Tamil Nadu Premier League
-
ఉత్తమ స్పిన్నర్లలో ఒకడిని.. జట్టులో చోటివ్వండి: భారత బౌలర్
తనకు టెస్టుల్లో ఆడే అవకాశం ఇవ్వాలని టీమిండియా యువ ఆల్‌రౌండర్ ఆర్. సాయి కిశోర్ సెలక్టర్లకు విజ్ఞప్తి చేశాడు. భారత్‌లో ఉన్న ఉత్తమ స్పిన్నర్లలో తానూ ఒకడినని.. ఒక్క అవకాశం ఇస్తే తనను తాను నిరూపించుకుంటానని మేనేజ్మెంట్ను అభ్యర్థించాడు. తమిళనాడుకు చెందిన సాయి కిశోర్ ఆసియా క్రీడలు-2023 సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు.ఈ ప్రతిష్టాత్మక టోర్నీకి భారత క్రికెట్ నియంత్రణ మండలి తొలిసారి పంపిన క్రికెట్ జట్టులో భాగమైన ఈ లెఫ్టార్మ్ స్పిన్ బౌలర్.. మొత్తంగా మూడు టీ20లు ఆడి నాలుగు వికెట్లు పడగొట్టాడు. ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో గుజరాత్ టైటాన్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న సాయి కిశోర్.. ఈ ఏడాది పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్ సందర్భంగా అత్యుత్తమ గణాంకాలు(4/33) నమోదు చేశాడు.మెడకు తీవ్ర గాయంఅయితే, ఆ ఆనందం ఎక్కువకాలం నిలవలేదు. మ్యాచ్‌ల విరామ సమయంలో గోల్ఫ్ ఆడేందుకు వెళ్లిన సాయి కిశోర్.. మెడకు తీవ్రమైన గాయమైంది. ఫలితంగా ఐపీఎల్-2024 మిగిలిన మ్యాచ్‌లన్నింటికీ అతడు దూరం కావాల్సి వచ్చింది. ఈ క్రమంలో జాతీయ క్రికెట్ అకాడమీ(ఎన్సీఏ)లో పునరావాసం పొందిన సాయి.. ఈ ఏడాది జూలైలో తమిళనాడు ప్రీమియర్ లీగ్ సందర్భంగా తిరుప్పూర్ తమిళన్స్ తరఫున పునరాగమనం చేశాడు.తదుపరి దులిప్ ట్రోఫీ-2024లో సాయి భాగం కానున్నాడు. అభిమన్యు ఈశ్వరన్ సారథ్యంలోని టీమ్-బిలో ఆడనున్నాడు. ఈ నేపథ్యంలో ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో మాట్లాడిన సాయి కిశోర్.. తీవ్రమైన గాయం నుంచి కోలుకోవడం వెనుక ఎన్సీఏ ఫిజియోల కృషి ఎంతగానో ఉందని తెలిపాడు. వారితో పాటు తన భార్య కూడా కంటికి రెప్పలా కాచుకుని తనను తిరిగి మామూలు స్థితికి తీసుకువచ్చిందన్నాడు.భయపడ్డాను‘‘మనం నడవాలన్నా.. నిద్రించాలన్నా.. దేనికైనా మెడనే ఉపయోగిస్తాం. మెడకు గాయమైన తర్వాత.. క్రికెట్ మాట పక్కనపెడితే.. నేనసలు తిరిగి సాధారణ జీవితం గడపుతానో లేదోనని భయపడ్డాను. ఆటకు దూరమైనా బాధను దిగమింగుకోవాలని నా మనసును సన్నద్ధం చేసుకున్నాను. అయితే, తులసి అన్న(తులసిరామ్ యువరాజ్, ఎన్సీఏలో ఫిజియో) నేను కోలుకోవడంలో ఎంతో తోడ్పాటునందించారు.నా వ్యక్తిగత మసాజర్, ట్రైనర్ హర్షా.. ఇలా అందరూ నాకు సహాయం అందించారు. గాయం వల్ల అసలు ఎక్కువ సేపు కూర్చునే వీలు కూడా ఉండేది కాదు. ప్రతి పనికీ ఇతరుల మీద ఆధారపడాల్సి వచ్చేది. నా భార్య సహకారం వల్లే ఇప్పుడిలా కోలుకోగలిగాను’’ అని సాయి కిశోర్ తెలిపాడు.ఒక్క ఛాన్స్ ఇవ్వండిఇక తనకు టెస్టుల్లో ఆడాలని ఉందన్న సాయి కిశోర్.. రవీంద్ర జడేజాతో కలిసి ఒక్క మ్యాచ్‌లో భాగమైనా సంతోషంగా ఉంటుందని పేర్కొన్నాడు. ‘‘దేశంలోని ఉత్తమ స్పిన్నర్లలో నేనూ ఒకడినని భావిస్తా. టెస్టుల్లో నన్ను ఆడించండి. అందుకు నేను సిద్ధంగా ఉన్నాను. జడేజాతో కలిసి ఆడటం నాకు ఇష్టం. అతడిని దగ్గరగా గమనిస్తూ.. తన నుంచి పాఠాలు నేర్చుకునే అవకాశం ఉంటుంది’’ అని సాయి కిశోర్ తన మనసులోని మాటను వ్యక్తపరిచాడు.చదవండి: తారలు దిగివచ్చే వేళ.. అనంతపురంలో దులీప్ ట్రోఫీ -
స్పెషలిస్ట్ బ్యాటర్‌గా మారిన అశ్విన్.. హ్యాట్రిక్ హాఫ్ సెంచరీలు
టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ స్పెషలిస్ట్ బ్యాటర్లకు ఏమాత్రం తీసిపోని విధంగా మారాడు. తమిళనాడు ప్రీమియర్ లీగ్ 2024 ఎడిషన్‌లో యాష్ బ్యాట్‌తో మెరుపు విన్యాసాలు చేశాడు. ఈ టోర్నీలో అశ్విన్ సారథ్యంలో దిండిగుల్ డ్రాగన్స్ ఛాంపియన్‌గా అవతరించింది. డ్రాగన్స్ ఛాంపియన్‌గా అవతరించడంలో అశ్విన్ ప్రధానపాత్ర పోషించాడు. అశ్విన్.. డ్రాగన్స్ విజయాల్లో బంతితో కాంట్రిబ్యూట్ చేశాడనుకుంటే పొరపాటే. అశ్విన్ తనలోని బ్యాటింగ్ నైపుణ్యాన్ని వెలికితీసి డ్రాగన్స్‌ను ఛాంపియన్‌గా నిలబెట్టాడు. కీలకమైన ఎలిమినేటర్, క్వాలిఫయర్-1, ఫైనల్ మ్యాచ్‌ల్లో అశ్విన్ మెరుపు అర్దసెంచరీలు చేశాడు. ఎలిమినేటర్ మ్యాచ్‌లో 35 బంతుల్లో 57 పరుగులు చేసిన యాష్.. క్వాలిఫయర్-2లో 30 బంతుల్లో అజేయమైన 69 పరుగులు.. ఫైనల్లో 46 బంతుల్లో 52 పరుగులు చేసి డ్రాగన్స్ విజయాల్లో కీలకపాత్ర పోషించాడు.అశ్విన్ అంతర్జాతీయ వేదికపై కూడా పలు సందర్భాల్లో బ్యాట్‌తో విన్యాసాలు చేశాడు. టెస్ట్‌ల్లో అయితే యాష్ పేరిట ఐదు సెంచరీలు ఉన్నాయి. ఐపీఎల్‌లోనూ అశ్విన్ పలు సందర్భాల్లో మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడాడు. 37 ఏళ్ల వయసులో అశ్విన్ అటతీరు చూసిన వారు ఔరా అంటున్నారు. అశ్విన్ బ్యాట్‌తో ఇదే తరహాలో రెచ్చిపోతే భారత టీ20 జట్టుకు ఎంపిక కావడం ఖాయమని అంటున్నారు. బ్యాట్‌తో రాణించాడని అశ్విన్ బౌలింగ్‌ను లైట్‌గా తీసుకోలేదు. తమిళనాడు ప్రీమియర్ లీగ్‌లో అతను బంతితోనూ రాణించాడు. ఎలిమినేటర్ మ్యాచ్‌లో 4 ఓవర్లలో 33 పరుగులు.. క్వాలిఫయర్-2లో నాలుగో ఓవర్లలో 27 పరుగులు (ఒక వికెట్).. ఫైనల్లో అత్యంత పొదుపుగా బౌలింగ్ చేసి నాలుగు ఓవర్లలో కేవలం 13 పరుగులు మాత్రమే ఇచ్చాడు.కాగా, తమిళనాడు ప్రీమియర్ లీగ్ ఫైనల్లో దిండిగుల్ డ్రాగన్స్.. లైకా కోవై కింగ్స్‌పై 6 వికెట్ల తేడాతో గెలుపొంది టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో బ్యాట్‌తో, బంతితో సత్తా చాటిన అశ్విన్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. ఫైనల్లో తొలుత బ్యాటింగ్ చేసిన కోవై కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 129 పరుగులు మాత్రమే చేయగా.. డ్రాగన్స్ 18.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి విజేతగా అవతరించింది. -
చెలరేగిన టీమిండియా స్టార్.. ద్రవిడ్ చేతుల మీదుగా ట్రోఫీ
తమిళనాడు ప్రీమియర్ లీగ్-2024 సీజన్ విజేతగా దిండిగల్ డ్రాగన్స్ అవతరించింది. టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కెప్టెన్సీలో తమ తొలి టైటిల్ సాధించింది. నాయకుడిగా జట్టును ముందుకు నడిపిస్తూనే.. ఆద్యంతం ఆల్‌రౌండ్ ప్రతిభతో ఆకట్టుకున్న అశ్విన్ ఫైనల్లోనూ అద్భుత ప్రదర్శనతో డ్రాగన్స్కు ట్రోఫీ అందించాడు.జూలై 5న మొదలైన తమిళనాడు లీగ్ తాజా ఎడిషన్ ఆదివారం(ఆగష్టు 4)తో ముగిసింది. లైకా కోవై కింగ్స్, ట్రిచీ గ్రాండ్ చోళాస్, చెపాక్ సూపర్ గిల్లీస్, నెల్లై రాయల్ కింగ్స్, ఐడ్రీమ్ తిరుపూర్ తమిళన్స్, దిండిగల్ డ్రాగన్స్, సేలం స్పార్టన్స్, సీచం మధురై పాంథర్స్ తదితర జట్లు టైటిల్ కోసం పోటీపడ్డాయి.TNPL 2024-ன் மணிமகுடத்தில் தங்களோட பெயரை பதிய வெச்சுட்டாங்க Dindigul Dragons! 🏆🥳#TNPLOnStar #TNPL2024 #NammaOoruNammaGethu @TNPremierLeague pic.twitter.com/00yaGgqbHj— Star Sports Tamil (@StarSportsTamil) August 4, 2024 రాణించిన బౌలర్లు ఈ క్రమంలో లైకా కోవై కింగ్స్- దిండిగల్ డ్రాగన్స్ ఫైనల్ చేరగా.. ఇరు జట్ల మధ్య ఆదివారం రాత్రి మ్యాచ్ జరిగింది. చెపాక్ స్టేడియం వేదికగా టాస్ గెలిచిన దిండిగల్ తొలుత బౌలింగ్ చేసింది. లైకా జట్టును 129 పరుగులకు పరిమితం చేసింది. దిండిగల్ బౌలర్లు వరుణ్ చక్రవర్తి, సందీప్ వారియర్, పి.విఘ్నేశ్ తలా రెండు వికెట్లు పడగొట్టగా.. సబోత్ భాటీ ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు.లైకా ఇన్నింగ్స్‌లో రామ్ అర్వింద్ 27 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇక స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన దిండిగల్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బలు తగిలాయి. ఓపెనర్లు విమల్ కుమార్ 9, శివం సింగ్ 4 పరుగులు మాత్రమే చేసి అవుటయ్యారు. ఈ క్రమంలో వన్‌డౌన్ బ్యాటర్ రవిచంద్రన్ అశ్విన్ ఇన్నింగ్స్ చక్కదిద్దే బాధ్యత తీసుకున్నాడు.అశూ హాఫ్ సెంచరీమరో ఎండ్ నుంచి వికెట్ కీపర్ బాబా అపరాజిత్(32) సహకారం అందించగా.. అశూ కెప్టెన్ ఇన్నింగ్స్‌తో సత్తా చాటాడు. 46 బంతుల్లో ఒక ఫోర్, మూడు సిక్సర్ల సాయంతో 52 పరుగులు చేశాడు. మిగతా వాళ్లలో సి. శరత్ కుమార్ 27, భూపతి కుమార్ 3 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చారు.అర్ధ శతకంతో రాణించి జట్టును గెలిపించిన అశ్విన్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఇక టోర్నీ ఆసాంతం అద్భుతంగా ఆడిన షారుఖ్ ఖాన్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు అందుకున్నాడు. టీమిండియా మాజీ హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్ చేతుల మీదుగా విజేతలకు బహుమతులు అందించారు నిర్వాహకులు.ఇదే తొలి టైటిల్.. ద్రవిడ్ చేతుల మీదుగా ట్రోఫీకాగా తమిళనాడు ప్రీమియర్ లీగ్‌లో దిండిగల్ డ్రాగన్స్కు ఇదే తొలి టైటిల్ కావడం విశేషం. ఇక ఈ మ్యాచ్‌లో అశ్విన్ సిక్సర్ల వర్షం కురిపిస్తూ యాభై పరుగుల మార్కు అందుకోగానే.. అతడి భార్య ప్రీతి నారాయనణ్ చప్పట్లతో అభినందిస్తూ సందడి చేశారు. ప్రీతికి సంబంధించిన విజువల్స్ హైలైట్‌గా నిలిచాయి.తమిళనాడు ప్రీమియర్ లీగ్ తాజా ఎడిషన్‌లో 37 ఏళ్ల అశ్విన్.. పది మ్యాచ్‌లలో కలిపి 252 పరుగులు సాధించడంతో పాటు తొమ్మిది వికెట్లు తీశాడు. కాగా ఈ టీ20 లీగ్ తర్వాత అశ్విన్ టీమిండియా సిరీస్‌లతో బిజీ కానున్నాడు. బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్ నేపథ్యంలో అతడు జట్టులోకి వచ్చే అవకాశం ఉంది.దిండిగల్ డ్రాగన్స్ వర్సెస్ లైకా కోవై కింగ్స్ స్కోర్లు👉లైకా కోవై కింగ్స్- 129/7 (20)👉దిండిగల్ డ్రాగన్స్ - 131/4 (18.2)👉ఫలితం: ఆరు వికెట్ల తేడాతో కోవై కింగ్స్‌పై గెలిచిన దిండిగల్ డ్రాగన్స్.చదవండి: IND vs SL: 6 వికెట్లతో భారత్‌కు చుక్కలు చూపించాడు.. ఎవరీ జెఫ్రీ వాండర్సే?Ash அண்ணா! என்றென்றும் நீங்க Mass அண்ணா! 🤩👏📺 தொடர்ந்து காணுங்கள் TNPL | Final | Lyca Kovai Kings vs Dindigul Dragons | Star Sports தமிழில் மட்டும்#TNPLOnStar #TNPL2024 #NammaOoruNammaGethu @TNPremierLeague pic.twitter.com/A6Da3c74xx— Star Sports Tamil (@StarSportsTamil) August 4, 2024 -
రవిచంద్రన్ అశ్విన్ విధ్వంసం.. 11 ఫోర్లు, 3 సిక్స్‌లతో! వీడియో
తమిళనాడు ప్రీమియర్ లీగ్ (టిఎన్పిఎల్)-2024లో దిండిగల్ డ్రాగన్స్ కెప్టెన్, టీమిండియా వెటరన్ రవిచంద్రన్ అశ్విన్ తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. శుక్రవారం ఐడ్రీమ్ తిరుప్పూర్ తమిజన్స్‌తో జరిగిన క్వాలిఫియర్-2లో అశ్విన్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 109 పరుగుల స్వల్ప లక్ష్య చేధనలో ఓపెనర్‌గా వచ్చిన అశ్విన్.. ప్రత్యర్ధి బౌలర్లను ఊచకోత కోశాడు.కేవలం 30 బంతులు ఎదుర్కొన్న అశ్విన్.. 11 ఫోర్లు, 3 సిక్స్‌లతో 69 పరుగులు చేశాడు. అతడి విధ్వంసకర ఇన్నింగ్స్ ఫలితంగా స్వల్ప లక్ష్యాన్ని దిండిగల్ కేవలం 10.5 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి చేధించింది. అశ్విన్‌తో పాటు మరో ఓపెనర్ విమల్ కుమార్ 28 పరుగులతో రాణించాడు.తొలుత బ్యాటింగ్ చేసిన ఐడ్రీమ్ తిరుప్పూర్ జట్టు దిండిగల్ బౌలర్లు చెలరేగడంతో 108 పరుగులకే కుప్పకూలింది. తిరుప్పూర్ బ్యాటర్లలో మన్ భప్నా(26) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. దిండిగల్ బౌలర్లలో పి విగ్నేష్ 3 వికెట్లు పడగొట్టగా.. సుభాత్ భాటీ, వరుణ్ చక్రవర్తి తలా రెండు వికెట్లు సాధించారు. ఇక ఈ విజయంతో దిండిగల్ డ్రాగన్స్ ఫైనల్లో అడుగుపెట్టింది. ఆదివారం జరగనున్న ఫైనల్లో లైకా కోవై కింగ్స్‌తో దిండిగల్ డ్రాగన్స్ తలపడనుంది. Ravi Ashwin in the TNPL knockouts:Eliminator:57 (35) - won POTM award.Qualifier:69* (30) & 1/27 - won POTM award.- Ashwin, the All Rounder. 🥶pic.twitter.com/lQE48sJKnR— Mufaddal Vohra (@mufaddal_vohra) August 3, 2024 -
