నెలరోజుల పాటు క్రికెట్ ప్రేమికులను అలరించిన తమిళనాడు ప్రీమియర్(TNPL 2023) లీగ్‌లో లైకా కోవై కింగ్స్ విజేతగా నిలిచింది. బుధవారం రాత్రి జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో నెల్లయ్ రాయల్ కింగ్స్‌పై 104 పరుగుల తేడాతో భారీ విజయాన్ని సాధించిన లైకా కింగ్స్ వరుసగా రెండోసారి చాంపియన్‌గా నిలవడం విశేషం.
తొలుత బ్యాటింగ్ చేసిన లైకా కోవై కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 205 పరుగుల భారీ స్కోరు చేసింది. సురేశ్ కుమార్(33 బంతుల్లో 57 పరుగులు), ముకిలేష్(40 బంతుల్లో 51 నాటౌట్) నిలకడగా ఆడగా.. చివర్లో అతీక్ ఉర్ రెహమాన్(21 బంతుల్లోనే 50 పరుగులు) మెరుపులు మెరిపించాడు. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన నెల్లయ్ రాయల్ కింగ్స్ 15 ఓవర్లలో 101 పరుగులకే కుప్పకూలింది.
అరుణ్ కార్తిక్ 27 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. లక్ష్మేషా సుర్యప్రకాశ్ 22 పరుగులు చేశాడు. లైకా కోవై కింగ్స్ బౌలర్లలో జతదేవ్ సుబ్రమణ్యన్ నాలుగు వికెట్లు తీయగా.. కెప్టెన్ షారుక్ ఖాన్ మూడు, మణిమరన్ సిద్దార్థ్, గౌతమ్ కన్నన్, మహ్మద్‌లు తలా ఒక వికెట్ తీశారు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా జతదేవ్ సుబ్రమణ్యన్ నిలవగా.. ఆరెంజ్ క్యాప్‌ను నెల్లయ్ రాయల్ కింగ్స్ బ్యాటర్ అజితేశ్ గురుస్వామి(10 మ్యాచ్‌ల్లో 385 పరుగులు) గెలుచుకోగా.. పర్పుల్ క్యాప్‌ను లైకా కోవై కింగ్స్ కెప్టెన్ షారుక్ ఖాన్(9 మ్యాచ్‌ల్లో 17 వికెట్లు) అందుకున్నాడు.
And the party🪇 mood starts!❤️#TNPL2023🏏#GethuKaatuvoma#sekkalisingamla#TNPLonstarsports#TNPLonfancode#NammaAatamAarambam💥#NammaOoruNammaGethu💪🏼 pic.twitter.com/ygqBBSACxg
— TNPL (@TNPremierLeague) July 12, 2023
Lyca Kovai, Kings once again!#TNPLonFanCode pic.twitter.com/ALXkYMzChX
— FanCode (@FanCode) July 12, 2023
చదవండి: #CarlosAlcaraz: 'నాన్నను నిందించొద్దు.. ప్రేమతో అలా చేశాడు; నాకు ఒరిగేదేం లేదు!'
Comments
Please login to add a commentAdd a comment