తమిళనాడు ప్రీమియర్ లీగ్ 2023లో భాగంగా మధురై పాంథర్స్‌తో నిన్న (జులై 2) జరిగిన మ్యాచ్‌లో కోవై కింగ్స్ సారధి షారుఖ్ ఖాన్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో (53, 2/35) మెరిశాడు. ఫలితంగా అతని జట్టు కోవై కింగ్స్ 44 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
షారుఖ్ ఖాన్ ఊచకోత..
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కోవై కింగ్స్.. సురేశ్ కుమార్ (29 బంతుల్లో 64; 6 ఫోర్లు, 4 సిక్సర్లు), సచిన్ (51 బంతుల్లో 67; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), షారుఖ్ ఖాన్ (23 బంతుల్లో 53; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు అర్ధశతకాలతో రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. ఇన్నింగ్స్ ఆరంభంలో సురేశ్ కుమార్, ఆఖర్లో షారుఖ్ ఖన్ రెచ్చిపోయి ఆడారు. ముఖ్యంగా షారుఖ్ ఖాన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. 20 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాదాడు.
బంతితోనూ మెరిసిన షారుఖ్..
తొలుత బ్యాట్‌తో ఇరగదీసిన షారుఖ్ ఖాన్. ఆతర్వాత బంతితోనూ రాణించాడు. 209 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన మధురై పాంథర్స్‌ను షారుఖ్ ఖాన్ (2/35).. సిద్దార్థ్ (3/32), యుదీశ్వరన్ (2/16), సుబ్రమణ్యన్ (1/26), గౌతమ్ కన్నన్ (1/40) సాయంతో దెబ్బకొట్టాడు. ఫలితంగా మధురై పాంథర్స్ 18 ఓవర్లలో 164 పరుగులకే కుప్పకూలి, 44 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. పాంథర్స్ ఇన్నింగ్స్‌లో సురేశ్ లోకేశ్వర్ (41) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
Comments
Please login to add a commentAdd a comment