టీమిండియా వెటరన్ ఆటగాడు మురళీ విజయ్ దాదాపు రెండేళ్ల తర్వాత క్రికెట్‌లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. తమిళనాడు ప్రీమియర్ లీగ్‌లో రూబీ ట్రిచీ వారియర్స్ తరపున ఆడేందుకు విజయ్ సిద్దమయ్యాడు. తమిళనాడు ప్రీమియర్ లీగ్-2022 తిరునెల్వేలి వేదికగా జాన్ 23న ప్రారంభమైంది. కాగా విజయ్ చివరగా ఐపీఎల్-2020 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడాడు. తర్వాత అతడు పూర్తిగా క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. ఈ క్రమంలో తన రీ ఎంట్రీపై విజయ్ తాజాగా స్పందించాడు.
“నేను వీలైనంత ఎక్కువ కాలం క్రికెట్ ఆడాలనుకుంటున్నాను. నేను యువకులతో కలిసి ఆడబోతున్నాను. వారంతా నా కుటంబం. కాబట్టి నా అనుభావాన్ని వాళ్లతో పంచుకుని ముందుకు నడిపించాలి అనుకుంటున్నాను. నేను ప్రస్తుతం ఫిట్‌గా ఉన్నాను. నా జట్టు, తమిళనాడు ప్రీమియర్ లీగ్ కోసం నా వంతు కృషి చేస్తాను" అని విజయ్ పేర్కొన్నాడు. ఇక 2008లో టీమిండియా తరుపున ఆరంగ్రేటం చేసిన మురళీ విజయ్, 2018లో ఆస్ట్రేలియాపై చివరి టెస్టు ఆడాడు.
చదవండి: IND vs LEI: రాణించిన శ్రీకర్ భరత్.. టీమిండియా స్కోర్: 246/8
Comments
Please login to add a commentAdd a comment