
తమిళనాడు ప్రీమియర్ లీగ్ (టిఎన్‌పిఎల్)-2024లో దిండిగల్ డ్రాగన్స్ కెప్టెన్, టీమిండియా వెటరన్ రవిచంద్రన్ అశ్విన్ తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. శుక్రవారం ఐడ్రీమ్ తిరుప్పూర్ తమిజన్స్‌తో జరిగిన క్వాలిఫియర్-2లో అశ్విన్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 109 పరుగుల స్వల్ప లక్ష్య చేధనలో ఓపెనర్‌గా వచ్చిన అశ్విన్.. ప్రత్యర్ధి బౌలర్లను ఊచకోత కోశాడు.
కేవలం 30 బంతులు ఎదుర్కొన్న అశ్విన్.. 11 ఫోర్లు, 3 సిక్స్‌లతో 69 పరుగులు చేశాడు. అతడి విధ్వంసకర ఇన్నింగ్స్ ఫలితంగా స్వల్ప లక్ష్యాన్ని దిండిగల్ కేవలం 10.5 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి చేధించింది. అశ్విన్‌తో పాటు మరో ఓపెనర్ విమల్ కుమార్ 28 పరుగులతో రాణించాడు.
తొలుత బ్యాటింగ్ చేసిన ఐడ్రీమ్ తిరుప్పూర్ జట్టు దిండిగల్ బౌలర్లు చెలరేగడంతో 108 పరుగులకే కుప్పకూలింది. తిరుప్పూర్ బ్యాటర్లలో మన్ భప్నా(26) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. దిండిగల్ బౌలర్లలో పి విగ్నేష్ 3 వికెట్లు పడగొట్టగా.. సుభాత్ భాటీ, వరుణ్ చక్రవర్తి తలా రెండు వికెట్లు సాధించారు. ఇక ఈ విజయంతో దిండిగల్ డ్రాగన్స్ ఫైనల్లో అడుగుపెట్టింది. ఆదివారం జరగనున్న ఫైనల్లో లైకా కోవై కింగ్స్‌తో దిండిగల్ డ్రాగన్స్ తలపడనుంది.
Ravi Ashwin in the TNPL knockouts:
Eliminator:
57 (35) - won POTM award.
Qualifier:
69* (30) & 1/27 - won POTM award.
- Ashwin, the All Rounder. 🥶pic.twitter.com/lQE48sJKnR— Mufaddal Vohra (@mufaddal_vohra) August 3, 2024