్‌లో ఆఖరి ఓవర్లో ఐదు బంతుల్లో ఐదు సిక్సర్లు బాది తన జట్టుకు విజయాన్ని అందించాడు. ఈ ఇన్నింగ్స్ తర్వాత రింకూ సింగ్ పేరు మార్మోగిపోయింది. ఇటీవలే వెస్టిండీస్‌తో టి20 సిరీస్‌కు రింకూ సింగ్‌ను ఎంపిక చేయకపోవడంపై కూడా తీవ్రంగా విమర్శలు వచ్చాయి. అది సరే ఇప్పుడు రింకూ సింగ్ ప్రస్తావన ఎందుకనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నాం. అచ్చం రింకూ సింగ్ ఇన్నింగ్స్‌ను తలపించే మ్యాచ్ తమిళనాడు ప్రీమియర్ లీగ్‌లో చోటుచేసుకుంది. 12 బంతుల్లో 37 పరుగులు కావాల్సిన దశలో ఒకే ఓవర్లో ఐదు సిక్సర్లు బాది మ్యాచ్ ఫలితాన్నే మార్చేశారు. కాకపోతే అక్కడ ఒక్క రింకూ సింగ్ ఉంటే ఇక్కడ మాత్రం ఇద్దరు రింకూ సింగ్‌లు కనిపించారు. విషయంలోకి వెళితే.. టీఎన్‌పీఎల్(TNPL 2023)లో సోమవారం నెల్లయ్ రాయల్ కింగ్స్, దిండిగుల్ డ్రాగన్స్ మధ్య మ్యాచ్ జరిగింది. నెల్లయ్ కింగ్స్ బ్యాటర్స్ రితిక్ ఈశ్వరన్, అజితేష్ గురుస్వామి సంచలన బ్యాటింగ్‌తో అదరగొట్టారు.186 పరుగుల టార్గెట్‌తో బరిలో దిగిన రాయల్ కింగ్స్ అజితేష్, రితిక్ అసమాన పోరాటంతో చివరి బాల్‌కు విజయాన్ని అందుకున్నది. రాయల్ కింగ్స్ గెలుపుకు 12 బాల్స్‌లో 37 రన్స్ అవసరమైన తరుణంలో గేర్ మార్చిన రితిక్ ఈశ్వరన్ 19వ ఓవర్లో నాలుగు సిక్సర్లు కొట్టాడు. అజిత్ గురుస్వామి ఓ సిక్స్ దంచాడు. ఓ నోబాల్, సింగిల్ రన్‌తో మొత్తంగా ఆ ఓవర్లో 33 రన్స్ వచ్చాయి.ఆ తర్వాత మరో సిక్స్‌తో రాయల్ కింగ్స్‌కు మరిచిపోలేని విజయాన్ని అందించాడు రితిక్ ఈశ్వరన్. అజితేష్ గురుస్వామి 44 బాల్స్‌లోనే ఐదు సిక్సర్లు, ఐదు ఫోర్లతో 73 రన్స్, రితిక్ ఈశ్వరన్ 11 బాల్స్‌లో ఆరు సిక్సర్లతో 39 రన్స్ తో నాటౌట్‌గా మిగిలారు. మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన దిండిగల్ డ్రాగన్స్ ఇరవై ఓవర్లలో ఐదు వికెట్లు నష్టపోయి 185 రన్స్ చేసింది. దిండిగల్ డ్రాగన్స్ ఓపెనర్ శివమ్ సింగ్ 46 బాల్స్‌లో ఆరు సిక్సర్లు, నాలుగు ఫోర్లతో 76 రన్స్ చేశాడు. భూపతి కుమార్ 41 రన్స్‌తో రాణించాడు. 33-RUN OVER WITH 5 SIXES! 🤯 Insane hitting by Easwaran 🔥 and Ajitesh 💥#TNPLonFanCode pic.twitter.com/GSc41DpGk7 — FanCode (@FanCode) July 10, 2023 చదవండి: #NovakDjokovic: కసితో ఆడుతున్నాడు.. నెట్‌ను కూడా వదలడం లేదు! -
భీకర ఫామ్‌లో సాయి సుదర్శన్.. విండీస్ టూర్‌కు ఎంపిక..?
ఐపీఎల్ 2023లో మొదలైన సాయి సుదర్శన్ (గుజరాత్ టైటాన్స్) పరుగుల ప్రవాహం, ప్రస్తుతం జరుగుతున్న తమిళనాడు ప్రీమియర్ లీగ్‌లో కూడా కొనసాగుతోంది. గడిచిన 10 ఇన్నింగ్స్‌ల్లో 53, 19, 20, 47, 43, 96 (ఐపీఎల్ ఫైనల్), 86, 90, 64 నాటౌట్, 7 పరుగులు చేసిన సాయి.. ఇవాళ (జూన్ 25) దిండిగుల్ డ్రాగన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సైతం తన భీకర ఫామ్‌ను కొనసాగిస్తూ 41 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 83 పరుగులు చేశాడు. తద్వారా ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన అతని జట్టు లైకా కోవై కింగ్స్ భారీ స్కోర్ చేసింది. ఈ మ్యాచ్‌లో సాయి సుడిగాలి ఇన్నింగ్స్ చూశాక కొందరు నెటిజన్లు ఆసక్తికర పోస్ట్‌లు చేస్తున్నారు. త్వరలో జరుగనున్న విండీస్ సిరీస్‌లో భారత టీ20 జట్టుకు సాయిని ఎంపిక చేయాలని డిమాండ్ చేస్తున్నారు. భారత టీ20 జట్టుకు ఎంపిక కావడానికి ఓ ఆటగాడు ఇంతకంటే ఏం నిరూపించుకోవాలని తమిళ తంబిలు ప్రశ్నిస్తున్నారు. టీ20 జట్టులో చోటు కోసం తీవ్రమైన పోటీ ఉన్నప్పటికీ సాయి ఆల్‌రౌండర్ అన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని, ఇతని ప్లేయింగ్ స్టయిల్, కంసిస్టెన్సీ, భారీ షాట్లు ఆడగల సామర్థ్యాన్ని పరిగణలోకి తీసుకొని టీమిండియాకు ఎంపిక చేయాలని కోరుతున్నారు. యశస్వి, రుతురాజ్ లాంటి వారికి అవకాశం ఇచ్చారు, వారికంటే సాయి ఏమాత్రం తీసిపోడని కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే, సాయి సుదర్శన్‌కు టీ20లతో పాటు లిస్ట్-ఏ, ఫస్ట్ క్లాస్ క్రికెట్లోనూ మెరుగైన రికార్డు ఉంది. 21 ఏళ్ల సాయి సుదర్శన ఇప్పటివరకు 26 టీ20ల్లో 129.75 స్ట్రయిక్ రేట్లో 859 పరుగులు (5 హాఫ్ సెంచరీలు).. 11 లిస్ట్-ఏ మ్యాచ్‌ల్లో 60.36 సగటున 664 పరుగులు (3 సెంచరీలు, 2 హాఫ్ సెంచరీలు).. 7 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లో 47.66 సగటున 572 పరుగులు (2 సెంచరీలు, ఓ హాఫ్ సెంచరీ) చేశాడు. -
సాయి సుదర్శన్ తుపాన్ ఇన్నింగ్స్..5 మ్యాచ్‌ల్లో నాలుగు హాఫ్ సెంచరీలు
ఐపీఎల్-2023లో దుమ్మురేపిన గుజరాత్ టైటాన్స్ యువ ఆటగాడు సాయి సుదర్శన్.. తమిళనాడు ప్రీమియర్ లీగ్‌లో అదే దూకుడును కనబరుస్తున్నాడు. ఈ లీగ్‌లో లైకా కోవై కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న సాయిసుదర్శన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. తాజాగా దిండిగల్ డ్రాగన్స్‌తో మ్యాచ్‌లో సుదర్శన్ మరో అద్భుత హాఫ్ సెంచరీతో చెలరేగాడు. ఇది ఈ లీగ్‌లో సాయికి నాలుగో హాఫ్ సెంచరీ కావడం గమనార్హం. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో 41 బంతులు ఎదుర్కొన్న సుదర్శన్ 8 ఫోర్లు, 4 సిక్స్‌లతో 83 పరుగులు చేశాడు. అతడు అద్భుత ఇన్నింగ్స్ ఫలితంగా లైకా కోవై కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. ఓవరాల్‌గా ఈ టోర్నీలో ఇప్పటి వరకు 5 మ్యాచ్‌లు ఆడిన సుదర్శన్ 110 సగటుతో 323 పరుగులు చేశాడు. అదే విధంగా ఈ ఏడాది ఐపీఎల్లో కూడా సాయి సుదర్శన్ కీలక ఇన్నింగ్స్‌లు ఆడాడు. ఫైనల్లో 47 బంతుల్లో 96 పరుగులు చేసి, గుజరాత్ టైటాన్స్‌కి భారీ స్కోరు అందించాడు. ఈ ఏడాది సీజన్లో కేవలం 8 మ్యాచ్‌లు మాత్రమే ఆడిన సాయి 50 పైగా సగటుతో 362 పరుగులు సాధించాడు. ఇక సూపర్ ఫామ్‌లో ఉన్న సాయి సుదర్శన్ త్వరలో వెస్టిండీస్‌తో జరగనున్న టీ20 సిరీస్‌తో అంతర్జాతీయ అరంగేట్రం చేసే ఛాన్స్ ఉంది. చదవండి: World Cup 2023: వన్డే ప్రపంచకప్‌కు సంబంధించి ఐసీసీ కీలక అప్డేట్ -
'గిల్ క్యాచ్' పునరావృతం.. ఈసారి అన్యాయమే గెలిచింది!
ఇటీవలే ముగిసిన డబ్ల్యూటీసీ చాంపియన్‌షిప్‌లో టీమిండియా ఓపెనర్ శుబ్‌మన్ గిల్ క్యాచ్ ఎంత వివాదాస్పదమయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కామెరాన్ గ్రీన్ అందుకున్న బంతి నేలకు తాకినట్లు క్లియర్‌గా తెలుస్తున్నప్పటికి థర్డ్ అంపైర్ ఔట్ ఇవ్వడం విమర్శలకు దారి తీసింది. మ్యాచ్‌లో టీమిండియా ఓటమి పాలయినప్పటికి గిల్ క్యాచ్ విషయంలో మాత్రం భారత్‌కు అన్యాయం జరిగిందనే చెప్పొచ్చు. తాజాగా మరోసారి గిల్ క్యాచ్ సీన్ తమిళనాడు ప్రీమియర్ లీగ్‌లో రీక్రియేట్ అయింది. యాదృశ్చికంగా జరిగినప్పటికి అచ్చం గిల్ క్యాచ్ వివాదమే ఇక్కడా చోటుచేసుకుంది. అయితే ఈసారి కూడా థర్డ్ అంపైర్ ఔట్ అని ప్రకటించడంతో మరోసారి అన్యాయమే గెలిచింది. టీఎన్‌పీఎల్ 2023లో భాగంగా బుధవారం నెల్లయ్ రాయల్ కింగ్స్, ఐడ్రీమ్ తిరుప్పూర్ మధ్య మ్యాచ్ జరిగింది. రాయల్ కింగ్స్ బ్యాటింగ్ సమయంలో నాలుగో ఓవర్ భువనేశ్వరన్ వేశాడు. ఆ ఓవర్ తొలి