ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ అనంతరం టీమిండియా దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లనుంది. ఈ టూర్‌లో భాగంగా సౌతాఫ్రికాతో మూడు మ్యాచ్‌ల టీ20, వన్డే, రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భారత్ తలపడనుంది. ఈ క్రమంలో ఈ సిరీస్‌లకు భారత జట్లను అజిత్ అగర్కార్ నేతృత్వంలోని బీసీసీఐ సెలక్షన్ కమిటీ గురువారం ప్రకటించింది.
దక్షిణాఫ్రికాతో టీ20, వన్డే సిరీస్‌లకు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ దూరమయ్యారు. వీరి నలుగురు తిరిగి టెస్టు జట్టులోకి వచ్చారు. ఇక సౌతాఫ్రికాతో టీ20ల్లో సూర్యకుమార్ యాదవ్ భారత జట్టు సారథిగా ఎంపిక కాగా.. వన్డేల్లో కేఎల్ రాహుల్‌కు భారత జట్టు పగ్గాలు అప్పగించారు.
సాయిసుదర్శన్ ఎంట్రీ..
దేశీవాళీ క్రికెట్‌లో అద్బుతంగా రాణిస్తున్న తమిళనాడు యువ సంచలనం సాయిసుదర్శన్‌కు సెలక్టర్లు తొలిసారి పిలుపునిచ్చారు. సుదర్శన్‌కు తొలిసారి భారత వన్డే జట్టులో చోటు దక్కింది. ఈ ఏడాది ఐపీఎల్‌తో పాటు ఎమర్జింగ్ ఆసియా కప్ టోర్నీలో కూడా సాయి దుమ్మురేపాడు. ఐపీఎల్-2023 సీజన్‌లో కేవలం 8 మ్యాచ్‌లు మాత్రమే ఆడిన సాయి 50 పైగా సగటుతో 362 పరుగులు సాధించాడు. లిస్ట్-ఏ క్రికెట్లో కూడా సుదర్శన్‌కు మంచి రికార్డు ఉంది.
ఇప్పటివరకు తన లిస్ట్-ఏ కెరీర్‌లో 22 మ్యాచ్‌లు ఆడిన సుదర్శన్.. 65.05 సగటుతో 1236 పరుగులు చేశాడు. ఈ క్రమంలోనే అతడిని సెలక్టర్లు జాతీయ జట్టుకు ఎంపిక చేశారు. ఇక అతడితో పాటు సంజూ శాంసన్, యుజ్వేంద్ర చాహల్, రజిత్ పాటిదర్‌కు కూడా భారత వన్డే జట్టులోకి చోటు దక్కింది. ఇప్పటివరకు 8 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడిన సుదర్శన్.. 42.71 సగటుతో 598 పరుగులు చేశాడు.
దక్షిణాఫ్రికాతో వన్డేలకు భారత జట్టు: రుతురాజ్ గైక్వాడ్, సాయి సుదర్శన్, తిలక్ వర్మ, రజత్ పాటిదార్, రింకూ సింగ్, శ్రేయాస్ లియర్, కేఎల్ రాహుల్ (కెప్టెన్) (వారం), సంజు శాంసన్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్ , ముఖేష్ కుమార్, అవేష్ ఖాన్, అర్ష్దీప్ సింగ్, దీపక్ చాహర్
Comments
Please login to add a commentAdd a comment