ఇటీవలే ముగిసిన డబ్ల్యూటీసీ చాంపియన్‌షిప్‌లో టీమిండియా ఓపెనర్ శుబ్‌మన్ గిల్ క్యాచ్ ఎంత వివాదాస్పదమయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కామెరాన్ గ్రీన్ అందుకున్న బంతి నేలకు తాకినట్లు క్లియర్‌గా తెలుస్తున్నప్పటికి థర్డ్ అంపైర్ ఔట్ ఇవ్వడం విమర్శలకు దారి తీసింది. మ్యాచ్‌లో టీమిండియా ఓటమి పాలయినప్పటికి గిల్ క్యాచ్ విషయంలో మాత్రం భారత్‌కు అన్యాయం జరిగిందనే చెప్పొచ్చు.
తాజాగా మరోసారి గిల్ క్యాచ్ సీన్ తమిళనాడు ప్రీమియర్ లీగ్‌లో రీక్రియేట్ అయింది. యాదృశ్చికంగా జరిగినప్పటికి అచ్చం గిల్ క్యాచ్ వివాదమే ఇక్కడా చోటుచేసుకుంది. అయితే ఈసారి కూడా థర్డ్ అంపైర్ ఔట్ అని ప్రకటించడంతో మరోసారి అన్యాయమే గెలిచింది. టీఎన్‌పీఎల్ 2023లో భాగంగా బుధవారం నెల్లయ్ రాయల్ కింగ్స్, ఐడ్రీమ్ తిరుప్పూర్ మధ్య మ్యాచ్ జరిగింది.
రాయల్ కింగ్స్ బ్యాటింగ్ సమయంలో నాలుగో ఓవర్ భువనేశ్వరన్ వేశాడు. ఆ ఓవర్ తొలి బంతిని ఎల్. సూర్యప్రకాశ్ ఆఫ్‌సైడ్ దిశగా ఆడే ప్రయత్నం చేశాడు. అయితే బంతి ఔట్‌సైడ్ ఎడ్జ్ అయి స్లిప్‌లో ఉన్న ఎస్. రాధాకృష్ణన్ చేతిలోకి వెళ్లింది. అయితే క్యాచ్ అందుకునే క్రమంలో రాధాకృష్ణన్ బంతిని నేలకు తాకించాడు. కానీ ఫీల్డ్ అంపైర్ అనుమానంతో థర్డ్ అంపైర్‌కు పంపించాడు.
క్యాచ్‌ను పరిశీలించిన థర్డ్ అంపైర్ ఔట్ అని ప్రకటించాడు. ఈ నిర్ణయంతో సూర్యప్రకాశ్ షాక్ తిన్నాడు. ఎందుకంటే రిప్లేలో బంతి నేలను తాకుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తున్నప్పటికి ఔట్ ఎలా ఇస్తారంటూ బాధపడిన సూర్య చేసేదేం లేక నిరాశగా పెవిలియన్ చేరాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
The third umpire thought this catch was clean. Does it bring back some recent memories? 🤔 #TNPLonFanCode pic.twitter.com/apAKHVn34v
— FanCode (@FanCode) June 20, 2023
ఇక మ్యాచ్ విషయానికి వస్తే ఐడ్రీమ్ తిరుప్పూర్ ఏడు వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన నెల్లయ్ రాయల్ కింగ్స్ 18.2 ఓవర్లలో 124 పరుగులకు ఆలౌట్ అయింది. సోను యాదవ్ 35 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. భువనేశ్వరన్ ఐదు వికెట్లతో చెలరేగాడు. అనంతరం బ్యాటింగ్ చేసిన ఐడ్రీమ్ తిరుప్పూర్ 18.2 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను చేధించింది. తుషార్ రహేజా 49, ఎస్ రాధాకృష్ణన్ 34, రాజేంద్రన్ వివేక్ 21 పరుగులు చేసి విజయంలో కీలకపాత్ర పోషించారు.
Comments
Please login to add a commentAdd a comment