స్పెయిన్ టీ10 క్రికెట్‌లో సంచలనం నమోదైంది. యునైటెడ్ సీసీ గిరోనాతో జరిగిన మ్యాచ్‌లో పాక్ బార్సిలోనా ఆటగాడు అలీ హసన్ 8 బంతుల్లో 8 సిక్సర్లు బాదాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బార్సిలోనాకు మెరుపు ఆరంభం లభించింది. అయితే ఆ జట్టు స్వల్ప వ్యవధిలో నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
— Sunil Gavaskar (@gavaskar_theman) November 20, 2024
ఈ దశలో బరిలోకి దిగిన అలీ హసన్ ప్రత్యర్థి బౌలర్లపై నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడ్డాడు. ఏడో ఓవర్ రెండో బంతి నుంచి వరుసగా ఐదు సిక్సర్లు.. ఆతర్వాత ఎనిమిదో ఓవర్ రెండో బంతి నుంచి వరుసగా మూడు సిక్సర్లు బాదాడు. ఈ మ్యాచ్‌లో మొత్తం 16 బంతులు ఎదుర్కొన్న అలీ హసన్ 8 సిక్సర్లు, బౌండరీ సాయంతో 55 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.
కడపటి వార్తలు అందేసరికి ఛేదనలో గిరోనా జట్టు ఎదురీదుతుంది. ఆ జట్టు కేవలం 19 పరుగులు మాత్రమే చేసి మూడు వికెట్లు కోల్పోయింది. ఈ టోర్నీ పాయింట్ల పట్టికలో బార్సిలోనా చివరి నుంచి రెండో స్థానంలో ఉంది. ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఓ గెలుపు, మరో పరాజయాన్ని ఎదుర్కొంది. ఐపీఎల్ 2025 మెగా వేలానికి షార్ట్ లిస్ట్ అయిన పేర్లలో అల్ హసన్ పేరు లేకపోవడం విచారకరం.
Comments
Please login to add a commentAdd a comment