ఐపీఎల్ 2023లో మొదలైన సాయి సుదర్శన్ (గుజరాత్ టైటాన్స్) పరుగుల ప్రవాహం, ప్రస్తుతం జరుగుతున్న తమిళనాడు ప్రీమియర్ లీగ్‌లో కూడా కొనసాగుతోంది. గడిచిన 10 ఇన్నింగ్స్‌ల్లో 53, 19, 20, 47, 43, 96 (ఐపీఎల్ ఫైనల్), 86, 90, 64 నాటౌట్, 7 పరుగులు చేసిన సాయి.. ఇవాళ (జూన్ 25) దిండిగుల్ డ్రాగన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సైతం తన భీకర ఫామ్‌ను కొనసాగిస్తూ 41 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 83 పరుగులు చేశాడు. తద్వారా ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన అతని జట్టు లైకా కోవై కింగ్స్ భారీ స్కోర్ చేసింది.
ఈ మ్యాచ్‌లో సాయి సుడిగాలి ఇన్నింగ్స్ చూశాక కొందరు నెటిజన్లు ఆసక్తికర పోస్ట్‌లు చేస్తున్నారు. త్వరలో జరుగనున్న విండీస్ సిరీస్‌లో భారత టీ20 జట్టుకు సాయిని ఎంపిక చేయాలని డిమాండ్ చేస్తున్నారు. భారత టీ20 జట్టుకు ఎంపిక కావడానికి ఓ ఆటగాడు ఇంతకంటే ఏం నిరూపించుకోవాలని తమిళ తంబిలు ప్రశ్నిస్తున్నారు. టీ20 జట్టులో చోటు కోసం తీవ్రమైన పోటీ ఉన్నప్పటికీ సాయి ఆల్‌రౌండర్ అన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని, ఇతని ప్లేయింగ్ స్టయిల్, కంసిస్టెన్సీ, భారీ షాట్లు ఆడగల సామర్థ్యాన్ని పరిగణలోకి తీసుకొని టీమిండియాకు ఎంపిక చేయాలని కోరుతున్నారు. యశస్వి, రుతురాజ్ లాంటి వారికి అవకాశం ఇచ్చారు, వారికంటే సాయి ఏమాత్రం తీసిపోడని కామెంట్స్ చేస్తున్నారు.
ఇదిలా ఉంటే, సాయి సుదర్శన్‌కు టీ20లతో పాటు లిస్ట్-ఏ, ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లోనూ మెరుగైన రికార్డు ఉంది. 21 ఏళ్ల సాయి సుదర్శన ఇప్పటివరకు 26 టీ20ల్లో 129.75 స్ట్రయిక్ రేట్‌లో 859 పరుగులు (5 హాఫ్ సెంచరీలు).. 11 లిస్ట్-ఏ మ్యాచ్‌ల్లో 60.36 సగటున 664 పరుగులు (3 సెంచరీలు, 2 హాఫ్ సెంచరీలు).. 7 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లో 47.66 సగటున 572 పరుగులు (2 సెంచరీలు, ఓ హాఫ్ సెంచరీ) చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment