డ్యాన్స్‌తోనూ ఇరగదీసిన రియాన్‌ పరాగ్‌.. అదిరిపోయే వీడియో..! | IPL 2024, RR VS DC: Riyan Parag Old Dance Video With Shubman Gill Goes Viral | Sakshi
Sakshi News home page

IPL 2024 RR VS DC: డ్యాన్స్‌తోనూ ఇరగదీసిన రియాన్‌ పరాగ్‌.. అదిరిపోయే వీడియో..!

Published Fri, Mar 29 2024 12:26 PM | Last Updated on Fri, Mar 29 2024 12:59 PM

IPL 2024 RR VS DC: Riyan Parag Old Dance Video With Shubman Gill Goes Viral - Sakshi

ఐపీఎల్‌ 2024లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో మెరుపు ఇన్నింగ్స్‌తో సత్తా చాటిన రాజస్థాన్‌ రాయల్స్‌ ప్లేయర్‌ రియాన్‌ పరాగ్‌.. ఆన్‌ ఫీల్డ్‌లో తన ప్రవర్తన చేత బాగా పాపులరైన విషయం తెలిసిందే. రియాన్‌ మైదానంలో తాను ఏమి సాధించినా డ్యాన్స్‌లు చేస్తూ.. విచిత్ర హావభావాలు పలికిస్తూ.. డ్రెస్సింగ్‌ రూమ్‌కు ఇంకేదైనా సందేశాన్ని పంపిస్తూ సెలబ్రేట్‌ చేసుకుంటాడు. 

ఇటీవలికాలంలో అతను చేసిన కొన్ని స్టంట్స్‌ సోషల్‌మీడియాలో బాగా వైరలయ్యాయి. దేశవాలీ టోర్నీలో సెంచరీ చేసిన అనంతరం నా స్థాయి ఇది కాదని సైగలు చేయడం, ఐపీఎల్‌లో హాఫ్‌ సెంచరీ అనంతరం డ్యాన్స్‌ చేయడం వంటివి జనాలకు బాగా కనెక్ట్‌ అయ్యాయి. వీటి వల్ల చాలా పాపులరైన రియాన్‌.. ఓవరాక్షన్‌ స్టార్‌ అన్న అపవాదు కూడా తెచ్చుకున్నాడు. అయితే రియాన్‌ ఇటీవలికాలంలో బ్యాట్‌తో సమాధానం చెబుతూ ఆ ముద్రను చెరిపి వేసుకుంటున్నాడు. 

రియాన్‌ తాజా ప్రదర్శన (ఢిల్లీపై మెరుపు ఇన్నింగ్స్‌) నేపథ్యంలో జనాల్లో అతనిపై నెగిటివిటీ పోయి హీరో ఒపీనియన్‌ వస్తుంది. రాత్రికిరాత్రి రాజస్థాన్‌ ఫ్యాన్స్‌ రియాన్‌ను హీరోలా చూడటం మొదలుపెట్టారు. నిన్న రాత్రి నుంచి సోషల్‌మీడియాలో ఎక్కడ చూసినా రియానే కనిపిస్తున్నాడు. ఇతనికి సంబంధించిన పాత వీడియోలు, ఫోటోలు చక్కర్లు కొడుతున్నాయి.

ఈ క్రమంలో పాత వీడియో ఒకటి హల్‌చల్‌ చేస్తుంది. ఇందులో రియాన్‌ డ్యాన్స్‌తో ఇరగదీస్తాడు. ఈ వీడియోలో రియాన్‌ డ్యాన్స్‌తో ఇరగదీస్తుంటే శుభ్‌మన్‌ గిల్‌ అతన్ని ఎంకరేజ్‌ చేస్తుంటాడు. ఫాస్ట్‌ బీట్‌ ఉండే ఓ ట్యూన్‌కు రియాన్‌ ప్రొఫెషనల్‌ డ్యాన్సర్‌లా స్టెప్పులేశాడు. ఈ వీడియో చూస్తే రియాన్‌పై ఇంప్రెషన్‌ ఇంకాస్త పెరుగుతుంది. మొత్తానికి రియాన్‌ బ్యాట్‌తోనే కాకుండా డ్యాన్స్‌తోనూ ఇరగదీశాడు. ఈ వీడియోపై మీరు కూడా ఓ లుక్కేయండి. 

ఇదిలా ఉంటే, ఢిల్లీతో నిన్న జరిగిన మ్యాచ్‌లో రియాన్‌ (45 బంతుల్లో 84 నాటౌట్‌; 7 ఫోర్లు, 6 సిక్సర్లు) రెచ్చిపోవడంతో రాయల్స్‌ 12 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన రాజస్థాన్‌.. నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేయగా.. ఛేదనలో తడబడిన ఢిల్లీ 173 పరుగులకే పరిమితై సీజన్‌లో వరుసగా రెండో ఓటమిని మూటగట్టుకుంది.

రాయల్స్‌ ఇన్నింగ్స్‌లో రియాన్‌తో పాటు అశ్విన్‌ (29; 3 సిక్సర్లు), జురెల్‌ (20; 3 ఫోర్లు) ఆకట్టుకున్నారు. ఢిల్లీ విషయానికొస్తే.. నామమాత్రపు ఛేదనలో డేవిడ్‌ వార్నర్‌ (49) పర్వాలేదనిపించగా.. ట్రిస్టన్‌ స్టబ్స్‌ (44 నాటౌట్‌; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. రాజస్థాన్‌ బౌలర్లు బర్గర్‌ (3-0-29-2), చహల్‌ (3-0-19-2), ఆవేశ్‌ ఖాన్‌ (4-0-29-1) రాణించారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement