ఐపీఎల్-2023లో దుమ్మురేపిన గుజరాత్ టైటాన్స్ యువ ఆటగాడు సాయి సుదర్శన్.. తమిళనాడు ప్రీమియర్ లీగ్‌లో అదే దూకుడును కనబరుస్తున్నాడు. ఈ లీగ్‌లో లైకా కోవై కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న సాయిసుదర్శన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. తాజాగా దిండిగల్ డ్రాగన్స్‌తో మ్యాచ్‌లో సుదర్శన్ మరో అద్భుత హాఫ్ సెంచరీతో చెలరేగాడు.
ఇది ఈ లీగ్‌లో సాయికి నాలుగో హాఫ్ సెంచరీ కావడం గమనార్హం. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో 41 బంతులు ఎదుర్కొన్న సుదర్శన్ 8 ఫోర్లు, 4 సిక్స్‌లతో 83 పరుగులు చేశాడు. అతడు అద్భుత ఇన్నింగ్స్ ఫలితంగా లైకా కోవై కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. ఓవరాల్‌గా ఈ టోర్నీలో ఇప్పటి వరకు 5 మ్యాచ్‌లు ఆడిన సుదర్శన్ 110 సగటుతో 323 పరుగులు చేశాడు.
అదే విధంగా ఈ ఏడాది ఐపీఎల్‌లో కూడా సాయి సుదర్శన్ కీలక ఇన్నింగ్స్‌లు ఆడాడు. ఫైనల్‌లో 47 బంతుల్లో 96 పరుగులు చేసి, గుజరాత్ టైటాన్స్‌కి భారీ స్కోరు అందించాడు. ఈ ఏడాది సీజన్‌లో కేవలం 8 మ్యాచ్‌లు మాత్రమే ఆడిన సాయి 50 పైగా సగటుతో 362 పరుగులు సాధించాడు. ఇక సూపర్ ఫామ్‌లో ఉన్న సాయి సుదర్శన్ త్వరలో వెస్టిండీస్‌తో జరగనున్న టీ20 సిరీస్‌తో అంతర్జాతీయ అరంగేట్రం చేసే ఛాన్స్ ఉంది.
చదవండి: World Cup 2023: వన్డే ప్రపంచకప్‌కు సంబంధించి ఐసీసీ కీలక అప్‌డేట్
Comments
Please login to add a commentAdd a comment