బంతిని ఎల్. సూర్యప్రకాశ్ ఆఫ్‌సైడ్ దిశగా ఆడే ప్రయత్నం చేశాడు. అయితే బంతి ఔట్‌సైడ్ ఎడ్జ్ అయి స్లిప్‌లో ఉన్న ఎస్. రాధాకృష్ణన్ చేతిలోకి వెళ్లింది. అయితే క్యాచ్ అందుకునే క్రమంలో రాధాకృష్ణన్ బంతిని నేలకు తాకించాడు. కానీ ఫీల్డ్ అంపైర్ అనుమానంతో థర్డ్ అంపైర్‌కు పంపించాడు. క్యాచ్‌ను పరిశీలించిన థర్డ్ అంపైర్ ఔట్ అని ప్రకటించాడు. ఈ నిర్ణయంతో సూర్యప్రకాశ్ షాక్ తిన్నాడు. ఎందుకంటే రిప్లేలో బంతి నేలను తాకుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తున్నప్పటికి ఔట్ ఎలా ఇస్తారంటూ బాధపడిన సూర్య చేసేదేం లేక నిరాశగా పెవిలియన్ చేరాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. The third umpire thought this catch was clean. Does it bring back some recent memories? 🤔 #TNPLonFanCode pic.twitter.com/apAKHVn34v — FanCode (@FanCode) June 20, 2023 View this post on Instagram A post shared by ICC (@icc) ఇక మ్యాచ్ విషయానికి వస్తే ఐడ్రీమ్ తిరుప్పూర్ ఏడు వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన నెల్లయ్ రాయల్ కింగ్స్ 18.2 ఓవర్లలో 124 పరుగులకు ఆలౌట్ అయింది. సోను యాదవ్ 35 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. భువనేశ్వరన్ ఐదు వికెట్లతో చెలరేగాడు. అనంతరం బ్యాటింగ్ చేసిన ఐడ్రీమ్ తిరుప్పూర్ 18.2 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను చేధించింది. తుషార్ రహేజా 49, ఎస్ రాధాకృష్ణన్ 34, రాజేంద్రన్ వివేక్ 21 పరుగులు చేసి విజయంలో కీలకపాత్ర పోషించారు. చదవండి: కనీస ధర 350 కోట్లేనా!.. బీసీసీఐ ఎందుకిలా? #NotOut: థర్డ్ అంపైర్ చీటింగ్.. గిల్ ఔట్ కాదు -
లీగ్‌లో తొలి శతకం నమోదు..సెంచరీ చేజార్చుకున్న సాయి సుదర్శన్
ఐపీఎల్ ముగిసిన కొద్ది రోజులకే ప్రారంభమైన తమిళనాడు ప్రీమియర్ లీగ్(TNPL2023) అభిమానులను అలరిస్తోంది. లో స్కోరింగ్ మ్యాచ్‌లు నమోదైనప్పటికి విజయం కోసం ఆఖరి బంతి వరకు ఎదురుచూడాల్సి వస్తోంది. తాజాగా శుక్రవారం లైకా కోవై కింగ్స్, నెల్లయ్ రాయల్ కింగ్స్ మధ్య మ్యాచ్ భారీ స్కోర్లు నమోదయ్యాయి. నెల్లయ్ రాయల్ కింగ్స్ బ్యాటర్ అజితేశ్ గురుస్వామి ఈ సీజన్లో తొలి సెంచరీ నమోదు చేశాడు. 60 బంతుల్లోనే ఏడు ఫోర్లు, 8 సిక్సర్లతో 112 పరుగులు చేశాడు. మరోవైపు గుజరాత్ టైటాన్స్ సంచలనం.. లైకా కోవై కింగ్స్ బ్యాటర్ సాయి సుదర్శన్ 52 బంతుల్లో 90 పరుగులు మెరుపు ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. అయితే 10 పరుగుల తేడాతో మరోసారి సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే నెల్లయ్ రాయల్ కింగ్స్ నాలుగు వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన లైకా కోవై కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. సాయి సుదర్శన్ 90, సురేశ్ కుమార్ 33 పరుగులతో రాణించారు. అనంతరం బ్యాటింగ్ చేసిన నెల్లయ్ రాయల్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను అందుకుంది. అజితేశ్ గురుస్వామి (112 పరుగులు) ఒక్కడే జట్టును గెలిపించడం విశేషం. G Ajitesh cracks 1st hundred of #TNPL2023 👏 P.S. Full innings will be up soon on our Youtube channel.#TNPLonFanCode pic.twitter.com/PAB1BjewTc — FanCode (@FanCode) June 16, 2023 చదవండి: బజ్‌బాల్ దూకుడు; రూట్ సెంచరీ.. తొలి రోజే ఇన్నింగ్స్ డిక్లేర్ -
ఒకే బంతికి రెండు రివ్యూలు ధోనిని మించిపోయిన అశ్విన్..!
-
#TNPL2023: రోజుకో విచిత్రం.. ఒకే బంతికి రెండుసార్లు డీఆర్ఎస్
తమిళనాడు ప్రీమియర్ లీగ్ 2023లో రోజుకో విచిత్రం చోటుచేసుకుంటుంది. ఒకే బంతికి 18 పరుగులు రావడం మరిచిపోకముందే మరో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ఒకే బంతికి రెండుసార్లు డీఆర్ఎస్ తీసుకోవడం ఆశ్చర్యపరిచింది. ఒకసారి బ్యాటర్ రివ్యూ తీసుకుంటే.. మరోసారి అదే నిర్ణయంపై బౌలర్ రివ్యూ తీసుకున్నాడు. లీగ్‌లో భాగంగా బుధవారం దిండిగుల్ డ్రాగన్స్, బా11 ట్రిచ్చి మధ్య మ్యచ్ జరిగింది. ట్రిచ్చి ఇన్నింగ్స్ 13వ ఓవర్‌ను కెప్టెన్ రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్ చేశాడు. ఓవర్ చివరి బంతిని క్యారమ్ బాల్ వేయగా.. క్రీజులో ఉన్న రాజ్‌కుమార్ షాట్‌కు యత్నించగా బంతి మిస్ అయి కీపర్ చేతుల్లో పడింది. బంతి బ్యాట్‌కు తగిలినట్లు సౌండ్ రావడంతో కీపర్ అప్పీల్ చేయగానే అంపైర్ ఔట్ ఇచ్చాడు. దీంతో రాజ్‌కుమార్ రివ్యూ కోరాడు. రిప్లేలో స్పైక్ వస్తున్నప్పటికి బంతికి, బ్యాట్‌కు గ్యాప్ క్లియర్‌గా ఉండడంతో టీవీ అంపైర్ ఎస్. నిశాంత్ నాటౌట్ అని ప్రకటించాడు. ఫీల్డ్ అంపైర్ నిర్ణయం ప్రకటించగానే అశ్విన్ వెంటనే మళ్లీ డీఆర్ఎస్ కోరాడు. అయితే అశ్విన్ ఎందుకు రివ్యూ కోరాడో ఎవరికి అర్థం కాలేదు. బంతి బ్యాట్‌కు తగిలిందేమోనన్న అనుమానంతోనే అశ్విన్ రివ్యూ కోరినట్లు తెలుస్తోంది. ఇదే విషయమై ఇద్దరు ఫీల్డ్ అంపైర్లతో అశ్విన్ చర్చించాడు. కాగా టీవీ అంపైర్ నిశాంత్ మరోసారి స్పష్టంగా పరిశీలించారు. అల్ట్రాఎడ్జ్‌లో స్పైక్ కనిపిస్తున్నప్పటికి.. బంతికి, బ్యాట్‌కు గ్యాప్ క్లియర్‌గా ఉంది. దీంతో బ్యాట్ గ్రౌండ్‌కు తాకడంతోనే స్పైక్ వచ్చిందని.. ఇది నాటౌట్ అంటూ బిగ్స్క్రీన్పై చెప్పాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన బా11 ట్రిచ్చి 19.1 ఓవర్లలో 120 పరుగులకు ఆలౌట్ అయింది. ఓపెనర్ గంగా శ్రీధర్ రాజు 48 పరుగులతో టాప్ స్కోరర్ కాగా.. చివర్లో రాజ్‌కుమార్ 39 పరుగులతో రాణించాడు. దిండిగుల్ డ్రాగన్స్ బౌలర్లలో వరుణ్ చక్రవర్తి మూడు వికెట్లు తీయగా.. అశ్విన్, శరవణ కుమార్, సుబోత్ బాటిలు తలా రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం బ్యాటింగ్ చేసిన దిండిగుల్ 14.5 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 122 పరుగులు చేసి ఆరు వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. ఓపెనర్ శివమ్ సింగ్ 46, బాబా ఇంద్రజిత్ 22, ఆదిత్య గణేశ్ 20, సుబోత్ బాటి 19 పరుగులు చేశారు. Uno Reverse card in real life! Ashwin reviews a review 🤐 . .#TNPLonFanCode pic.twitter.com/CkC8FOxKd9 — FanCode (@FanCode) June 14, 2023 చదవండి: రెండేళ్లలో ఆరు టెస్టు సిరీస్‌లు; మూడు స్వదేశం.. మూడు విదేశం -
ఒక్క బంతికి 18 పరుగులా.. నువ్వు దేవుడివయ్యా!
ఒక ఓవర్లో 18 పరుగుల సమర్పించుకుంటే అది పెద్ద వార్త కాకపోవచ్చు.. కానీ ఒక్క బంతికి 18 పరుగులు ఇచ్చుకుంటే మాత్రం అది సంచలనమే అవుతుంది. సలేమ్ స్పార్టాన్స్ కెప్టెన్ అభిషేక్ తన్వర్ ఈ పుణ్యం మూటగట్టుకొని అత్యంత చెత్త రికార్డు నమోదు చేశాడు. తమిళనాడు ప్రీమియర్ లీగ్ 2023లో ఇది చోటుచేసుకుంది. విషయంలోకి వెళితే.. మంగళవారం రాత్రి సలేమ్ స్పార్టాన్స్, చెపాక్ సూపర్ గల్లీస్ మధ్య మ్యాచ్ జరిగింది. చెపాక్ సూపర్ గల్లీస్ ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్ కెప్టెన్ అభిషేక్ తన్వర్ బౌలింగ్ చేశాడు. క్రీజులో సంజయ్ యాదవ్ ఉన్నాడు. ఓవర్లో మొదటి నాలుగు బంతులు కరెక్ట్‌గా వేసిన అభిషేక్ తన్వర్ ఆరు పరుగులు ఇచ్చుకున్నాడు. తర్వాతి బంతి నోబాల్.. ఆ తర్వాత బంతికి ఒక పరుగు వచ్చింది. దీంతో ఐదు బంతుల్లో ఎనిమిది పరుగులు వచ్చినట్లయింది. ఇక ఓవర్ చివరి బంతి వేయడానికి నానా కష్టాలు పడ్డాడు. తొలుత నోబాల్, ఆ తర్వాత నోబాల్ వేస్తే ఈసారి సిక్సర్, తర్వాతి బంతి మళ్లీ నోబాల్.. రెండు పరుగులు.. అనంతరం వైడ్ బాల్.. ఇక చివరగా వేసిన సరైన బంతికి మరో సిక్సర్.. ఇలా కేవలం ఆఖరి బంతికి మూడు నోబాల్స్, ఒక వైడ్ సహా రెండు సిక్సర్లు, రెండు పరుగులు మొత్తంగా 18 పరుగులు వచ్చాయి. ఈ దెబ్బతో సంజయ్ యాదవ్ కేవలం ఆఖరి ఓవర్లోనే తాను ఎదుర్కొన్న ఆరు బంతుల్లో 18 పరుగులు పిండుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. One ball 18 runs 🤑#TNPL2023 pic.twitter.com/GcN9E8XyoP — Cricket Insider (@theDcricket) June 13, 2023 ఇక మ్యాచ్ విషయానికి వస్తే చెపాక్ సూపర్ గల్లీస్ 52 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన చెపాక్ సూపర్ గల్లీస్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 217 పరుగులు చేసింది. ప్రదోష్ పాల్(55 బంతుల్లో 88 పరుగులు, 12 ఫోర్లు, ఒక సిక్సర్), నటరాజన్ జగదీశన్ 27 బంతుల్లో 35, అపరాజిత్ 19 బంతుల్లో 29 పరుగులు, సంజయ్ యాదవ్ 12 బంతుల్లో 31 పరుగుల నాటౌట్ రాణించారు. అనంతరం బ్యాటింగ్ చేసిన సలెమ్ స్పార్టాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 165 పరుగులే చేయగలిగింది. ముహ్మద్ అద్నాన్ ఖాన్ (15 బంతుల్లో 47 నాటౌట్, ఒక ఫోర్, ఆరు సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్ మినహా మిగతావారు విఫలమయ్యారు. చదవండి: విండీస్‌తో టెస్టు సిరీస్.. కెప్టెన్‌గా ఆఖరిది కానుందా? -
అదే దూకుడు.. సాయిసుదర్శన్ విధ్వంసం! 8ఫోర్లు, 4 సిక్స్‌లతో
తమిళనాడు ప్రీమియర్ లీగ్-2023 సీజన్‌ను కోవై కింగ్స్ ఘనంగా ప్రారంభించింది. శ్రీరామకృష్ణ కళాశాల మైదానం వేదికగా ఐడ్రీమ్ తిరుప్పూర్ తమిజన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 70 పరుగుల తేడాతో కోవై కింగ్స్ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన కోవై కింగ్స్.. 14 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ క్రమంలో సాయిసుదర్శన్ మరో బ్యాటర్ ముకిలేష్తో కలిసి కింగ్స్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 82 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ముకిలేష్ ఔటైనప్పటికీ సాయిసుదర్శన్ మాత్రం స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. బౌండరీలు, సిక్సర్లతో ప్రత్యర్ధి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 45 బంతులు ఎదుర్కొన్న సుదర్శన్.. 8 ఫోర్లు, 4 సిక్స్‌లతో 86 పరుగులు చేశాడు. ఇక సుదర్శన్ సంచలన ఇన్నింగ్స్ ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. అనంతరం 180 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన తిరుప్పూర్ తమిజన్స్ 109 పరుగులకే కుప్పకూలింది. కోవై కింగ్స్ బౌలర్లలో కెప్టెన్ షారుఖ్ ఖాన్ మూడు వికెట్లు పడగొట్టగా.. మహ్మద్ రెండు, ముకిలేష్, జాతవేద్ సుబ్రమణ్యన్ తలా వికెట్ సాధించారు. ఇక ఈ ఏడాది ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్ తరపున ఆడిన సాయిసుదర్శన్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన సంగతి తెలిసిందే. సీఎస్కేతో జరిగిన ఫైనల్లో 96 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. చదవండి: LPL 2023: లంక ప్రీమియర్ లీగ్ ఆడనున్న సురేష్ రైనా.. ధర ఎంతంటే? Fifty for Sai!🤩#TNPL2023🏏#TNPLonstarsports#TNPLonfancode#NammaAatamAarambam💥#NammaOoruNammaGethu💪🏼 pic.twitter.com/Zrh1IrHk1f — TNPL (@TNPremierLeague) June 12, 2023 -
సంచలన బౌలింగ్‌తో మెరిసిన గుజరాత్ టైటాన్స్ బౌలర్
ఐపీఎల్ 2022 విజేత గుజరాత్ టైటాన్స్ బౌలర్ ఆర్. సాయి కిషోర్ తమిళనాడు ప్రీమియర్ లీగ్(TNPL)లో సంచలనం సృష్టించాడు. ప్రతీ బౌలర్ కలగనే స్పెల్‌ను సాయి కిషోర్ సాధించాడు. లీగ్‌లో భాగంగా ఐ డ్రీమ్ తిర్నూర్ తమిళన్స్, చేపాక్ సూపర్ గల్లీస్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో సాయి కిషోర్ (4-3-2-4) వరల్డ్ క్లాస్ బౌలింగ్ నమదోఉ చేశాడు. నాలుగో ఓవర్లు వేస్తే అందులో మూడు మెయిడెన్లు అంటేనే సాయి కిషోర్ ఎలా బౌలింగ్ చేశాడనేది తెలుస్తోంది. మరి ఇలాంటి అద్బుత ప్రదర్శన చేస్తే తన జట్టు గెలవకుండా ఉంటుందా. ఐడ్రీమ్ తిర్పూర్పై చేపాక్ సూపర్ గల్లీస్ ఏకంగా 60 పరుగులతో ఘన విజయం సాధించింది. సాయి కిషోర్ ప్రదర్శనను మెచ్చుకుంటూ అభిమానులు కామెంట్స్ చేశారు. వరల్డ్ క్లాస్ బౌలింగ్ నమోదు చేశాడు.. ఇలాంటి క్రికెటర్ జట్టులో కచ్చితంగా ఉండాలి.. వారెవ్వా సాయికిషోర్.. ప్రతీ బౌలర్ కలలు గనే స్పెల్ వేశావు.. నీ బౌలింగ్‌కు ఫిదా అంటూ పేర్కొన్నారు. ఇక మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన చెపాక్ సూపర్ గిల్లీస్ జట్టు 20 ఓవర్లు ముగిసేసరికి 9 వికెట్ల నష్టానికి 133 పరుగులు చేసింది. ఆ జట్టులో ససిదేవ్ అత్యధికంగా 45 పరుగులు చేశాడు. అనంతరం 133 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన తిర్పూర్ తమిళన్స్ 73 పరుగులకే కుప్పకూలింది. ఆ జట్టులో కెప్టెన్ శ్రీకాంత్ అనిరుధ 25 పరుగులతో టాప్ స్కోరర్ కాగా.. సాయి కిషోర్ 4 వికెట్లు, సందీప్ వారియర్ 3 వికెట్లు, ఆర్ అలెగ్జాండర్ 2 వికెట్లు, సోను యాదవ్ 1 వికెట్ తీశారు. Sai Kishore on 🔥 #TNPL2022 pic.twitter.com/nDIi05Fmvn — Santhosh Kumar (@giffy6ty) July 22, 2022 చదవండి: క్రికెట్లో అలజడి.. స్కాట్లాండ్ బోర్డు మూకుమ్మడి రాజీనామా -
TNPL 2022: క్రికెటర్ అసభ్యకర సంజ్ఞ.. ఛీ.. నీకసలు బుద్ధుందా? ఇంత దిగజారుతావా?
Tamilnadu Premier League-2022: తమిళనాడు ప్రీమియర్ లీగ్-2022 గురువారం(జూన్ 23) తిరునల్వేలి వేదికగా ఆరంభమైంది. ఇందులో భాగంగా చెపాక్ సూపర్ గిల్లీస్, నెలాయి రాయల్ కింగ్స్ మధ్య మొదటి మ్యాచ్ జరిగింది. ఇండియన్ సిమెంట్ కంపెనీ గ్రౌండ్లో జరిగిన ఈ టీ20 మ్యాచ్‌లో టాస్ గెలిచిన చెపాక్ జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకుంది. తీవ్ర ఉత్కంఠ.. టై ఈ క్రమంలో రాయల్ కింగ్స్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. ఇక లక్ష్య ఛేదనకు దిగిన చెపాక్ జట్టు కూడా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు నష్టపోయి 184 పరుగులే చేయడంతో మ్యాచ్ టై అయింది. దీంతో సూపర్ ఓవర్ నిర్వహించగా రాయల్ కింగ్స్ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో రాయల్స్ జట్టు బ్యాటర్ సంజయ్ యాదవ్ 47 బంతుల్లో 87 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. తద్వారా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు. అయితే, ఈ మ్యాచ్ సందర్భంగా చెపాక్ సూపర్ గిల్లీస్ ఓపెనర్ ఎన్. జగదీశన్ వ్యవహరించిన తీరు వివాదాస్పదమైంది. అతడిపై క్రికెట్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. రూల్స్ నచ్చకపోతే క్రికెట్ ఆడటం మానేసెయ్.. అంతేగానీ మరీ ఇంత దిగజారి ప్రవర్తించకు అంటూ ట్రోల్ చేస్తున్నారు. బుద్ధి ఉందా అసలు? కాగా ప్రత్యర్థి జట్టు ఆటగాడి పట్ల ఈ వికెట్ కీపర్ బ్యాటర్ వ్యవహరించిన తీరే ఇందుకు కారణం. చెపాక్ ఇన్నింగ్స్ సమయంలో 3.4వ ఓవర్లో బాబా అపరాజిత్ బౌలింగ్‌కు రాగా.. కౌశిక్ గాంధీ క్రీజులో ఉన్నాడు. అయితే, అపరాజిత్ బంతి వేయకముందే నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న జగదీశన్ క్రీజును వీడాడు. దీంతో అపరాజిత్ జగదీశన్ మన్కడింగ్ చేయడంతో రనౌట్‌గా అతడు వెనుదిరిగాడు. ఈ క్రమంలో తీవ్ర నిరాశకు లోనైన జగదీశన్ అసభ్యకర సంజ్ఞ చేస్తూ మైదానాన్ని వీడాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో మొదటి మ్యాచ్‌లోనే ఇలా వివాదానికి కారణమయ్యాడని, ఆటగాళ్ల పట్ల నువ్వు ఇలాగేనా ప్రవర్తించేది.. ముందు నిబంధనలు తెలుసుకుని ఆడు అంటూ నెటిజన్లు జగదీశన్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నీకసలు బుద్ది ఉందా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. అది రనౌటే! క్రికెట్ చట్టాలు చేసే మెరిల్‌బోన్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) మన్కడింగ్‌ను చట్టబద్ధం చేసిన విషయం తెలిసిందే. ఇది క్రికెట్లో రనౌట్! అంతేతప్ప క్రీడాస్ఫూర్తికి విరుద్ధమయ్యే మన్కడింగ్ కాదు. ఈ మేరకు ఎంసీసీ చేసిన పలు సవరణలను ఇటీవల అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) అమోదించింది. అయితే ఇవన్నీ ఈ ఏడాది అక్టోబర్ తర్వాతే అమల్లోకి రానున్నాయి. చదవండి: Manoj Tiwari: సెంచరీ చేశా.. అయినా 14 మ్యాచ్‌లకు పక్కనపెట్టారు.. ఇప్పుడున్న మేనేజ్మెంట్ గనుక ఉండి ఉంటే! TNPL 2022: 38 ఏళ్ల వయసులో క్రికెట్లోకి రీఎంట్రీ ఇస్తున్న భారత ఆటగాడు..! A royal comeback from the @NRKTNPL ! Watch Shriram Capital TNPL on @StarSportsTamil & @StarSportsIndia Also, streaming live for free, only on @justvoot ! Download the app now! #NammaOoruNammaGethu#TNPL2022#VootonTNPL#TNPLonVoot#TNPLonStarSportsTamil#CSGvsNRK pic.twitter.com/onCAfd4z58 — TNPL (@TNPremierLeague) June 23, 2022 🤐🤐🤐🤐 @Jagadeesan_200 @aparajithbaba senior players of tn🤐🤐🤐 pic.twitter.com/C9orMqRPL3 — Jayaselvaa ᅠ (@jayaselvaa1) June 23, 2022 -
సురేశ్ రైనా వివాదాస్పద వ్యాఖ్యలు; ఉతికారేస్తున్న నెటిజన్లు
చెన్నై: టీమిండియా మాజీ క్రికెటర్ సురేశ్ రైనా తన వ్యాఖ్యలతో వివాదంలో చిక్కుకున్నాడు. ప్రస్తుతం తమిళనాడు ప్రీమియర్ లీగ్ (టీఎన్‌పీఎల్)కు రైనా కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం మ్యాచ్ సందర్భంగా కామెంట్రీ ఇస్తూ అక్కడి సంస్కృతిపై మాట్లాడుతూ నోరు జారాడు. ఐపీఎల్ ప్రారంభం నుంచి సీఎస్కేతోనే ఉన్న రైనాను తన సహచర కామెంటేటర్ చెన్నై సంస్కృతి గురించి అడిగాడు. దీనిపై రైనా స్పందింస్తూ.. '' నేను కూడా బ్రాహ్మిణ్‌ను అనుకుంటున్నా. 2004 నుంచి చెన్నై జట్టుకు ఆడుతున్నా. అనిరుద్ధ శ్రీకాంత్, బద్రినాథ్, బాలాజీలతో కలిసి ఆడాను. ఇక్కడి సంస్కృతి అంటే నాకు చాలా ఇష్టం. ఇక నా జట్టు సహచరులు అంటే చెప్పలేనంత అభిమానం. సీఎస్కే జట్టులో మంచి అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది.. అది ఎంతలా అంటే మాకు చాలా స్వేచ్చ దొరుకుతుంది. సీఎస్కే జట్టులో భాగం కావడం సంతోషంగా ఉంది '' అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం రైనా చేసిన కామెంట్స్ దుమారాన్ని లేపాయి. చెన్నై అంటే కేవలం బ్రాహ్మిణ్లే ఉంటారా అంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. '' రైనా ఇలాంటి కామెంట్స్ చేసినందుకు సిగ్గుపడాలి. ఇన్నేళ్లుగా చెన్నైకి ఆడుతున్నావు.. నువ్వు నిజమైన చెన్నై సంస్కృతిని చూసినట్లు లేవు'' అంటూ మండిపడుతున్నారు. ప్రస్తుతం రైనా వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారాయి. ఇక గతేడాది యూఏఈ వేదికగా జరిగిన ఐపీఎల్ సీజన్‌కు దూరంగా ఉన్న రైనా ఈ సీజన్‌కు మాత్రం సీఎస్కే తరపున ఆడాడు. ఈ సీజన్లో సీఎస్కే తరపున 7 మ్యాచ్‌లాడి 123 పరుగులు చేశాడు. గతేడాది ఫేలవ ప్రదర్శన కనబరిచిన సీఎస్కే ఈసారి మాత్రం దుమ్మురేపింది. ఆడిన 7 మ్యాచ్‌ల్లో 5 విజయాలు.. రెండు ఓటములతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది. ఇక సురేశ్ రైనా 2020 ఆగస్టు 15న అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. What the heck @ImRaina sir.. you shouldn’t use that word ….. https://t.co/v8AD1Cp0fT pic.twitter.com/TltPoMbYec — udayyyyyy 👨🏻💻👨🏻💼👨🏻🍳🏋️ (@uday0035) July 19, 2021 So watched the video, I once liked Raina very much and now im sad how ignorant or he has been hiding all these days. Lost it! No more respect — vijay renganathan (@MarineRenga) July 20, 2021 -
ట్రాక్టర్ నడిపిన ధోని..!!
చెన్నై: భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ తమిళనాడులోని తిరునెల్వేలిలో సందడి చేశారు. తమిళనాడు ప్రీమియర్ లీగ్(టీఎన్‌పీఎల్)లో భాగంగా జరిగిన మ్యాచ్‌ను వీక్షించేందుకు వచ్చిన ధోని ట్రాక్టర్ నడిపి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ సందర్భంగా ఇక్కడ పర్యటించి అభిమానులను అలరించారు. మైదానమంతా కలియ తిరిగిన ధోని అభిమానులకు అభివాదం చేశాడు. టీఎన్‌పీఎల్‌లో భాగంగా తిరునెల్వేలిలో మధురై పాంథర్స్, కోవై కింగ్స్ మధ్య మ్యాచ్ జరిగింది. మ్యాచ్ ముందు నిర్వహించిన టాస్ సమయంలోనూ ధోనీ మైదానంలోనే ఉన్నాడు. ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ధోనీ అకస్మాత్తుగా స్డేడియంలో ప్రత్యక్షమవడంతో అభిమానులు తెగ సంబరపడిపోయారు. ఈ సందర్భంగా కెప్టెన్ కూల్ మాట్లాడుతూ వచ్చే ఐపీఎల్ సీజన్‌లోగా తమిళం మాట్లాడటం నేర్చుకుంటానని ఫ్యాన్స్‌కు చెప్పారు. ప్రతి ఏడాది టీఎన్‌పీఎల్‌లో జరిగే కొన్ని మ్యాచ్‌లను వీక్షించేందుకు తప్పకుండా వస్తానని వివరించారు. ఈ ఏడాది టోర్నీలో నేను చూసిన తొలి గేమ్ ఇదేనని వెల్లడించారు. -
ధోని హ్యాట్రిక్ సిక్సర్లు!
చెన్నై: చెన్నైలోని చెపాక్ స్టేడియంలో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని హ్యాట్రిక్ సిక్సర్లు బాదాడు. వేలాది అభిమానులు వీక్షిస్తుండగా ధోని వరుసగా మూడు బంతుల్ని బౌండరీ దాటించాడు. శనివారం తమిళనాడు ప్రీమియర్ లీగ్(టీఎన్‌పీఎల్) రెండో సీజన్ ఆరంభానికి ముందు చెన్నై సూపర్ కింగ్స్ పునరాగమన కార్యక్రమం జరిగింది. ఈ నేపథ్యంలో గతంలో చెన్నై సూపర్ కింగ్స్ ఆడిన క్రికెటర్ల మధ్య సరదాగా సిక్సర్ల హిట్టింగ్ పోటీ జరిగింది. దీనికి ఎంఎస్ ధోనితో పాటు ఆసీస్ మాజీ క్రికెటర్ మాథ్యూ హేడెన్, లక్ష్మీపతి బాలాజీ, పవన్ నేగీ తదితురులు హాజరయ్యారు. ముందుగా పలువురు క్రికెటర్లకు ధోని బంతుల్ని విసిరాడు. ఆపై బ్యాట్ ను అందుకున్న ధోని బౌలింగ్ మెషీన్ విసిరిన బంతుల్ని ఆడాడు. ఇందులో మూడు బంతుల్ని ఎదుర్కొన్న ధోని వాటిని భారీ సిక్సర్లగా మలిచి అభిమానుల్ని అలరించాడు. ఇక్కడ చెన్నై సూపర్ కింగ్స్ కు చెందిన యెల్లో జెర్సీని ధోని ధరించి కార్యక్రమంలో పాల్గొన్నాడు. -
సురేశ్ రైనాకు షాక్
ముంబయి: జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన టీమిండియా బ్యాట్స్‌మన్ సురేశ్ రైనాకు బీసీసీఐ ఝలక్ ఇచ్చింది. తమిళనాడు ప్రిమియర్ లీగ్(టీఎన్‌పీఎల్)లో అతడు ఆడకుండా మోకాలడ్డింది. రైనా, యూసుఫ్ పఠాన్, మనోజ్ తివారి, సంజూ శామ్సన్ సహా 88 మంది క్రికెటర్లు టీఎన్‌పీఎల్‌లో ఆడేందుకు ఆసక్తి కనబరిచారు. బయట రాష్ట్రాల క్రికెటర్లు కూడా టీఎన్‌పీఎల్‌లో పాల్గొనవచ్చంటూ ఇటీవల నిబంధనలు సవరించారు. దీంతో ఈ టోర్నమెంట్లో ఆడేందుకు వీరంతా ముందుకు వచ్చారు. జూలై 22 నుంచి టోర్ని ప్రారంభం కానుంది. ఆ సమయంలో తనకు అంతర్జాతీయ క్రికెట్ మ్యాచులు లేనందున మ్యాచ్ ప్రాక్టీసు కోసం తాను టీపీఎల్ ఆడాలని నిర్ణయించుకున్నట్లు రైనా వెల్లడించాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ బయట రాష్ట్రాల క్రికెటర్లను టీపీఎల్‌లో అనుమతించే ప్రసక్తి లేదని బీసీసీఐ స్పష్టం చేసింది. ఈ మేరకు టీఎన్‌పీఎల్‌కు లేఖ రాసింది. బయట రాష్ట్రాల క్రికెటర్లను అనుమతించే విషయంపై వివరణ ఇవ్వాలని టీఎన్‌పీఎల్ నిర్వాహకులను బీసీసీఐ తాత్కాలిక కార్యదర్శి అమితాబ్ చౌదరి ఆదేశించారు. తమ ఆటగాళ్లను టీఎన్‌పీఎల్‌లో ఆడనివ్వబోమని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్(ఎంసీఏ) ప్రకటించింది. టీఎన్‌పీఎల్‌లో ఆడేందుకు రాహుల్ త్రిపాఠికి నిరభ్యంతర పత్రం(ఎన్వోసీ) ఇవ్వబోమని తెలిపింది. కాగా, ఇటీవలే బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టు కోల్పోయిన రైనా ఇటువంటి చర్యలతో టీమిండియాలో మళ్లీ చోటు దక్కించుకునే అవకాశాలను క్లిష్టం చేసుకుంటున్నాడని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
‘టీఎన్‌పీఎల్’లో మురళీధరన్
చెన్నై: ఐపీఎల్ సహా ప్రపంచ వ్యాప్తంగా వేర్వేరు లీగ్‌లలో భాగంగా ఉన్న దిగ్గజ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ దిగువ స్థాయి క్లబ్ జట్టుకు మెంటార్‌గా వ్యవహరించేందుకు సిద్ధమయ్యారు. తమిళనాడు ప్రీమియర్ లీగ్ (టీఎన్‌పీఎల్)లో ఒక జట్టుకు మెంటార్‌గా వ్యవహరించడానికి అంగీకారం తెలిపారు. మాజీ భారత క్రికెటర్ వీబీ చంద్రశేఖర్‌కు చెందిన తిరువళ్లూర్ వీరన్స్ జట్టుకు మురళీ తన అనుభవాన్ని పంచనున్నారు. జులైలో జరిగే ఈ లీగ్‌లో అన్ని మ్యాచ్‌లకు ఆయన అందుబాటులో ఉంటారని జట్టు యజమాని చంద్రశేఖర్ తెలిపారు. ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు బౌలింగ్ కోచ్‌గా ఉన్న మురళీ, ఆస్ట్రేలియా జాతీయ జట్టుకు స్పిన్ కన్సల్టెంట్‌గా పనిచేశారు. -
శ్రీనివాసన్ కొత్త లీగ్
చెన్నై: బీసీసీఐ మాజీ అధ్యక్షుడు, చెన్నై సూపర్ కింగ్స్ యజమాని ఎన్. శ్రీనివాసన్ మరో సరికొత్త లీగ్ తో ముందుకు వచ్చారు. తమిళనాడు ప్రీమియర్ లీగ్(టీఎన్‌పీఎల్) పేరుతో క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభిస్తున్నట్టు ఆయన ప్రకటించారు. తమిళనాడు క్రికెటర్లు తమ ప్రతిభను నిరూపించుకునేందుకు వేదిక ఏర్పాటు చేయాలన్న ఉద్దేశంతో టీఎన్‌పీఎల్ కు రూపకల్పన చేశామని వెల్లడించారు. ఇలాంటి టోర్నీల్లో సత్తా చాటిన ఆటగాళ్లకు మంచి అవకాశాలు వస్తాయన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఆటగాళ్లను వేలం ద్వారా కొనుగోలు చేయబోమని, ముసాయిదా(డ్రాఫ్ట్) పద్ధతిలో తీసుకుంటామని తెలిపారు. ఈ ఏడాది తమ టీమ్ లేకుండా ఐపీఎల్ అయిపోయిందన్నారు. 'ఒక సీజన్ వెళ్లిపోయింది. మరో సీజన్ ఉంది. ఇది కూడా అయిపోయాక చెన్నై సూపర్ కింగ్స్ ఎటువంటి ఆటంకాలు లేకుండా మళ్లీ ఐపీఎల్ లో అడుగు పెడుతుంద'ని శ్రీనివాసన్ అన్నారు. ఐపీఎల్ లో పాల్గొనకుండా చెన్నై సూపర్ కింగ్స్ పై రెండేళ్ల నిషేధం విధించిన సంగతి తెలిసిందే.