టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ స్పెషలిస్ట్ బ్యాటర్లకు ఏమాత్రం తీసిపోని విధంగా మారాడు. తమిళనాడు ప్రీమియర్ లీగ్ 2024 ఎడిషన్‌లో యాష్ బ్యాట్‌తో మెరుపు విన్యాసాలు చేశాడు. ఈ టోర్నీలో అశ్విన్ సారథ్యంలో దిండిగుల్ డ్రాగన్స్ ఛాంపియన్‌గా అవతరించింది. డ్రాగన్స్ ఛాంపియన్‌గా అవతరించడంలో అశ్విన్ ప్రధానపాత్ర పోషించాడు. అశ్విన్.. డ్రాగన్స్ విజయాల్లో బంతితో కాంట్రిబ్యూట్ చేశాడనుకుంటే పొరపాటే. అశ్విన్ తనలోని బ్యాటింగ్ నైపుణ్యాన్ని వెలికితీసి డ్రాగన్స్‌ను ఛాంపియన్‌గా నిలబెట్టాడు.
కీలకమైన ఎలిమినేటర్, క్వాలిఫయర్-1, ఫైనల్ మ్యాచ్‌ల్లో అశ్విన్ మెరుపు అర్దసెంచరీలు చేశాడు. ఎలిమినేటర్ మ్యాచ్‌లో 35 బంతుల్లో 57 పరుగులు చేసిన యాష్.. క్వాలిఫయర్-2లో 30 బంతుల్లో అజేయమైన 69 పరుగులు.. ఫైనల్లో 46 బంతుల్లో 52 పరుగులు చేసి డ్రాగన్స్ విజయాల్లో కీలకపాత్ర పోషించాడు.
అశ్విన్ అంతర్జాతీయ వేదికపై కూడా పలు సందర్భాల్లో బ్యాట్‌తో విన్యాసాలు చేశాడు. టెస్ట్‌ల్లో అయితే యాష్ పేరిట ఐదు సెంచరీలు ఉన్నాయి. ఐపీఎల్‌లోనూ అశ్విన్ పలు సందర్భాల్లో మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడాడు. 37 ఏళ్ల వయసులో అశ్విన్ అటతీరు చూసిన వారు ఔరా అంటున్నారు. అశ్విన్ బ్యాట్‌తో ఇదే తరహాలో రెచ్చిపోతే భారత టీ20 జట్టుకు ఎంపిక కావడం ఖాయమని అంటున్నారు.
బ్యాట్‌తో రాణించాడని అశ్విన్ బౌలింగ్‌ను లైట్‌గా తీసుకోలేదు. తమిళనాడు ప్రీమియర్ లీగ్‌లో అతను బంతితోనూ రాణించాడు. ఎలిమినేటర్ మ్యాచ్‌లో 4 ఓవర్లలో 33 పరుగులు.. క్వాలిఫయర్-2లో నాలుగో ఓవర్లలో 27 పరుగులు (ఒక వికెట్).. ఫైనల్లో అత్యంత పొదుపుగా బౌలింగ్ చేసి నాలుగు ఓవర్లలో కేవలం 13 పరుగులు మాత్రమే ఇచ్చాడు.
కాగా, తమిళనాడు ప్రీమియర్ లీగ్ ఫైనల్లో దిండిగుల్ డ్రాగన్స్.. లైకా కోవై కింగ్స్‌పై 6 వికెట్ల తేడాతో గెలుపొంది టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో బ్యాట్‌తో, బంతితో సత్తా చాటిన అశ్విన్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. ఫైనల్లో తొలుత బ్యాటింగ్ చేసిన కోవై కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 129 పరుగులు మాత్రమే చేయగా.. డ్రాగన్స్ 18.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి విజేతగా అవతరించింది.
Comments
Please login to add a commentAdd a comment