అశ్విన్ ఊచకోత.. సిక్సర్ల వర్షం! వీడియో వైరల్
తమిళనాడు ప్రీమియర్ లీగ్ (టిఎన్పిఎల్)-2024లో దిండిగల్ డ్రాగన్స్ క్వాలిఫియర్-2కు ఆర్హత సాధించింది. దిండిగల్ వేదికగా జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో చెపాక్ సూపర్ గిల్స్పై 4 వికెట్ల తేడాతో డ్రాగన్స్ విజయం సాధించింది. ఈ విజయంలో ఆ జట్టు కెప్టెన్, భారత వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కీలక పాత్ర పోషించాడు. తొలుత బౌలింగ్‌లో విఫలమైన అశ్విన్.. బ్యాటింగ్‌లో మాత్రం దుమ్ములేపాడు. 159 పరుగుల లక్ష్య చేధనలో అశ్విన్ మెరుపు హాఫ్ సెంచరీతో చెలరేగాడు. కళ్లు చెదిరే షాట్లను అశ్విన్ ఆడాడు. ఫస్ట్ డౌన్లో బ్యాటింగ్‌కు వచ్చిన అశ్విన్.. ఓపెనర్ శివమ్ సింగ్‌తో కలిసి 112 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఓవరాల్‌గా 35 బంతులు ఎదుర్కొన్న అశ్విన్.. 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 57 పరుగులు చేసి ఔటయ్యాడు. అశ్విన్‌తో పాటు శివమ్ సింగ్(64) అద్బుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఫలితంగా 159 పరుగుల లక్ష్యాన్ని దిండిగల్ డ్రాగన్స్ 19.5 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి చేధించింది. అంతకుముందు బ్యాటింగ్ చేసిన చెపాక్ సూపర్ గిల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 158 పరుగలు చేసింది. చెపాక్ సూపర్ గిల్స్ బ్యాటర్లలో కెప్టెన్ అపరజిత్(72) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇక ఆగస్టు 2న జరగనున్న క్వాలిఫియర్-2లో ఐడ్రీమ్ తిరుప్పూర్ తమిజన్స్‌తో దిండిగల్ డ్రాగన్స్ తలపడనుంది. நெருப்பு டா நெருங்கு டா பாப்போம்! Ft. Ash அண்ணா 💥🥵📺 தொடர்ந்து காணுங்கள் TNPL | Eliminator | Chepauk Super Gillies vs Dindigul Dragons | Star Sports தமிழில் மட்டும்#TNPLOnStar #TNPL2024 #NammaOoruNammaGethu @TNPremierLeague pic.twitter.com/7E7oxuDPfZ— Star Sports Tamil (@StarSportsTamil) July 31, 2024 -
సాయి సుదర్శన్ సుడిగాలి శతకం.. సిక్సర్ల వర్షం
తమిళనాడు ప్రీమియర్ లీగ్ 2024లో లైకా కోవై కింగ్స్ ఫైనల్స్‌కు చేరింది. నిన్న (జులై 30) జరిగిన క్వాలిఫయర్-1లో ఆ జట్టు ఐ డ్రీమ్ తిరుప్పూర్ తమిఝాన్స్పై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. సాయి సుదర్శన్ సుడిగాలి శతకంతో (56 బంతుల్లో 123 నాటౌట్; 9 ఫోర్లు, 9 సిక్సర్లు) కోవై కింగ్స్‌ను విజయతీరాలకు చేర్చాడు. సాయి సుదర్శన కేవలం 48 బంతుల్లో శతక్కొట్టాడు. తమిళనాడు ప్రీమియర్ లీగ్‌లో ఇది రెండో వేగవంతమైన శతకం.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన తిరుప్పూర్.. అమిత్ సాత్విక్ (67), తుషార్ రహేజా (55), మొహమ్మద్ అలీ (45 నాటౌట్) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. ఛేదనలో కోవై కింగ్స్ తొలి బంతికే వికెట్ కోల్పోయినప్పటికీ సాయి సుదర్శన్ చెలరేగడంతో 18.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. సాయి సుదర్శన్‌తో పాటు ముకిలేశ్ (48 నాటౌట్) బ్యాట్ ఝులిపించాడు. కాగా, ఇవాళ (జులై 31) జరిగే ఎలిమినేటర్ మ్యాచ్‌లో చెపాక్ సూపర్ గిల్లీస్, దిండిగుల్ డ్రాగన్స్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టుతో తిరుప్పూర్ క్వాలిఫయర్-2లో తలపడుతుంది. క్వాలిఫయర్-2లో గెలిచిన జట్టు ఆగస్ట్ 4న జరిగే ఫైనల్లో కోవై కింగ్స్‌ను ఢీకొంటుంది. -
తమిళనాడు ప్రీమియర్ లీగ్‌లో ఫన్నీ సీన్
తమిళనాడు ప్రీమియర్ లీగ్ 2024లో ఓ ఫన్నీ సీన్ జరిగింది. మధురై పాంథర్స్-చెపాక్ గిల్లీస్ మధ్య జరిగిన మ్యాచ్ సందర్భంగా ఓ బ్యాటర్ భారీ సిక్స్ కొట్టగా.. బంతి స్టేడియం బయట పడింది. ఆ సమయంలో అక్కడ ఉన్న ఓ వ్యక్తి బంతిని తీసుకుని తిరిగి ఉచ్చేందుకు నిరాకరించాడు. ఇవ్వను పో ఏం చేసుకుంటారో చేసుకోండన్నట్లు ఆ వ్యక్తి ప్రవర్తించాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరలవుతుంది.A must watch moment in TNPL. 😀👌- Peak gully cricket vibe when an outsider took the ball & not giving it back...!!! pic.twitter.com/N5iah4NmUT— Johns. (@CricCrazyJohns) July 29, 2024కాగా, ఆ మ్యాచ్‌లో చెపాక్ గిల్లీస్‌పై మధురై పాంథర్స్ 9 పరుగుల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాంథర్స్.. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేయగా.. ఛేదనలో పోరాడిన చెపాక్ గిల్లీస్ లక్ష్యానికి 10 పరుగుల దూరంలో నిలిచిపోయింది. 55 పరుగులు చేసి పాంథర్స్ ఇన్నింగ్స్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచిన లోకేశ్వర్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు. ప్రదోష్ రంజన్ పాల్ (52) పోరాడినప్పటికీ.. చెపాక్‌ను గెలిపించలేకపోయాడు. కార్తీక్ మణికందన్ 3 వికెట్లు తీసి చెపాక్‌కు దెబ్బకొట్టాడు. -
అశ్విన్ పరుగుల విధ్వంసం.. సిక్సర్ల మెరుపులు.. వీడియో
భారత స్పిన్ మాస్టర్ రవిచంద్రన్ అశ్విన్ బ్యాట్‌తో దుమ్ములేపాడు. ఫోర్లు, సిక్సర్లతో చెలరేగుతూ ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు. అశూ అన్న బ్యాటింగ్ మెరుపులకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.తమిళనాడు ప్రీమియర్ లీగ్-2024 సీజన్ జూలై 5న మొదలైంది. ఈ టీ20 టోర్నీలో దిండిగల్ డ్రాగన్స్ జట్టుకు అశ్విన్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు.అశూ సారథ్యంలో తొలి మ్యాచ్‌లో ట్రిచీ గ్రాండ్ చోళాస్ జట్టును ఓడించిన దిండిగల్ జట్టు.. తదుపరి మ్యాచ్‌లో సేలం స్పార్టాన్స్ చేతిలో ఓటమిపాలైంది. ఈ క్రమంలో చెపాక్ సూపర్ గిల్లీస్‌తో ఆదివారం తమ మూడో మ్యాచ్‌లో తలపడింది.కోయంబత్తూర్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన చెపాక్ జట్టు తొలుత బౌలింగ్ చేసింది. ఈ క్రమంలో శివం సింగ్(0)తో కలిసి ఓపెనింగ్ చేసిన అశూ ధనాధన్ దంచికొట్టాడు.అశూ పరుగుల విధ్వంసంకేవలం ఇరవై బంతుల్లోనే మూడు ఫోర్లు, నాలుగు సిక్సర్ల సాయంతో 45 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. అయితే, మిగతా వాళ్ల నుంచి అశ్విన్‌కు పెద్దగా సహకారం అందలేదు.ఇక ఈ మ్యాచ్‌కు వర్షం ఆటంకం కలిగించగా.. ఏడు ఓవర్లకు కుదించారు. ఈ క్రమంలో అశూ కెప్టెన్ ఇన్నింగ్స్ కారణంగా నిర్ణీత ఏడు ఓవర్లలో దిండిగల్ డ్రాగన్స్ ఆరు వికెట్లు నష్టపోయి 64 పరుగులు చేసింది.దిండిగల్ టీమ్‌కు తప్పని ఓటమిలక్ష్య ఛేదనకు దిగిన చెపాక్ సూపర్ గిల్లీస్ కేవలం 4.5 ఓవర్లలనే పని పూర్తి చేసింది. ఓపెనర్, వికెట్ కీపర్ నారాయణన్ జగదీశన్ 14 బంతుల్లోనే 32 పరుగులు చేయగా.. కెప్టెన్ బాబా అపరాజిత్ 14 బంతుల్లో 31 రన్స్ సాధించాడు.వీరిద్దరు కలిసి ఆడుతూ టార్గెట్‌ను ఛేదించగా.. దిండిగల్ జట్టు తొమ్మిది వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఫలితంగా అశూ కెప్టెన్ ఇన్నింగ్స్ వృథాగా పోయింది.అయితే, క్రీజులో ఉన్నంత సేపు అశ్విన్ ప్రత్యర్థి బౌలర్లపై దాడి చేయడం అభిమానులకు సంతోషాన్నిచ్చిది. అశూ ఇన్నింగ్స్ వీడియో తాజాగా వెలుగులోకి రాగా ఫ్యాన్స్ ఈ దృశ్యాలను షేర్ చేస్తున్నారు. ఇక దిండిగల్ తదుపరి బుధవారం ఐడ్రీమ్ తిరుపూర్ తమిళన్స్ జట్టుతో తలపడనుంది.ఎనిమిది జట్లు.. ప్రస్తుతం టాపర్‌గా లైకా కోవై కింగ్స్తమిళనాడు ప్రీమియర్ లీగ్-2024 ఎడిషన్‌లో ఎనిమిది జట్లు భాగమయ్యాయి. లైకా కోవై కింగ్స్ మూడింట మూడు గెలిచి పాయింట్ల పట్టికలో ప్రస్తుతం అగ్రస్థానంలో ఉంది.మిగిలిన స్థానాల్లో వరుసగా ట్రిచీ గ్రాండ్ చోళాస్(2 విజయాలు), చెపాక్ సూపర్ గిల్లీస్(2 విజయాలు), నెల్లై రాయల్ కింగ్స్(2 విజయాలు), ఐడ్రీమ్ తిరుపూర్ తమిళన్స్(1 విజయం), దిండిగల్ డ్రాగన్స్(1 విజయం), సేలం స్పార్టన్స్(1 విజయం), సీచం మధురై పాంథర్స్(1 విజయం) ఉన్నాయి.Captain. Opener. Top Scorer. 😎Ash Anna scored a thunderous 45* while the 7 other batters combined for just 21. MASS! 🔥#TNPLonFanCode @ashwinravi99 pic.twitter.com/RWac8GL60y— FanCode (@FanCode) July 15, 2024 -
టీఎన్‌పీఎల్ 2023 విజేత లైకా కోవై కింగ్స్.. వరుసగా రెండోసారి
నెలరోజుల పాటు క్రికెట్ ప్రేమికులను అలరించిన తమిళనాడు ప్రీమియర్(TNPL 2023) లీగ్‌లో లైకా కోవై కింగ్స్ విజేతగా నిలిచింది. బుధవారం రాత్రి జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో నెల్లయ్ రాయల్ కింగ్స్‌పై 104 పరుగుల తేడాతో భారీ విజయాన్ని సాధించిన లైకా కింగ్స్ వరుసగా రెండోసారి చాంపియన్‌గా నిలవడం విశేషం. తొలుత బ్యాటింగ్ చేసిన లైకా కోవై కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 205 పరుగుల భారీ స్కోరు చేసింది. సురేశ్ కుమార్(33 బంతుల్లో 57 పరుగులు), ముకిలేష్(40 బంతుల్లో 51 నాటౌట్) నిలకడగా ఆడగా.. చివర్లో అతీక్ ఉర్ రెహమాన్(21 బంతుల్లోనే 50 పరుగులు) మెరుపులు మెరిపించాడు. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన నెల్లయ్ రాయల్ కింగ్స్ 15 ఓవర్లలో 101 పరుగులకే కుప్పకూలింది. అరుణ్ కార్తిక్ 27 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. లక్ష్మేషా సుర్యప్రకాశ్ 22 పరుగులు చేశాడు. లైకా కోవై కింగ్స్ బౌలర్లలో జతదేవ్ సుబ్రమణ్యన్ నాలుగు వికెట్లు తీయగా.. కెప్టెన్ షారుక్ ఖాన్ మూడు, మణిమరన్ సిద్దార్థ్, గౌతమ్ కన్నన్, మహ్మద్‌లు తలా ఒక వికెట్ తీశారు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా జతదేవ్ సుబ్రమణ్యన్ నిలవగా.. ఆరెంజ్ క్యాప్‌ను నెల్లయ్ రాయల్ కింగ్స్ బ్యాటర్ అజితేశ్ గురుస్వామి(10 మ్యాచ్‌ల్లో 385 పరుగులు) గెలుచుకోగా.. పర్పుల్ క్యాప్‌ను లైకా కోవై కింగ్స్ కెప్టెన్ షారుక్ ఖాన్(9 మ్యాచ్‌ల్లో 17 వికెట్లు) అందుకున్నాడు. And the party🪇 mood starts!❤️#TNPL2023🏏#GethuKaatuvoma#sekkalisingamla#TNPLonstarsports#TNPLonfancode#NammaAatamAarambam💥#NammaOoruNammaGethu💪🏼 pic.twitter.com/ygqBBSACxg — TNPL (@TNPremierLeague) July 12, 2023 Lyca Kovai, Kings once again!#TNPLonFanCode pic.twitter.com/ALXkYMzChX — FanCode (@FanCode) July 12, 2023 చదవండి: #CarlosAlcaraz: 'నాన్నను నిందించొద్దు.. ప్రేమతో అలా చేశాడు; నాకు ఒరిగేదేం లేదు!' 'సూపర్‌మ్యాన్' సిరాజ్.. కళ్లు చెదిరే క్యాచ్‌తో మెరిశాడు -
షారుఖ్ ఖాన్ ఊచకోత.. మెరుపు ఆర్ధశతకం, బంతితోనూ మ్యాజిక్
తమిళనాడు ప్రీమియర్ లీగ్ 2023లో భాగంగా మధురై పాంథర్స్‌తో నిన్న (జులై 2) జరిగిన మ్యాచ్‌లో కోవై కింగ్స్ సారధి షారుఖ్ ఖాన్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో (53, 2/35) మెరిశాడు. ఫలితంగా అతని జట్టు కోవై కింగ్స్ 44 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. షారుఖ్ ఖాన్ ఊచకోత.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కోవై కింగ్స్.. సురేశ్ కుమార్ (29 బంతుల్లో 64; 6 ఫోర్లు, 4 సిక్సర్లు), సచిన్ (51 బంతుల్లో 67; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), షారుఖ్ ఖాన్ (23 బంతుల్లో 53; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు అర్ధశతకాలతో రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. ఇన్నింగ్స్ ఆరంభంలో సురేశ్ కుమార్, ఆఖర్లో షారుఖ్ ఖన్ రెచ్చిపోయి ఆడారు. ముఖ్యంగా షారుఖ్ ఖాన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. 20 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాదాడు. బంతితోనూ మెరిసిన షారుఖ్.. తొలుత బ్యాట్‌తో ఇరగదీసిన షారుఖ్ ఖాన్. ఆతర్వాత బంతితోనూ రాణించాడు. 209 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన మధురై పాంథర్స్‌ను షారుఖ్ ఖాన్ (2/35).. సిద్దార్థ్ (3/32), యుదీశ్వరన్ (2/16), సుబ్రమణ్యన్ (1/26), గౌతమ్ కన్నన్ (1/40) సాయంతో దెబ్బకొట్టాడు. ఫలితంగా మధురై పాంథర్స్ 18 ఓవర్లలో 164 పరుగులకే కుప్పకూలి, 44 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. పాంథర్స్ ఇన్నింగ్స్‌లో సురేశ్ లోకేశ్వర్ (41) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. -
ఐపీఎల్ కంటే 'ఆ' లీగ్‌లోనే అధిక మొత్తం.. గుజరాత్ టైటాన్స్ ప్లేయర్‌కు జాక్‌పాట్
TNPL 2023 Auction: ఐపీఎల్లో డిఫెండింగ్ ఛాంపియన్స్ గుజరాత్ టైటాన్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న తమిళనాడు ఆల్‌రౌండర్ సాయి సుదర్శన్ తమిళనాడు ప్రీమియర్ లీగ్ (TNPL 2023) వేలంలో జాక్‌పాట్ కొట్టాడు. మహాబలిపురంలో జరుగుతున్న లీగ్ తొలి వేలంలో సాయి సుదర్శన్‌ను లైకా కోవై కింగ్స్ 21.6 లక్షల రికార్డు ధరకు సొంతం చేసుకుంది. కోవై కింగ్స్ మొత్తం పర్స్ విలువ 70 లక్షలైతే.. ఒక్క సాయి సుదర్శన్పైనే ఆ జట్టు మూడో వంతు వెచ్చించడం చర్చనీయాంశంగా మారింది. ఇక్కడ మరో ఆసక్తికర విశేషమేమింటంటే.. TNPLలో సాయి సుదర్శన్‌కు లభించే మొత్తం, ఐపీఎల్లో అతనికి లభించే మొత్తం కంటే అధికంగా ఉండటం. సాయి సుదర్శన్‌ను 2022 ఐపీఎల్ వేలంలో గుజరాత్ టైటాన్స్ బేస్ ప్రైజ్ 20 లక్షలకు సొంతం చేసుకుంది. TNPL వేలంలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా రికార్డు నెలకొల్పిన సాయి సుదర్శన్.. 2022 ఐపీఎల్లో ఆకట్టుకున్నాడు. ఈ ప్రదర్శన కారణంగానే అతని కొరకు ఫ్రాంచైజీలు ఎగబడ్డాయి. గత ఐపీఎల్ సీజన్లో 5 మ్యాచ్‌లు ఆడిన సాయి.. 36.25 సగటున, 127.19 స్ట్రయిక్ రేట్‌తో ఓ హాఫ్ సెంచరీ (పంజాబ్ కింగ్స్‌పై 65*) సాయంతో 145 పరుగులు చేశాడు. రైట్ ఆర్మ్ లెగ్ బ్రేక్ బౌలర్ కూడా అయిన సాయి.. దేశవాలీ సీజన్లోనూ అద్భుతంగా రాణిస్తున్నాడు. ఇదిలా ఉంటే, ఇవాళ (ఫిబ్రవరి 23), రేపు జరిగే TNPL వేలంలో మొత్తం 942 మంది ఆటగాళ్లు (తమిళనాడుకు చెందిన వారు) తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఈ వేలంలో టీమిండియా స్టార్ క్రికెటర్లు దినేశ్ కార్తీక్, వాషింగ్టన్ సుందర్, టి నటరాజన్, వరుణ్ చక్రవర్తి, విజయ్ శంకర్ తదతరులు పాల్గొంటుండగా.. పెద్ద పేర్లలో రిటెన్షన్ చేసుకున్న ఏకైక ఆటగాడిగా రవిచంద్రన్ అశ్విన్ నిలిచాడు. దిండిగుల్ డ్రాగన్స్ ఫ్రాంచైజీ యాశ్ను 60 లక్షలకు రిటైన్ చేసుకుంది. వేలం ప్రారంభమైన కొద్ది నిమిషాల్లోనే ఐ డ్రీమ్ తిరుపూర్ తమిజాన్స్.. టీమిండియా ఆల్‌రౌండర్, త్రీడీ ప్లేయర్ విజయ్ శంకర్‌ను 10.25 లక్షల రికార్డు ధరకు సొంతం చేసుకోగా.. ప్రస్తుత భారత పరిమిత ఓవర్ల జట్టు సభ్యుడు వాషింగ్టన్ సుందర్‌ను మధురై పాంథర్స్ 6.75 లక్షలకు , మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిని దిండిగుల్ డ్రాగన్స్ 6.75 లక్షలకు, సంజయ్ యాదవ్‌ను చెపాక్ సూపర్ గిల్లీస్ 17.6 లక్షలకు, ఆల్‌రౌండర్ సోనూ యాదవ్‌ను నెల్లై రాయల్ కింగ్స్ 15.2 లక్షలకు, గుజరాత్ టైటాన్స్ ప్లేయర్ సాయి కిషోర్‌ను తిరుపూర్ తమిజాన్స్ 13 లక్షలకు సొంతం చేసుకున్నాయి. -
త్రీడీ ప్లేయర్ విజయ్ శంకర్‌కు భారీ ధర.. వాషింగ్టన్ సుందర్‌కు నామమాత్రపు రేట్
TNPL 2023 Auction: ప్రాంతీయ క్రికెట్ టోర్నీ అయిన తమిళనాడు ప్రీమియర్ లీగ్ సక్సెస్‌ఫుల్‌గా ఆరు ఎడిషన్లు పూర్తి చేసుకుని ఏడవ ఎడిషన్‌ను సిద్ధమవుతుంది. సీజన్ ప్రారంభానికి ముందు నిర్వహకులు తొలిసారి ఆటగాళ్ల వేలాన్ని నిర్వహిస్తున్నారు. ఇవాళ (ఫిబ్రవరి 23), రేపు జరుగబోయే ఈ వేలంలో మొత్తం 942 మంది ఆటగాళ్లు (తమిళనాడుకు చెందిన వారు) తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఈ వేలంలో టీమిండియా స్టార్ క్రికెటర్లు దినేశ్ కార్తీక్, వాషింగ్టన్ సుందర్, టి నటరాజన్, వరుణ్ చక్రవర్తి, విజయ్ శంకర్ తదతరులు పాల్గొంటుండగా.. పెద్ద పేర్లలో రిటెన్షన్ చేసుకున్న ఏకైక ఆటగాడిగా రవిచంద్రన్ అశ్విన్ నిలిచాడు. దిండిగుల్ డ్రాగన్స్ ఫ్రాంచైజీ యాశ్ను 60 లక్షలకు రిటైన్ చేసుకుంది. వేలం ప్రారంభమైన కొద్ది నిమిషాల్లోనే ఐ డ్రీమ్ తిరుపూర్ తమిజాన్స్.. టీమిండియా ఆల్‌రౌండర్, త్రీడీ ప్లేయర్ విజయ్ శంకర్‌ను 10.25 లక్షల రికార్డు ధరకు సొంతం చేసుకోగా.. ప్రస్తుత భారత పరిమిత ఓవర్ల జట్టు సభ్యుడు వాషింగ్టన్ సుందర్‌ను మధురై పాంథర్స్ 6.75 లక్షలకు , మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిని దిండిగుల్ డ్రాగన్స్ 6.75 లక్షలకు సొంతం చేసుకుంది. వేలంలో పై పేర్కొన్న ఆటగాళ్లు మాత్రమే కాకుండా ఇంకా చాలా మంది పేరున్న ఆటగాళ్లు ఉన్నారు. సాయ్ కిషోర్, సాయ్ సుదర్శన్, బాబా అపరాజిత్, బాబా ఇంద్రజిత్, మురుగన్ అశ్విన్.. ఇలా దేశవాలీ స్టార్లు చాలా మంది వేలంలో పాల్గొంటున్నారు. కాగా, ఈ వేలంలో ప్రతి జట్టు కనిష్టంగా 16 మందిని, గరిష్ఠంగా 20 మంది ఆటగాళ్లను ఎంపిక చేసుకోవాల్సి ఉంది. లీగ్‌లో పాల్గొనే 8 జట్లు ఇద్దరు ఇద్దరు ఆటగాళ్లను రిటైన్ చేసుకునే వెసులుబాటు ఉంది. ఫ్రాంచైజీల గరిష్ఠ పర్సు విలువ 70 లక్షలుగా నిర్ధారించారు. వేలంలో పాల్గొనే ఆటగాళ్లను నాలుగు కేటగిరీలు విభజించిన నిర్వహకులు.. ఏ కేటగిరి (అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన వారు) ఆటగాళ్లకు 10 లక్షలు, బి కేటగిరి (సీనియర్ బీసీసీఐ దేశవాలీ మ్యాచ్‌లు ఆడిన వారు) ఆటగాళ్లకు 6 లక్షలు, సి కేటగిరి (పై రెండు కేటగిరిల్లో లేకుండా, కనీసం 30 TNPL మ్యాచ్‌లు ఆడిన వారు) ఆటగాళ్లకు 3 లక్షలు, డి కేటగిరి (ఇతర ఆటగాళ్లు) ఆటగాళ్లకు 1.5 లక్షల చొప్పున బేస్ ప్రైస్ ఫిక్స్ చేశారు. ఆయా ఫ్రాంచైజీలు రిటైన్ చేసుకున్న ఆటగాళ్ల వివరాలు.. చేపక్ సూపర్ గిల్లీస్ (ఎన్ జగదీశన్) నెల్లై రాయల్ కింగ్స్ (అజితేశ్, కార్తీక్ మణకందన్) ఐ డ్రీమ్ తిరుపూర్ తమిజాన్స్ (తుషార్ రహేజా) లైకా రోవై కింగ్స్ (షారుక్ ఖాన్, సురేశ్ కుమార్) దిండిగుల్ డ్రాగన్స్ (రవిచంద్రన్ అశ్విన్) రూబీ త్రిచీ వారియర్స్ (ఆంటోనీ దాస్) సేలం స్పార్టన్స్ (గణేశ్ మూర్తి) మధురై పాంథర్స్ (గౌతమ్) -
TNPL 2022: క్రికెటర్ అసభ్యకర సంజ్ఞ.. ఛీ.. నీకసలు బుద్ధుందా? ఇంత దిగజారుతావా?
Tamilnadu Premier League-2022: తమిళనాడు ప్రీమియర్ లీగ్-2022 గురువారం(జూన్ 23) తిరునల్వేలి వేదికగా ఆరంభమైంది. ఇందులో భాగంగా చెపాక్ సూపర్ గిల్లీస్, నెలాయి రాయల్ కింగ్స్ మధ్య మొదటి మ్యాచ్ జరిగింది. ఇండియన్ సిమెంట్ కంపెనీ గ్రౌండ్లో జరిగిన ఈ టీ20 మ్యాచ్‌లో టాస్ గెలిచిన చెపాక్ జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకుంది. తీవ్ర ఉత్కంఠ.. టై ఈ క్రమంలో రాయల్ కింగ్స్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. ఇక లక్ష్య ఛేదనకు దిగిన చెపాక్ జట్టు కూడా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు నష్టపోయి 184 పరుగులే చేయడంతో మ్యాచ్ టై అయింది. దీంతో సూపర్ ఓవర్ నిర్వహించగా రాయల్ కింగ్స్ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో రాయల్స్ జట్టు బ్యాటర్ సంజయ్ యాదవ్ 47 బంతుల్లో 87 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. తద్వారా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు. అయితే, ఈ మ్యాచ్ సందర్భంగా చెపాక్ సూపర్ గిల్లీస్ ఓపెనర్ ఎన్. జగదీశన్ వ్యవహరించిన తీరు వివాదాస్పదమైంది. అతడిపై క్రికెట్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. రూల్స్ నచ్చకపోతే క్రికెట్ ఆడటం మానేసెయ్.. అంతేగానీ మరీ ఇంత దిగజారి ప్రవర్తించకు అంటూ ట్రోల్ చేస్తున్నారు. బుద్ధి ఉందా అసలు? కాగా ప్రత్యర్థి జట్టు ఆటగాడి పట్ల ఈ వికెట్ కీపర్ బ్యాటర్ వ్యవహరించిన తీరే ఇందుకు కారణం. చెపాక్ ఇన్నింగ్స్ సమయంలో 3.4వ ఓవర్లో బాబా అపరాజిత్ బౌలింగ్‌కు రాగా.. కౌశిక్ గాంధీ క్రీజులో ఉన్నాడు. అయితే, అపరాజిత్ బంతి వేయకముందే నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న జగదీశన్ క్రీజును వీడాడు. దీంతో అపరాజిత్ జగదీశన్ మన్కడింగ్ చేయడంతో రనౌట్‌గా అతడు వెనుదిరిగాడు. ఈ క్రమంలో తీవ్ర నిరాశకు లోనైన జగదీశన్ అసభ్యకర సంజ్ఞ చేస్తూ మైదానాన్ని వీడాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో మొదటి మ్యాచ్‌లోనే ఇలా వివాదానికి కారణమయ్యాడని, ఆటగాళ్ల పట్ల నువ్వు ఇలాగేనా ప్రవర్తించేది.. ముందు నిబంధనలు తెలుసుకుని ఆడు అంటూ నెటిజన్లు జగదీశన్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నీకసలు బుద్ది ఉందా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. అది రనౌటే! క్రికెట్ చట్టాలు చేసే మెరిల్‌బోన్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) మన్కడింగ్‌ను చట్టబద్ధం చేసిన విషయం తెలిసిందే. ఇది క్రికెట్లో రనౌట్! అంతేతప్ప క్రీడాస్ఫూర్తికి విరుద్ధమయ్యే మన్కడింగ్ కాదు. ఈ మేరకు ఎంసీసీ చేసిన పలు సవరణలను ఇటీవల అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) అమోదించింది. అయితే ఇవన్నీ ఈ ఏడాది అక్టోబర్ తర్వాతే అమల్లోకి రానున్నాయి. చదవండి: Manoj Tiwari: సెంచరీ చేశా.. అయినా 14 మ్యాచ్‌లకు పక్కనపెట్టారు.. ఇప్పుడున్న మేనేజ్మెంట్ గనుక ఉండి ఉంటే! TNPL 2022: 38 ఏళ్ల వయసులో క్రికెట్లోకి రీఎంట్రీ ఇస్తున్న భారత ఆటగాడు..! A royal comeback from the @NRKTNPL ! Watch Shriram Capital TNPL on @StarSportsTamil & @StarSportsIndia Also, streaming live for free, only on @justvoot ! Download the app now! #NammaOoruNammaGethu#TNPL2022#VootonTNPL#TNPLonVoot#TNPLonStarSportsTamil#CSGvsNRK pic.twitter.com/onCAfd4z58 — TNPL (@TNPremierLeague) June 23, 2022 🤐🤐🤐🤐 @Jagadeesan_200 @aparajithbaba senior players of tn🤐🤐🤐 pic.twitter.com/C9orMqRPL3 — Jayaselvaa ᅠ (@jayaselvaa1) June 23, 2022 -
38 ఏళ్ల వయసులో క్రికెట్లోకి రీఎంట్రీ ఇస్తున్న భారత ఆటగాడు..!
టీమిండియా వెటరన్ ఆటగాడు మురళీ విజయ్ దాదాపు రెండేళ్ల తర్వాత క్రికెట్లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. తమిళనాడు ప్రీమియర్ లీగ్‌లో రూబీ ట్రిచీ వారియర్స్ తరపున ఆడేందుకు విజయ్ సిద్దమయ్యాడు. తమిళనాడు ప్రీమియర్ లీగ్-2022 తిరునెల్వేలి వేదికగా జాన్ 23న ప్రారంభమైంది. కాగా విజయ్ చివరగా ఐపీఎల్-2020 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడాడు. తర్వాత అతడు పూర్తిగా క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. ఈ క్రమంలో తన రీ ఎంట్రీపై విజయ్ తాజాగా స్పందించాడు. “నేను వీలైనంత ఎక్కువ కాలం క్రికెట్ ఆడాలనుకుంటున్నాను. నేను యువకులతో కలిసి ఆడబోతున్నాను. వారంతా నా కుటంబం. కాబట్టి నా అనుభావాన్ని వాళ్లతో పంచుకుని ముందుకు నడిపించాలి అనుకుంటున్నాను. నేను ప్రస్తుతం ఫిట్‌గా ఉన్నాను. నా జట్టు, తమిళనాడు ప్రీమియర్ లీగ్ కోసం నా వంతు కృషి చేస్తాను" అని విజయ్ పేర్కొన్నాడు. ఇక 2008లో టీమిండియా తరుపున ఆరంగ్రేటం చేసిన మురళీ విజయ్, 2018లో ఆస్ట్రేలియాపై చివరి టెస్టు ఆడాడు. చదవండి: IND vs LEI: రాణించిన శ్రీకర్ భరత్.. టీమిండియా స్కోర్: 246/8 -
‘ధోని-కోహ్లిలను కలిసే ధైర్యం చేయరు’
ముంబై : భారత క్రికెట్లో ఫిక్సింగ్ భూతం మరోసారి అలజడి రేపింది. గత మూడేళ్లుగా అత్యంత విజయవంతమైన టోర్నీగా పేరుగాంచిన తమిళనాడు ప్రీమియర్ లీగ్‌లో కొందరు ఫస్ట్ క్లాస్ క్రికెటర్లతో పాటు ఇద్దరు కోచ్‌లు ఫిక్సింగ్‌కు పాల్పడ్డారని బీసీసీఐ అవినీతి నిరోధక విభాగం (ఏసీయూ) విచారణలో తేలింది. అయితే అంతర్జాతీయ క్రికెటర్ కూడా ఈ ఫిక్సింగ్ ఉన్నట్లు అనేక వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో ఏసీయూ చీఫ్ అజిత్ సింగ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘బుకీలు ఎప్పుడూ సులువైన మార్గాన్నే ఎంచుకుంటారు. ఎవరు ఈజీగా ట్రాప్‌లో పడతారో వారినే వెతుక్కుంటారు. అంతేకాని ధోని, కోహ్లి వంటి దిగ్గజాలను, క్రికెట్ పట్ల అంకితాభావం ఉన్నవారిని సంప్రదించే ధైర్యం చేయరు. ఎందుకంటే వారిని కలిస్తే ఏమవుతుందో బుకీలకు తెలుసు. వారిని కలిసి సమయం వృథా చేసుకోవడం కంటే డబ్బులు, మాయ మాటలకు(జాతీయ జట్టులో ఆడే అవకాశం కల్పిస్తాం) లొంగే ఆటగాళ్లను బుకీలు ఎంచుకుంటారు. ఓ స్థాయి క్రికెటర్ ఫిక్సింగ్‌కు పాల్పడి తమకున్న మంచి పేరును చెడగొట్టుకోరు. బుకీలు తమకు ఏ టోర్నీ సౌలభ్యంగా ఉంటుందో అక్కడికే వెళతారు. ఇక్కడ(భారత్‌లో) సాధ్యం కాకుంటే విదేశీ టోర్నీలపై దృష్టి పెడతారు. ఫిక్సింగ్‌లో కోచ్ పాత్ర గురించి.. గతంలో ఐపీఎల్లో చెడ్డ పేరు తెచ్చుకున్న ఫ్రాంచైజీతో కూడా ఆ కోచ్ కలిసి పని చేశాడు. ఆ తర్వాత ఒక రంజీ టీమ్‌కు కూడా కోచ్‌గా వ్యవహరించాడు. కనీసం ఫస్ట్‌క్లాస్ క్రికెట్ కూడా ఆడని అతను ఐపీఎల్ సహాయక సిబ్బందిలో ఎలా అవకాశం దక్కించుకున్నాడో, టీఎన్‌పీఎల్‌తో ఎలా జత కలిశాడో కూడా కూడా ఆశ్చర్యకరం. ఈ వివాదంలో అంతర్జాతీయ క్రికెటర్లు ఎవరూ లేరు’ అని అజిత్ సింగ్ స్పష్టం చేశారు. -
టీఎన్‌పీఎల్‌లో ఫిక్సింగ్!
న్యూఢిల్లీ: మూడేళ్లలో అత్యంత విజయవంతమైన క్రికెట్ టోరీ్నగా పేరు తెచ్చుకున్న తమిళనాడు ప్రీమియర్ లీగ్ (టీఎన్‌పీఎల్)లో మ్యాచ్ ఫిక్సింగ్ వివాదం అలజడి రేపింది. బీసీసీఐ అవినీతి నిరోధక విభాగం (ఏసీయూ) విచారణలో ఈ విషయం బయటపడినట్లు సమాచారం. కొందరు ఫస్ట్ క్లాస్ క్రికెటర్లతో పాటు ఇద్దరు కోచ్‌లు కూడా ఫిక్సింగ్‌లో భాగంగా ఉన్నారని తెలుస్తోంది. 2016లో ప్రారంభమైన టీఎన్‌పీఎల్‌ను ఎనిమిది ఫ్రాంచైజీ జట్లతో నిర్వహిస్తున్నారు. ప్రస్తుతానికి ఎవరి పేర్లూ బయటపడకపోయినా... ఒక జట్టు విషయంలో మాత్రం సందేహాలున్నాయి. ‘టీఎన్‌పీఎల్‌లో ఆ జట్టు చివరి మూడు స్థానాల్లో ఒకటిగా నిలిచింది. ఆ జట్టు యాజమాన్యం నిర్వహణా శైలి, వారి ఆటగాళ్లు, కోచ్‌ల ఎంపిక కూడా అనుమానాస్పదంగా ఉన్నాయి’ అని బీసీసీఐ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. ముఖ్యంగా ఒక కోచ్ పాత్ర గురించి బోర్డు ప్రత్యేకంగా విచారిస్తోంది. ‘గతంలో ఐపీఎల్లో చెడ్డ పేరు తెచ్చుకున్న ఫ్రాంచైజీతో కూడా ఆ కోచ్ కలిసి పని చేశాడు. ఆ తర్వాత ఒక రంజీ టీమ్‌కు కూడా కోచ్‌గా వ్యవహరించాడు. కనీసం ఫస్ట్‌క్లాస్ క్రికెట్ కూడా ఆడని అతను ఐపీఎల్ సహాయక సిబ్బందిలో ఎలా అవకాశం దక్కించుకున్నాడో, టీఎన్‌పీఎల్‌తో ఎలా జత కలిశాడో కూడా కూడా ఆశ్చర్యకరం’ అని ఆయన చెప్పారు. మరో వైపు ఈ వివాదంలో అంతర్జాతీయ క్రికెటర్లు ఎవరూ లేరని ఏసీయూ చీఫ్ అజిత్ సింగ్ స్పష్టం చేశారు. ఒక భారత క్రికెటర్ ఉన్నాడంటూ తమకు కొన్ని వాట్సప్ మెసేజ్‌లు వచ్చాయంటూ కొందరు ఆటగాళ్లు తమ విచారణలో వెల్లడించారని... ఆయా సందేశాలను తాము పరిశీలిస్తున్నట్లు ఆయన వివరించారు. మహిళల క్రికెట్లోనూ.. భారత మహిళల క్రికెట్ జట్టు సభ్యురాలు ఒకరిని కూడా మ్యాచ్ ఫిక్సింగ్‌లోకి దించేందుకు బుకీలు ప్రయతి్నంచినట్లు తెలిసింది. ఈ ఏడాది ఆరంభంలో స్వదేశంలో ఇంగ్లండ్‌తో సిరీస్‌కు ముందు బెంగళూరులో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే సదరు క్రికెటర్ వెంటనే బీసీసీఐ ఏసీయూకు సమాచారం అందించింది. దీనికి సంబంధించి సోమవారం బెంగళూరులో ఇద్దరు వ్యక్తులపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. వీరిలో జితేంద్ర కొఠారి ముందుగా తనను తాను స్పోర్ట్స్ మేనేజర్‌గా చెప్పుకొని మహిళా క్రికెటర్లతో పరిచయం పెంచుకున్నాడు. ఆ తర్వాత తన మిత్రుడంటూ రాకేశ్ బాఫ్నా అనే వ్యక్తిని ముందుకు తీసుకొచ్చాడు. ఫిక్సింగ్ చేయాలంటూ మహిళా క్రికెటర్ ముందు ఇదే బాఫ్నా ప్రతిపాదన తీసుకొచ్చాడని పోలీసులు వెల్లడించారు. వీరిద్దరిపై నాలుగు వేర్వేరు సెక్షన్ల కింద కేసు నమోదైంది. అయితే ఈ భారత మహిళా క్రికెటర్ ఎవరనేది బయటకు రాలేదు. -
హవ్వా.. అదేం బౌలింగ్ అశ్విన్!
చెన్నై: ఐపీఎల్లో ‘మన్కడింగ్’తో వివాదం రేపిన ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మరోసారి వార్తల్లో నిలిచాడు. వికెట్లు తీసేందుకు మైదానంలో రకరకాల విన్యాసాలు చేసే అశ్విన్.. తమిళనాడు ప్రీమియర్ లీగ్(టీఎన్‌పీఎల్)లో కొత్త ట్రిక్‌తో క్రికెట్ అభిమానులను విస్మయానికి గురిచేశాడు. శుక్రవారం జరిగిన టీఎన్‌పీఎల్ ఓపెనింగ్ మ్యాచ్‌లో దిందిగల్ డ్రాగన్స్(డీడీ)తో చెపాక్ సూపర్ గిల్లీస్ జట్టు తలపడింది. ఈ మ్యాచ్‌లో గిల్లీస్ టీమ్‌పై డ్రాగన్స్ జట్టు 10 పరుగుల తేడాతో గెలిచింది. చెపాక్ సూపర్ గిల్లీస్ చివరి 2 బంతులకు 17 చేయాల్సివుండగా డీడీ కెప్టెన్ అశ్విన్ విచిత్రంగా బంతిని విసిరి అందరినీ ఆశ్చర్యంతో ముంచెత్తాడు. ముందు చేతిని ఉపయోగించకుండా, రాంగ్ ఫుట్‌తో అతడు బంతిని విసిరాడు. అశ్విన్ విన్యాసంపై సోషల్ మీడియాలో క్రికెట్ అభిమానులు వ్యంగ్యాస్త్రాలు విసురుతున్నారు. గెలుపు కోసం అడ్డదారులు తొక్కుతావా అంటూ ప్రశ్నిస్తున్నారు. ముందుగా బ్యాటింగ్ చేసిన దిందిగల్ డ్రాగన్స్ 20 ఓవర్లలో 9 వికెట్లు నష్టపోయి 115 పరుగులు చేసింది. కెప్టెన్ అశ్విన్ 19 బంతుల్లో 5 ఫోర్లు, సిక్సర్‌తో 37 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. చెపాక్ సూపర్ గిల్లీస్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 105 పరుగులే చేసింది. కాగా, ఐపీఎల్లో రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో జోస్ బట్లర్‌ను కింగ్స్ పంజాబ్ కెప్టెన్ అశ్విన్ మన్కడింగ్ ద్వారా ఔట్ చేయడం తీవ్ర దుమారం రేపిన సంగతి క్రికెట్ అభిమానులకు గుర్తుండే ఉంటుంది. (చదవండి: అశ్విన్ తప్పు చేశాడా!) What's Ashwin doing 😂 https://t.co/9RwED0mQSq — Gurdeep (@gurdeep0701) July 19, 2019 -
బెజవాడ బాద్షాస్...కడప కింగ్స్!
సాక్షి, హైదరాబాద్: తమిళనాడు ప్రీమియర్ లీగ్, కర్ణాటక ప్రీమియర్ లీగ్‌లు విజయవంతం కావడంతో ఇప్పుడు వేర్వేరు రాష్ట్ర క్రికెట్ సంఘాలు సొంత లీగ్‌కు సై అంటున్నాయి. ఈ జాబితాలో తాజాగా ఆంధ్ర క్రికెట్ సంఘం (ఏసీఏ) చేరింది. ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్) పేరుతో ఏసీఏ టి20 టోర్నీ నిర్వహించాలని నిర్ణయించింది. ఈ ఏడాది డిసెంబర్, 2018 జనవరి మధ్యలో ఈ టోర్నమెంట్ జరుగుతుంది. జిల్లాల్లోని ప్రతిభావంతులైన ఆటగాళ్లను గుర్తించే లక్ష్యంతో తీసుకొస్తున్న ఈ టి20 లీగ్‌కు ‘యువర్ టైమ్ ఈజ్ నౌ’ అనే ట్యాగ్‌లైన్‌ను జోడించారు. ఏపీఎల్ నిర్వహణ, ఆదాయ మార్గాలు, ఇతర సాంకేతిక అంశాలకు సంబంధించి రెడ్మూన్ క్రియేటివ్ అనే సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. టోర్నీకి సంబంధించిన అన్ని అంశాలను రెడ్మూన్ సంస్థే పర్యవేక్షిస్తుంది. ఈ లీగ్‌లో ఆరు జట్లు బరిలోకి దిగుతాయి. బెజవాడ బాద్షాస్, గోదావరి జాగ్వార్స్, గుంటూరు మిర్చీస్, కడప కింగ్స్, నెల్లూరు లయన్స్, వైజాగ్స్ వేల్స్ అనే పేర్లతో ఈ జట్లు బరిలోకి దిగుతాయి. -
తొలి టీఎన్‌పీఎల్ విజేత పేట్రియాట్స్
చెన్నై: మొదటి సారి నిర్వహించిన తమిళనాడు ప్రీమియర్ లీగ్ (టీఎన్‌పీఎల్)లో ఆల్బర్ట్ ట్యుటి పేట్రియాట్స్ విజేతగా నిలిచింది. ఆదివారం చిదంబరం స్టేడియంలో జరిగిన ఫైనల్లో పేట్రియాట్స్ 122 పరుగుల భారీ తేడాతో చేపాక్ సూపర్ గిల్లీస్‌పై ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పేట్రియాట్స్ 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 215 పరుగులు చేసింది. అభినవ్ ముకుంద్ (52 బంతుల్లో 82 నాటౌట్; 12 ఫోర్లు, 1 సిక్స్), కౌశిక్ గాంధీ (43 బంతుల్లో 59; 6 ఫోర్లు, 2 సిక్సర్లు), దినేశ్ కార్తీక్ (26 బంతుల్లో 55; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) అర్ధ సెంచరీలతో చెలరేగారు. అనంతరం గిల్లీస్ 18.5 ఓవర్లలో 93 పరుగులకే కుప్పకూలింది. శరవణన్ (30) టాప్ స్కోరర్. ఇన్నింగ్స తొలి ఓవర్లోనే పేట్రియాట్ లెఫ్టార్మ్ స్పిన్నర్ గణేశ్ మూర్తి ’హ్యాట్రిక్’ సహా నాలుగు వికెట్లు పడగొట్టడం విశేషం. సున్నా పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన గిల్లీస్ జట్టు ఆ తర్వాత కోలుకోలేకపోయింది. మరో వైపు 30 ఏళ్ల క్రితం ఇదే మైదానంలో భారత్, ఆస్ట్రేలియా మధ్య చరిత్రాత్మక ’టై’ టెస్టులో భాగమైన ఇరు జట్ల క్రికెటర్లు కొందరిని ఫైనల్ సందర్భంగా తమిళనాడు క్రికెట్ సంఘం అధ్యక్షుడు ఎన్. శ్రీనివాసన్ సత్కరించారు.