తమిళనాడు ప్రీమియర్ లీగ్ 2024లో ఓ ఫన్నీ సీన్ జరిగింది. మధురై పాంథర్స్-చెపాక్ గిల్లీస్ మధ్య జరిగిన మ్యాచ్ సందర్భంగా ఓ బ్యాటర్ భారీ సిక్స్ కొట్టగా.. బంతి స్టేడియం బయట పడింది. ఆ సమయంలో అక్కడ ఉన్న ఓ వ్యక్తి బంతిని తీసుకుని తిరిగి ఉచ్చేందుకు నిరాకరించాడు. ఇవ్వను పో ఏం చేసుకుంటారో చేసుకోండన్నట్లు ఆ వ్యక్తి ప్రవర్తించాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరలవుతుంది.
A must watch moment in TNPL. 😀👌
- Peak gully cricket vibe when an outsider took the ball & not giving it back...!!! pic.twitter.com/N5iah4NmUT— Johns. (@CricCrazyJohns) July 29, 2024
కాగా, ఆ మ్యాచ్‌లో చెపాక్ గిల్లీస్‌పై మధురై పాంథర్స్ 9 పరుగుల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాంథర్స్.. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేయగా.. ఛేదనలో పోరాడిన చెపాక్ గిల్లీస్ లక్ష్యానికి 10 పరుగుల దూరంలో నిలిచిపోయింది. 55 పరుగులు చేసి పాంథర్స్ ఇన్నింగ్స్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచిన లోకేశ్వర్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు. ప్రదోష్ రంజన్ పాల్ (52) పోరాడినప్పటికీ.. చెపాక్‌ను గెలిపించలేకపోయాడు. కార్తీక్ మణికందన్ 3 వికెట్లు తీసి చెపాక్‌కు దెబ్బకొట్టాడు.
Comments
Please login to add a commentAdd a comment