సాయి సుదర్శన్‌ సుడిగాలి శతకం.. సిక్సర్ల వర్షం | Sai Sudharsan Slams Second Fastest Century In Tamil Nadu Premier League | Sakshi
Sakshi News home page

సాయి సుదర్శన్‌ సుడిగాలి శతకం.. సిక్సర్ల వర్షం

Published Wed, Jul 31 2024 10:16 AM | Last Updated on Wed, Jul 31 2024 10:38 AM

Sai Sudharsan Slams Second Fastest Century In Tamil Nadu Premier League

తమిళనాడు ప్రీమియర్‌ లీగ్‌ 2024లో లైకా కోవై కింగ్స్‌ ఫైనల్స్‌కు చేరింది. నిన్న (జులై 30) జరిగిన క్వాలిఫయర్‌-1లో ఆ జట్టు ఐ డ్రీమ్‌ తిరుప్పూర్‌ తమిఝాన్స్‌పై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. సాయి సుదర్శన్‌ సుడిగాలి శతకంతో (56 బంతుల్లో 123 నాటౌట్‌; 9 ఫోర్లు, 9 సిక్సర్లు) కోవై కింగ్స్‌ను విజయతీరాలకు చేర్చాడు. సాయి సుదర్శన కేవలం 48 బంతుల్లో శతక్కొట్టాడు. తమిళనాడు ప్రీమియర్‌ లీగ్‌లో ఇది రెండో వేగవంతమైన శతకం.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన తిరుప్పూర్‌.. అమిత్‌ సాత్విక్‌ (67), తుషార్‌ రహేజా (55), మొహమ్మద్‌ అలీ (45 నాటౌట్‌) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. ఛేదనలో కోవై కింగ్స్‌ తొలి బంతికే వికెట్‌ కోల్పోయినప్పటికీ సాయి సుదర్శన్‌ చెలరేగడంతో 18.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. సాయి సుదర్శన్‌తో పాటు ముకిలేశ్‌ (48 నాటౌట్‌) బ్యాట్‌ ఝులిపించాడు. 

కాగా, ఇవాళ (జులై 31) జరిగే ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో చెపాక్‌ సూపర్‌ గిల్లీస్‌, దిండిగుల్‌ డ్రాగన్స్‌ తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టుతో తిరుప్పూర్‌ క్వాలిఫయర్‌-2లో తలపడుతుంది. క్వాలిఫయర్‌-2లో గెలిచిన జట్టు ఆగస్ట్‌ 4న జరిగే ఫైనల్లో కోవై కింగ్స్‌ను ఢీకొంటుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement