TNPL Qualifier 2 2023: Guruswamy Ajitesh And Rithik Easwaran Smash 5 Sixes In One Over, Video Viral - Sakshi
Sakshi News home page

TNPL 2023 DD Vs NRK: మరో 'రింకూ సింగ్‌'.. తమిళనాడు ప్రీమియర్‌ లీగ్‌లో సంచలనం

Published Tue, Jul 11 2023 9:12 AM | Last Updated on Tue, Jul 11 2023 10:16 AM

Other-Rinku Singh-Batters Smash 5 Sixes One-Over-TNPL 2023 Qualifier-2 - Sakshi

ఐపీఎల్‌ 16వ సీజన్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ వికెట్‌ కీపర్‌ రింకూ సింగ్‌ విధ్వంసాన్ని అంత త్వరగా ఎవరు మరిచిపోలేరు. గుజరాత్‌ టైటాన్స్‌తో జరిగిన లీగ్‌ మ్యాచ్‌లో ఆఖరి ఓవర్లో ఐదు బంతుల్లో ఐదు సిక్సర్లు బాది తన జట్టుకు విజయాన్ని అందించాడు. ఈ ఇన్నింగ్స్‌ తర్వాత రింకూ సింగ్‌ పేరు మార్మోగిపోయింది. ఇటీవలే వెస్టిండీస్‌తో టి20 సిరీస్‌కు రింకూ సింగ్‌ను ఎంపిక చేయకపోవడంపై కూడా తీవ్రంగా విమర్శలు వచ్చాయి.

అది సరే ఇప్పుడు రింకూ సింగ్‌ ప్రస్తావన ఎందుకనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నాం. అచ్చం రింకూ సింగ్‌ ఇన్నింగ్స్‌ను తలపించే మ్యాచ్‌ తమిళనాడు ప్రీమియర్‌ లీగ్‌లో చోటుచేసుకుంది. 12 బంతుల్లో 37 పరుగులు కావాల్సిన దశలో ఒకే ఓవర్లో ఐదు సిక్సర్లు బాది మ్యాచ్‌ ఫలితాన్నే మార్చేశారు. కాకపోతే అక్కడ ఒక్క రింకూ సింగ్‌ ఉంటే ఇక్కడ మాత్రం ఇద్దరు రింకూ సింగ్‌లు కనిపించారు.

విషయంలోకి వెళితే.. టీఎన్‌పీఎల్‌(TNPL 2023)లో సోమవారం నెల్లయ్‌ రాయల్‌ కింగ్స్‌, దిండిగుల్‌  డ్రాగన్స్‌ మధ్య మ్యాచ్‌ జరిగింది. నెల్లయ్‌ కింగ్స్‌ బ్యాటర్స్‌ రితిక్ ఈశ్వ‌ర‌న్‌, అజితేష్ గురుస్వామి సంచ‌ల‌న బ్యాటింగ్‌తో అద‌ర‌గొట్టారు.186 ప‌రుగుల టార్గెట్‌తో బ‌రిలో దిగిన రాయ‌ల్ కింగ్స్ అజితేష్, రితిక్ అస‌మాన పోరాటంతో చివ‌రి బాల్‌కు విజ‌యాన్ని అందుకున్న‌ది. 

రాయ‌ల్ కింగ్స్ గెలుపుకు 12 బాల్స్‌లో 37 ర‌న్స్ అవ‌స‌ర‌మైన త‌రుణంలో గేర్ మార్చిన రితిక్ ఈశ్వ‌ర‌న్ 19వ ఓవ‌ర్‌లో నాలుగు సిక్స‌ర్లు కొట్టాడు. అజిత్ గురుస్వామి ఓ సిక్స్ దంచాడు. ఓ నోబాల్‌, సింగిల్ ర‌న్‌తో మొత్తంగా ఆ ఓవ‌ర్‌లో 33 ర‌న్స్ వ‌చ్చాయి.ఆ త‌ర్వాత మ‌రో సిక్స్‌తో రాయ‌ల్ కింగ్స్‌కు మ‌రిచిపోలేని విజ‌యాన్ని అందించాడు రితిక్ ఈశ్వ‌ర‌న్‌. అజితేష్ గురుస్వామి 44 బాల్స్‌లోనే ఐదు సిక్స‌ర్లు, ఐదు ఫోర్ల‌తో 73 ర‌న్స్, రితిక్ ఈశ్వ‌ర‌న్ 11 బాల్స్‌లో ఆరు సిక్స‌ర్ల‌తో 39 ర‌న్స్ తో నాటౌట్‌గా మిగిలారు.

మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన దిండిగ‌ల్ డ్రాగ‌న్స్ ఇర‌వై ఓవ‌ర్ల‌లో ఐదు వికెట్లు న‌ష్ట‌పోయి 185 ర‌న్స్ చేసింది. దిండిగ‌ల్ డ్రాగ‌న్స్ ఓపెన‌ర్‌ శివ‌మ్ సింగ్ 46 బాల్స్‌లో ఆరు సిక్స‌ర్లు, నాలుగు ఫోర్ల‌తో 76 ర‌న్స్ చేశాడు. భూప‌తి కుమార్ 41 ర‌న్స్‌తో రాణించాడు.

చదవండి: #NovakDjokovic: కసితో ఆడుతున్నాడు.. నెట్‌ను కూడా వదలడం లేదు!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement