TNPL 2023 Auction: ప్రాంతీయ క్రికెట్ టోర్నీ అయిన తమిళనాడు ప్రీమియర్ లీగ్ సక్సెస్‌ఫుల్‌గా ఆరు ఎడిషన్లు పూర్తి చేసుకుని ఏడవ ఎడిషన్‌ను సిద్ధమవుతుంది. సీజన్ ప్రారంభానికి ముందు నిర్వహకులు తొలిసారి ఆటగాళ్ల వేలాన్ని నిర్వహిస్తున్నారు. ఇవాళ (ఫిబ్రవరి 23), రేపు జరుగబోయే ఈ వేలంలో మొత్తం 942 మంది ఆటగాళ్లు (తమిళనాడుకు చెందిన వారు) తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
ఈ వేలంలో టీమిండియా స్టార్ క్రికెటర్లు దినేశ్ కార్తీక్, వాషింగ్టన్ సుందర్, టి నటరాజన్, వరుణ్ చక్రవర్తి, విజయ్ శంకర్ తదతరులు పాల్గొంటుండగా.. పెద్ద పేర్లలో రిటెన్షన్ చేసుకున్న ఏకైక ఆటగాడిగా రవిచంద్రన్ అశ్విన్ నిలిచాడు. దిండిగుల్ డ్రాగన్స్ ఫ్రాంచైజీ యాశ్‌ను 60 లక్షలకు రిటైన్ చేసుకుంది.
వేలం ప్రారంభమైన కొద్ది నిమిషాల్లోనే ఐ డ్రీమ్ తిరుపూర్ తమిజాన్స్.. టీమిండియా ఆల్‌రౌండర్, త్రీడీ ప్లేయర్ విజయ్ శంకర్‌ను 10.25 లక్షల రికార్డు ధరకు సొంతం చేసుకోగా.. ప్రస్తుత భారత పరిమిత ఓవర్ల జట్టు సభ్యుడు వాషింగ్టన్ సుందర్‌ను మధురై పాంథర్స్ 6.75 లక్షలకు , మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిని దిండిగుల్ డ్రాగన్స్ 6.75 లక్షలకు సొంతం చేసుకుంది.
వేలంలో పై పేర్కొన్న ఆటగాళ్లు మాత్రమే కాకుండా ఇంకా చాలా మంది పేరున్న ఆటగాళ్లు ఉన్నారు. సాయ్ కిషోర్, సాయ్ సుదర్శన్, బాబా అపరాజిత్, బాబా ఇంద్రజిత్, మురుగన్ అశ్విన్.. ఇలా దేశవాలీ స్టార్లు చాలా మంది వేలంలో పాల్గొంటున్నారు.
కాగా, ఈ వేలంలో ప్రతి జట్టు కనిష్టంగా 16 మందిని, గరిష్ఠంగా 20 మంది ఆటగాళ్లను ఎంపిక చేసుకోవాల్సి ఉంది. లీగ్‌లో పాల్గొనే 8 జట్లు ఇద్దరు ఇద్దరు ఆటగాళ్లను రిటైన్ చేసుకునే వెసులుబాటు ఉంది. ఫ్రాంచైజీల గరిష్ఠ పర్సు విలువ 70 లక్షలుగా నిర్ధారించారు.
వేలంలో పాల్గొనే ఆటగాళ్లను నాలుగు కేటగిరీలు విభజించిన నిర్వహకులు.. ఏ కేటగిరి (అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన వారు) ఆటగాళ్లకు 10 లక్షలు, బి కేటగిరి (సీనియర్ బీసీసీఐ దేశవాలీ మ్యాచ్‌లు ఆడిన వారు) ఆటగాళ్లకు 6 లక్షలు, సి కేటగిరి (పై రెండు కేటగిరిల్లో లేకుండా, కనీసం 30 TNPL మ్యాచ్‌లు ఆడిన వారు) ఆటగాళ్లకు 3 లక్షలు, డి కేటగిరి (ఇతర ఆటగాళ్లు) ఆటగాళ్లకు 1.5 లక్షల చొప్పున బేస్ ప్రైస్ ఫిక్స్ చేశారు.
ఆయా ఫ్రాంచైజీలు రిటైన్ చేసుకున్న ఆటగాళ్ల వివరాలు..
చేపక్ సూపర్ గిల్లీస్ (ఎన్ జగదీశన్)
నెల్లై రాయల్ కింగ్స్ (అజితేశ్, కార్తీక్ మణకందన్)
ఐ డ్రీమ్ తిరుపూర్ తమిజాన్స్ (తుషార్ రహేజా)
లైకా రోవై కింగ్స్ (షారుక్ ఖాన్, సురేశ్ కుమార్)
దిండిగుల్ డ్రాగన్స్ (రవిచంద్రన్ అశ్విన్)
రూబీ త్రిచీ వారియర్స్ (ఆంటోనీ దాస్)
సేలం స్పార్టన్స్ (గణేశ్ మూర్తి)
మధురై పాంథర్స్ (గౌతమ్)
Comments
Please login to add a commentAdd a comment