అబుదాబీ టీ10 లీగ్‌లో ఆఫ్ఘనిస్తాన్ ఆటగాడు హజ్రతుల్లా జజాయ్ విధ్వంసం సృష్టించాడు. ఈ టోర్నీలో బంగ్లా టైగర్స్‌కు ప్రాతనిథ్యం వహిస్తున్న జజాయ్ ఒకే ఓవర్‌లో 5 సిక్సర్లు బాదాడు. నార్త్రన్ వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో జజాయ్ ఈ ఫీట్‌ను సాధించాడు. వారియర్స్ బౌలర్ అంకుర్ సాంగ్వాన్ జజాయ్ ధాటికి బలయ్యాడు. ఇన్నింగ్స్ ఐదో ఓవర్‌లో ఐదో బంతి మినహా మిగిలిన ఐదు బంతులను జజాయ్ సిక్సర్లుగా మలిచాడు.
ఈ మ్యాచ్‌లో జజాయ్ 23 బంతులు ఎదుర్కొని 3 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో అజేయమైన 53 పరుగులు చేశాడు. జజాయ్‌తో పాటు మొహమ్మద్ షెహజాద్ (25 బంతుల్లో 54 నాటౌట్; 8 ఫోర్లు, 2 సిక్సర్లు) కూడా రాణించడంతో నార్త్రన్ వారియర్స్‌పై బంగ్లా టైగర్స్ 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన నార్త్రన్ వారియర్స్ నిర్ణీత 10 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 107 పరుగులు చేసింది. కొలిన్ మున్రో 28 బంతుల్లో 4 బౌండరీలు, 3 సిక్సర్ల సాయంతో అజేయమైన 59 పరుగులు చేశాడు. వారియర్స్ ఇన్నింగ్స్‌లో మున్రో మినహా ఎవరూ రాణించలేదు.
బ్రాండన్ కింగ్ (12), జాన్సన్ చార్లెస్ (18) రెండంకెల స్కోర్లు చేశారు. షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్ 7, అజ్మతుల్లా 4, జియా ఉర్ రెహ్మాన్ 4 పరుగులు చేసి ఔటయ్యారు. బంగ్లా టైగర్స్ బౌలర్లలో రషీద్ ఖాన్, ఇఫ్తికార్ అహ్మద్ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. డేవిడ్ పేన్ ఓ వికెట్ దక్కించుకున్నాడు.
అనంతరం 108 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన టైగర్స్ 7.5 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా విజయతీరాలకు చేరింది. ప్రస్తుత ఎడిషన్‌లో బంగ్లా టైగర్స్‌కు ఇది వరుసగా రెండో విజయం.
Comments
Please login to add a commentAdd a comment